May 6, 2024

అప్పగా పిలవబడే నాన్న

రచన: లక్ష్మీ రాఘవ

తండ్రిని అప్పగా పిలవబడే రాయలసీమ వాడు,
నాకు తెలిసీ ఎప్పుడూ ప్యాంటు వెయ్యని వాడు,
తెల్లటి ఖద్దరు పంచె కుర్తా ధరించిన వాడు,
నల్లని వాడైనా అందగాడు,
అవినీతి మాట కూడా తెలియని రాజకీయ నాయకుడు,
ప్రజలలో పాపులర్ అయినవాడు,
రాజకీయంలో అపర చాణుక్యుడుగా పేరు గాంచిన వాడు,
ఎత్తుకు పై ఎత్తుగా పావులు కదిపినవాడు,
ఎందరికో ఆదర్శమైన వాడు, అందరికీ నావాడు!
తొమ్మిదిమంది పిల్లలకు తండ్రి అయినవాడు,
కానీ, ఇంట్లో మాత్రం దొరకని అరుదైనవాడు,
ఎప్పుడూ పిల్లలను ముద్దు చెయ్యని వాడు,
మేము ఏమి చదువుతున్నామో తెలియని వాడు,
దేనికీ మా అభిప్రాయాలు అడగని వాడు,
అంతస్తుకు తగ్గ సంబందాలనే చూసిన వాడు,
నీకీ పెళ్లి ఇష్టమేనా అని అడగని వాడు,
ఆశ్చర్యకరంగా పిల్లలందరికీ మంచి అత్తరిళ్ళను ఇచ్చినవాడు,
మనమలనూ, మనమరాళ్ళనూ దగ్గర చేర్చని వాడు,
అయినా మాకెంతో ఇష్టమైన వాడు,
ఆదార్ కార్డు లా ఎప్పటికీ ఒక గుర్తింపు నిచ్చినవాడు,

అతడే మా ‘అప్ప’ ‘గట్టు సింగం’ గా పేరుగాంచిన నరసింగ రాయడు!!!!!

5 thoughts on “అప్పగా పిలవబడే నాన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *