May 4, 2024

Gausips: Dead people don’t speak-6

రచన: డా. శ్రీసత్య గౌతమి

టైం అయ్యింది. ఏరన్ ఇక మెల్లగా కారు స్టార్ట్ చేశాడు. తాను ప్లాన్ చేసుకున్నట్లుగానే వెళ్ళి రేడియో స్టేషన్ పక్కన షాపులో కూర్చున్నాడు గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా సమాధి చుట్టూ జరిగే విషయాల్ని ట్రేస్ చెయ్యడానికి. సరే… టైం రాత్రి 11.30 అయ్యింది. హటాత్తుగా తన నెత్తి మీద ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా వినబడింది. ఉలిక్కి పడ్డాడు, చుట్టూ చూశాడు.. ఎవరూ లేరు. మళ్ళీ శ్మశానంలో సమాధిని పరిశీలించడంలో మునిగిపోయాడు. సమాధి చుట్టూ ఏదో ఒక మనిషి నడుస్తున్నట్లుగా కనబడింది. ఉలికిపాటుతో వెంటనే మ్యాప్ ని జూం చేసి చూశాడు. మళ్ళీ మనిషి అలికిడి కనబడలేదు. కానీ తన చెవి దగ్గిర ఎవరో గుస గుస లాడారు, ఏదో పేరు చెప్తున్నట్లుగా వుంది. కానీ సరిగ్గా అర్ధం కాలేదు. అలాగే తదేకంగా కంప్యూటర్లో చూస్తున్నాడు. మనిషి కదలికని మళ్ళీ గమనించాడు కానీ ఆడో, మగో స్పష్టత లేదు. ఆ మనిషి కూర్చుని సమాధి మీదకి వంగినట్లుగా కనబడుతున్నది, అలా ఒక నిముషం పాటు జరిగి వుండవచ్చు. ఆ సమయం లోనే తన చెవిదగ్గిర మళ్ళీ ఒక వాయిస్ గుస గుస వినిపిచింది. ఈసారి తాను విన్న పేరు టాం ప్యాట్రిక్.
“వాట్..టాం ప్యాట్రిక్?” స్వగతం అనుకున్నాడు. కానీ ఆ క్షణం నమ్మలేదు. ఏదో ముందు రాత్రి కాస్త మందేసుకోవడం వల్ల ఏదో తిక్క తిక్క ఆలోచనలు కలుగుతున్నాయేమో అనుకున్నాడు. ఈ చిన్న అంతరాయంలో సమాధి దగ్గిర వున్న మనిషిని ట్రేస్ చెయ్యడం మిస్ అయ్యాడు.
“ఛా.. ఎంతపని జరిగింది? అనుకున్నాడు ఏరన్. అయినా కదలకుండా మళ్ళీ అలాగే ట్రేస్ చేద్దామని కూర్చున్నాడు ఒకవేళ ఇంకా ఏదైనా క్లూ లు దొరుకుతాయేమో అని. అంతేగాని తన చెవిలోని గుస గుస ని పట్టించుకోలేదు.
కాసేపు అక్కడే కూర్చొని ఇక ఏదీ కనబడకపోయేసరికి, ఇక వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. కారు స్టార్ట్ చేశాడు. వెళ్ళుతూ వెళ్ళుతూ రేడియో స్టేషన్ వైపు చూశాడు. టైం అప్పటికి 12.30 కూడా అయ్యింది. హడావిడిగా అనైటా రేడియో స్టేషన్ లోకి వెళ్ళడం కనబడింది. అనైటా ని చూసాక తాను షాపులోనే కాసేపు ఆగాడు ఎందుకొచ్చిందో కనిబెడదామని. కానీ ఆమె ఎప్పటికీ బయటికి రావడం లేదు, తాను లోపలికి వెళ్ళాలని కూడా నిర్ణయించుకోలేదు ఎందుకంటే తాను అమాండాని కలవడానికి వెళ్తున్నట్లు గా అనైటాకి చెప్పాడు కాబట్టి. ఆ అబద్దాన్ని అలానే కంటిన్యూ చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఇక తనకి నిద్ర కూడా వస్తున్నది, బయలుదేరాడు.
*****
హోటల్ రూం కి వచ్చాడు, ఇక నిద్రకుపక్రమించాడు. తన సెల్ ఫోను మ్రోగడం మొదలుపెట్టింది. ఇంత రాత్రయ్యాక ఎవరు చేసుంటారబ్బా అనుకొని తీశాడు.
“హలో”- ఏరన్. అవతలినుండి రెస్పాన్స్ లేదు. మళ్ళీ రిపీట్ చేశాడు రెస్పాన్స్ లేదు. ఇక పెట్టేద్దామనుకునే టప్పటికి వాయిస్ వినబడడం మొదలయ్యింది. ఎప్పటిలానే వింతధ్వనులు, వాయిస్ ఎక్కడినుండో లోపలినుండి వస్తున్నట్లు వినబడుతున్నది. ఏరన్ ఇంతకుమునుపులా ఇక భయపడడం మానేశాడు. దీర్ఘమైన, తీక్షణమైన అటెంప్ట్ ఇచ్చాడు.. ఎలాగైనా దాన్నీ తేల్చేయాలని.
అలాగే ఫోనుని పట్టుకొని కూర్చున్నాడు. ఆ వాయిస్ ది మళ్ళీ ఆ కుర్రాడి వాయిస్. ఈసారి ఫోర్, థ్రీ, టూ, వన్ అని చెప్పి ఆగిపోయాడు. మళ్ళీ కాసేపాగి టాం ప్యాట్రిక్ అని రిపీట్ పేరు చెప్పాడు. ఆ తర్వాత.. కీచు మని శభ్దం వచ్చి, కర్ణభేరి నొప్పెట్టింది. ఆ తర్వాత ఆ శభ్దం ఆగిపోయింది అంటే ఇక ఫోన్ ఆగిపోయింది అనుకున్నాడు ఏరన్. ఫోన్ ఆపేశాడు.
*********

ఏరన్ దీర్ఘాలోచనలో పడ్డాడు. ఈసారి తన సెల్ కి వచ్చింది. అంటే ఒక పక్క రేడియో స్టేషన్ కి, ఇంతకు మునుపు తన హోటల్ ఫోన్ కి, ఇప్పుడు ఏకంగా తన సెల్ కి కాల్స్ చేస్తున్నారు. చూస్తుంటే ఎవరో దీన్ని చేస్తున్నారు ఆ కుర్రాడి పేరు మీద. ఇదేదో నిగూఢంగా వున్న రహస్యం ఏదో గ్యాంగ్ తనని చుట్టుముట్టి వుంది, ఇది ఏ స్పిరిటో చేస్తున్న పని కాదు అని గట్టిగా అనుకొనే సరికి తనకు ఈ కేసు గురించి ఏదో ఒక అవుట్ లెట్ కనబడుతున్నట్లుగా అనిపించింది.
మళ్ళీ కాసేపట్లోనే తాని టాం ప్యాట్రిక్ అనే మాటను గుర్తు తెచ్చుకున్నాడు. ఆ పేరుని ఎవరో తనకు చెవిలో ఊదారు, అదే పేరుని మళ్ళీ ఈ కుర్రాడు సెల్ ఫోన్ లో కూడా చెప్పాడు. అదేంటది????
ఇలా ఆలోచిస్తుంటే తనకు దొరికిన అవుట్ లెట్ మూసుకుపోతున్నట్లు గా అనిపించింది. మళ్ళీ స్పిరిట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.
తాను చదివిన లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే అంశాలను మళ్ళీ ఒకసారి మననం చేసుకున్నాడు. ఒకవేళ ఏదైనా ఆత్మ తనని మిగితా జనాల్ని కూడా వెంటాడుతూ ఏదైనా క్లూలు ఇస్తున్నదా? అది మేము సరిగ్గా క్యాచ్ చెయ్యలేకపోతున్నామా? అనే ఆలోచన లోకి దిగాడు.
ఈ కేసు స్పిరిట్ కి సంబంధించిన కేసా? లేక ఏదైన క్రైం స్టోరీ యా? లేక రెండింటి కాంబినేషనా? ఏది ఏమైనా ఇది చేధించవలసిందే. ఏదో ఒక గొప్ప రహస్యం మాత్రం దాగి వుంది అని అర్ధం చేసుకున్నాడు. ఇది చేదించాలంటే ఇమ్మీడియట్ గా ఏమి చెయ్యాలి?
ఆ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే అంశాలమీద వ్రాసిన రచయితని కలవాలి, తనకున్న కొన్ని డౌట్లని క్లారిఫై చేసుకోవాలి.
అనుకున్నదే తడవు.. మళ్లీ ఆ వెబ్ సైట్ కి వెళ్ళి రచయిత వివరాలను సేకరించాడు.
రచయిత వ్రాసిన ప్రకారం.. శరీరం పోయాక ఆత్మ తన అతీంద్రియ శక్తులతో భూమి పైనే వుంటంది. అలాగే ఆ కుర్రాడి ఆత్మ కూడా వుండి వుంటుంది కదా. అతని ఆత్మకు ఇతరులతో కమ్యూనికేట్ చేసే శక్తి వున్నాదా? ఈ కేసుని రచయితతో లేకా ఆ రచయిత ఇంకెవరినైనా ( వీటి పైన స్టడీస్ చేసిన వాళ్ళు) అప్పజెప్పితే వాళ్ళతో కలిసి ఎనలైజ్ చేసి ఈ విషయాన్ని చేధించాలని ఏరన్ నిర్ణయించుకున్నాడు.

**********************

ఇంకా వుంది…

2 thoughts on “Gausips: Dead people don’t speak-6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *