May 3, 2024

ఒకోసారి యింతే…!!

రచన: -డా. విజయబాబు, కోగంటి

ఒకోసారి యింతే!
నీతో ప్రతి మాటలో
ఒక మెలకువ
ఒకో సారి వెలుగులోకీ
ఒకో సారి దుఃఖానికీ.

మాటకు అటు నీవూ
ఇటు నేనూ
అయినపుడు
మౌనమే పదాలుగా
వెలుగుకో దుఃఖానికో
వంతెన కడుతుంది.

ఒకోసారి యింతే
యే అలా కదలని సరస్సులా
మనస్సు
నిశ్చలంగా, స్తబ్ధంగా!
ప్రతిఫలించి
వెన్నెలపరిచే ఆకసానికీ
అర్ధం కాకుండా, యిలా…

1 thought on “ఒకోసారి యింతే…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *