May 3, 2024

నువ్వూ-నేనూ

రచన: శ్రీసత్యగౌతమి

Rendu Gulabeelu

సూరీడుతో దిశను మార్చుకుంటుంది పొద్దుతిరుగుడు
చంద్రుడు రాలేదని చిన్నబుచ్చుకుంటుంది కలువ రేకు

పగలే వెన్నెల హృదయం ఊయలై పులకరించు తామరలు
రాత్రి వెన్నెల్లన్నీ పట్టి నింపుకొని సువాసించు సిరి మల్లెలు

హరివిల్లు కుంచెలతో రంగులద్దుకొను కనకాంబరాలు
తెల్లటి మేఘాల గాలి సోకి తళుక్కుమను నందివర్ధనాలు

సంజె కెంజాయిల్లో నిక్కబొడుపులు రామబాణాలు
నీలాకాశం అంచున వ్రేలాడే జరీదారాలు నీలికలువలు

అయితే ఏం… గగనసీమన సూర్యచంద్ర గమనాలు
కాస్త సన్నగిల్లితే చాలు ఉసూరుమని సొమ్మసిల్లు

ఏ గమనాలకూ సడలవు…. ఏ రుతువులకూ లొంగవు
స్వర్గాన మధువువని నుండి దేవుని చేజారిన ఈ గులాబీలు

అందమైన ప్రేమలేఖలో అక్షరాలు అది ఒకటి నువ్వు ఒకటి నేను !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *