May 8, 2024

కీరవాణి – రాగమాలిక

రచన: విశాలి పెరి

కీరవాణి రాగము కర్ణాటక సంగీతంలో 21వ మేళకర్త రాగము. కీరవాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వీనిలో కళ్యాణ వసంతం, సామప్రియ, వసంత మనోహరి ముఖ్యమైనవి.
ఈ రాగం లోని స్వరాలు చతుశృతి ఋషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 57 మేళకర్త సింహేంద్ర మధ్యమ రాగానికి శుద్ధ మధ్యమ సమానము. ఈ రాగము రాత్రి వేళలలో వినదగిన రాగము.

ఆరోహణ : స రి గ మ ప ద ని స

అవరోహణ : స ని ద ప మ గ రి స

కీర్తనలు :

అంబా వాణి నన్నాదరించవే – హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్
కలికియుండే – త్యాగరాజ స్వామి
కలిగియుంటే కదా – త్యాగరాజ స్వామి
శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే గురువరం –

ఈ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు :

* ఓహోహో పావురమా – స్వర్గ సీమ
* వల్లభాప్రియ వల్లభ – శ్రీ శ్రీకాకుళపు ఆంధ్ర మహా విష్ణువు కథ
* వినుడు వినుడు రామాయణ గాధ – లవ కుశ
* జలకాలాటలలో – జగదేక వీరుని కథ
* గజ్జా ఘళ్లుమంటూంటే – సిరిసిరిమువ్వ
* కొంటె చూపులెందుకు లేరా జుంటి తేనె అందిస్తారా – శ్రీమంతుడు (పాతది)
* ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా – విప్రనారాయణ
* కనుపాప కరవైన కనులెందుకో – చిరంజీవులు
* కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే – అన్వేషణ
* తాళి కట్టు శుభవేళ – అంతు లేని కథ
* రండి రండి రండి దయచేయండి – రుద్రవీణ
* ఎన్నెన్నో అందాలు – చంటి
* ఓ ప్రేమా నా ప్రేమా – చంటి
* ఊరుకో హృదయమా – నీ స్నేహం
* ముత్యాల చమ్మ చెక్క ముగ్గులేయంగా – మువ్వా గోపాలుడు
* ఓ పాపా లాలి జన్మకే లాలి – గీతాంజలి
* కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెల్లా – కొండవీటి దొంగ
* ఓ ప్రియా ప్రియా – గీతాంజలి
* అరె ఏమయ్యింది – ఆరాధన
* ఎదలో లయ ఎగసే లయ – అన్వేషణ
* పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి – నువ్వొస్తావని
* ఇలలో జరిగే శిధిలాకాశము – అన్వేషణ
* ఎదుటా నీవే… – అభినందన
* సిరిమల్లె పువ్వా – పదహారేళ్ల వయసు
* నిండు నూరేళ్ళ సావాసం – ప్రాణం
* నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా – సంతోషం
* కోకిల.. కోకిలా కోకిలా – కబడి కబడి
* కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం – స్వయంవరం

ఈ రాగములో ఉన్న కొన్ని హింది పాటలు :
( ఓ.పి. నయ్యర్ స్వరపరచిన చాలా పాటలు ఈ రాగములో ఉండటం విశేషం)..

* యాద్ నా జాయే బీతే దినోకా – దిల్ ఏక్ మందిర్
* గీత్ గాతా హు మై గున్ గునా తా హు మై – లాల్ పత్తర్
* ఆజా సనం మధుర్ చాంద్ని మే హుం – లవ్ మారేజ్
* దిల్ కి గిరహ్ ఖోల్ దో – రాత్ ఔర్ దిన్
* సున్ చంపా సున్ తారా – అప్న దేష్
* మేరి భీగి భీగి సి – అనామిక
* ఆనే వాలా పల్ జానేవాలా హై – గోల్ మాల్
* తుం బిన్ జావు కహా – ప్యార్ కా మోసం
* మై ప్యార్ క రాహీ హూ – ఏక్ ముసాఫిర్ ఏక్ హసీన్
* పుకార్తా చలా హూ మై – మేరే సనం
* ఆఖో సే ఉతర్ తి హై దిల్ మే – ఫిర్ వొహీ దిల్ లాయా హు
* ఆవో హుజూర్ తుంకో – కిస్మత్
* యే హై రేష్మి జుల్ఫే – మేరే సనం
* ఎక్ పర్దేసి మేరా దిల్ లే గయా – ఫల్గున్
* కిత్నే ఖలి కిలే హై చమన్ మే – చించినాతి బబ్లో బూ
* తుం క్యా జునూన్ తుమ్హార యాద్ మే – చించినాతి బబ్లో బూ
* దుఖి మన్ మోరే .. సున్ మెరే కెహనా – ఫంతోష్
* చల్ దియా కర్వాన్ – లైలా మజ్ఞు
* తుంభీ చెలో .. హుంభీ చెలే – జమీన్
* సప్నో మే ఆనా దిల్ మే సమానా – చోర్ అఊర్ చాంద్
* ఓ పియా పియా – డాకు ఔర్ ఇన్సాన్
* శుభహ్ నా ఆయి షాం నా ఆయి – ఛ ఛా ఛ
* రూప్ రంగ్ సే మర్తా ఆయా – శిక్ష
* యే సమా .. సమా హై ఏ ప్యార్ కా – జబ్ జబ్ ఫూల్ ఖిలే
* మామా కల్లు మామా – సత్య
* తుం హవా హై.. తుం ఫిజా హై – ఫిజా
* చార్ దిన్ బహార్ కే – రుక్సానా
* మెర దిల్ యే పుకారే ఆజా – నాగిన్
* తుమ్హార ప్యార్ చాహియే – శిక్ష
* తుమ్హి మేరి పూజా హో – సుహాగ్
* తూ బేమిసాల్ హై తారీఫ్ క్యా కరూ – బ్రహ్మచారి
* పర్బత్ కే ఇస్ పార్ – సర్గం
* మై గావూ తుం సోజావో – బ్రహ్మచారి
* కణయ్య తేరి మురళి – న్యూ ఢిల్లి
* కల్ కి దౌలత్ ఆజ్ కి ఖుషియా – అస్లి నక్లి
* రింజిం గిరే సావన్ – మంజిల్
* తూ ప్యార్ క సాగర్ హై – సీమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *