May 5, 2024

ఓ చెరగని సంతకం

                                                సైదులు ఇనాల

 

అన్ని పనులు అయ్యాయని

వెన్ను వాల్చేవేళ

అనుకోని అథిదుల్ని

ఆహ్వానించాల్సివచ్చినప్పుడు

చిరునవ్వు మొలిపించడం

ఆమెకే సాద్యమైన పని

పారే శలయేరు నడక

ప్రతి పలకరింపులోనూ ఓ

దగ్గరితనం ఆమె సొంతం

పెన్సిల్ గీతల్నిచెరిపే ఎరేజర్ లా

‘జానూ’ తలనొప్పంటె

చిటికెలో తెచ్చిచ్చే తేనీరు

ఎంతచిక్కగానో

అచ్చం అమ్మ పాలలా…

నరాలలోకి పాకి

కరకరాపొద్దై పొడిపిస్తుంది నన్ను

బడినుండివచ్చిన

మాచిన్నది

అరుపులాంటి కేక

“అమ్మా  ఆకలి”

దోరగా ప్రేమని కలిపిన

అటుకులవుతుంది

ఆ అటుకుల్నితిన్న చిన్నదేమో

నియాన్ దీపమవుతుంది

పొద్దుమలిగేవేళ

పెద్దదాని వేళ్ళలో బలపమై

భరతమాత

భవిష్యత్తును చెక్కుతుంది

రాత్రికి నావైపుకుతిరిగి

“కవిత్వం చెప్పరాదూ”

వాడిపోని అదేచిరునవ్వుతో

కమలమైవిచ్చుకొంటుంది

ఆచెరగని సంతకం నీడన

కాలాన్నిమరచి పోతుంటాన్నేన్

 

2 thoughts on “ఓ చెరగని సంతకం

Leave a Reply to Sateesh Namavarapu Cancel reply

Your email address will not be published. Required fields are marked *