May 7, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా?? 4

 

రచన: అంగులూరి అంజనీదేవి

 

నరేంద్ర తల్లివైపు చూడకుండా ఎటో చూస్తూ

”అత్తా, కోడలూ పులి మేకలా వుండాలంటే ఒకే ఇంో్ల వీలుకాదు. సింప్టంస్ లేనిచోట ఏ అనుబంధం నిలవదు. అనుబంధం లేనిచోట మనుషులు మనుషుల్లా ప్రవర్తించలేరు. ఎప్పుడు చూసినా మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్లే వుంటారు. ఇక జీవించేదెప్పుడు? జీవించటం చేతకానప్పుడు ఎవరు గీసుకున్న గిరిలో వాళ్లుండటమే మంచిది. నా నిర్ణయానికి మీరు అడ్డురావద్దు. నేను కూడా మీకు అడ్డుగా వుండదలచుకోలేదు” అన్నాడు.

అప్పుడు తలెత్తింది తారమ్మ-

”కొడుకు తల్లిదండ్రులకి అడ్డమా నరేంద్రా! ఏం మాట్లాడు తున్నావురా? కోడలికి నాకు పడని మాట నిజమే! ఎందుకంటే ఇన్నాళ్లు నన్ను కోడలు అర్థం చేసుకోలేదో! లేక నేను కోడల్ని అర్థం చేసుకోలేదో తెలియదు కాని నేను చెప్పిన మాట అదివిన్నా నాకు విననట్లే అన్పించేది. నా అహంకారం దెబ్బతినేది. కోపమొచ్చేది. ఆ కోపం మొత్తం ద్వేషంగా మారి వూరికే తిట్టేదాన్ని. నిద్ర లేచినా తిట్లతోనే, పడుకున్నా తిట్లతోనే…. ఎన్ని తిట్టినా నా అహం తృప్తిపడేది కాదు.. ఏ తిట్టు తిడితే కోడలు సహించదో అదే తిట్టి నొప్పించేదాన్ని… తను బాధపడుతుంటే శాంతించేదాన్ని…కానీ ఈ స్థితిలో దాన్ని నేనేం అననురా! ప్రేమ గా చూసుకుంటాను. నీకోసమైనా చూసుకుంటాను. నువ్వు సైన్యంలో వుండటం కోసమైనా చూసుకుంటాను. ఒకప్పుడు సైన్యంలో నా బిడ్డ వున్నాడని ఎవరికీ చెప్పుకోలేదురా! ఎందుకంటే దాని విలువ నాకు అంతగా తెలియక… ఇప్పుడు తెలిసిందిరా! పదిమందికి చెప్పుకుని గర్వపడటం కోసమైనా నేను తృప్తిపడటం కోసమైనా నువ్వక్కడే వుండు. నాకు తృప్తి కలిగించే పని, గర్వపడే పని నువ్వు చేస్తున్నప్పుడు నాకు నీ భార్యకు సేవ చేయడం పెద్ద పని కాదు. అవమానం అంతకన్నా కాదు. సంతోషంగా చేస్తాను నరేంద్రా! నువ్వు నన్ను నమ్ము… భగవంతుని దయవల్ల కోడలికి ఏం కాదు. తొందరగానే కోలుకుంటుంది” అంది తారమ్మ.

నరేంద్ర మాట్లాడలేదు.

”ఇప్పుడు నువ్వు సైన్యంలోకి నీకోసమో! నీ భార్యకోసమో వెళ్లటం లేదు నాన్నా! నాకోసం, నా తృప్తికోసం వెళ్తున్నావనుకో! మొన్న వరకు నువ్వు కేవలం నా కొడుకువే అనుకునేదాన్ని… ఇప్పుడు నువ్వు నా కొడుకువి మాత్రమే కాదు… సైనికుడివి. యుద్ధవీరుడివి. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టగల ధీరుడివి. అలాంటప్పుడు నువ్వు కేవలం నీ భార్యకు సేవ చేసుకుంటూ వుంటానంటే ఎందుకో నచ్చడం లేదురా! నిన్నలా చూడలేను. ఆ పని నేను చేస్తాను. నన్ను నమ్ము. ఇంతకన్నా నేనేం చెప్పలేను. చదువుకున్న దాన్ని కాదుగా!” అంది.

ఆమెలో మార్పు వచ్చిన మాట వాస్తవమే కాని అది ఎన్నో ఏళ్లుగా ఎన్నో నెలలుగా వచ్చింది కాదు. కేవలం ఒక్క మాట, ఒక్క సందర్భం, ఒక్క పరిస్థితి, ఒక్క ప్రవర్తన, ఒక్క మనిషి అంటే ఆ ఈవెంట్ మేనేజర్‌ వల్లనే వచ్చింది. అది వచ్చాక ఆమె ఆలోచనలకి తెలివి పదును పెట్టుకుంది. మంచి చెడుల వ్యత్యాసాలను గమనించుకుంది. జ్ఞానాన్ని పెంచుకుంది. ఇది మంచి మార్పే! కానీ ఇంత జరిగాక ఆ నరేంద్ర ఏం మనిషి మళ్లీ భార్యను తల్లి దగ్గరే వదిలి వెళ్లాడు అని లోకం అంటుందేమో నన్న భీతి కూడా అతనిలో వుంది. తల్లి అంటే నమ్మకం, భార్య అంటే ప్రేమ, దేశం అంటే భక్తి వుంది. ఈ భక్తి కూడా అతనికి ఒక్కరోజులోనో ఒక్క క్షణంలోనో లేక ఎవరో చెబితేనో వచ్చింది కాదు… అతను ఎనిమిదవ తరగతి తెలుగు పుస్తకంలో ఆఖరి పేజీ దాక కవరు పేజీలోపల భాగంలో వున్న ‘భారత సైనికదళం’ అన్న వాక్యం చదివినప్పటి నుండి వచ్చింది. ఆ క్షణం నుండే అతనికి ఆ వాక్యం మనసులో పడిపోయింది. అతను పెరిగేకొద్దీ అది బీజమై అంకురించింది. ఎలాగైనా సైనిక దళంలోకి వెళ్లాలనుకున్నాడు. సతీష్‌చంద్రను కూడా తనతో కలుపుకున్నాడు. సతీష్‌చంద్ర మొదట్లో అంత ఆసక్తి చూపకపోయినా తర్వాత స్ట్రాంగయ్యాడు… అతను కూడా అత్యున్నతమైన జీవితం, ధైర్యసాహసాలు, గౌరవ మర్యాదలతో కూడిన పరిపూర్ణ జీవితం పొందాలని, లక్షల మందిలో ఒకడిగా – ఒక్కడే లక్షల మంది పెట్టుగా సమున్నతంగా ఎదగాలని తనను తాను మౌల్డ్‌ చేసుకున్నాడు…. ఇద్దరు కలిసి ఒకేసారి వెళ్లారు. సతీష్‌చంద్ర మిలటరీలోకి, నరేంద్ర నేవీలోకి…

వెళ్లేముందు అనుకోలేదు తన లైఫ్‌లోకి సౌమ్య అనే అమ్మాయి వస్తుందని, పరిస్థితులు ఇలా వికటిస్తాయనీ…! ఇప్పుడేం చేయాలన్నా ఒకవైపు దేశం మరోవైపు భార్య, ఇంకోవైపు తల్లి కన్పిస్తోంది. దేనివైపు మొగ్గు చూపినా… ఒకదాన్ని మాత్రం తప్పకుండా పోగొట్టుకోవలసి వస్తుంది అని మనసులో అనుకున్నాడు నరేంద్ర.

తారమ్మ అతను మాట్లాడకపోవడం చూసి ”మనం భయపడేకొద్దీ అంతా భయంగానే వుంటుంది నరేంద్రా! ఒక్కసారి ధైర్యం తెచ్చుకో! నీ భార్యకేం కాదు. నువ్వెళ్లి నీ డ్యూటీ చేసుకో!” అని అంది.

”ఏం నాన్నా!” అన్నట్లు శేషేంద్ర వైపు చూశాడు నరేంద్ర.

”ఏం చెప్పను నరేంద్రా! మీ అమ్మ ఎలా చెబితే అలా చేద్దామనిపిస్తోంది. తను చెప్పేది కూడా మనం వినాలి. తప్పయితే చెప్పదు. మరీ అంత దుర్మార్గురాలు కూడా కాదు. కాకుంటే పరిస్థితులు అలా ఎదురుతిరిగాయి. పరిస్థితుల ప్రభావం వల్లనో లేక ఇంకేమో నాకు తెలియదు కాని ఇక నుండి మీ అమ్మ కోడలిలో నిన్ను చూసుకుని బ్రతకాలని నిర్ణయించుకున్నట్లుంది. లేకుంటే అది ఇంత పట్టు పట్టదు.” అన్నాడు శేషేంద్ర.

బ్యాగ్‌ని బలంగా లేపి నరేంద్ర భుజానికి తగిలిస్తూ ”నాకు ఇక నుండి కొడుకైనా, కోడలైనా, కూతురైనా సౌమ్యనే నరేంద్రా! నువ్వు ఆగకు. వెళ్లు. వెళ్లి మళ్లీ రాకు. దేశం కోసం నువ్వు ఏం చెయ్యాల్సి వచ్చినా అది ఎంత ప్రమాదమైనా వెన్ను చూపకు. ఎదురు నిలువు” అంటూ బస్‌వరకు నరేంద్రను సాగనంపింది తారమ్మ. తారమ్మతో పాటు శేషేంద్ర కూడా వున్నాడు.

నరేంద్ర బస్సులో కూర్చున్నాక తారమ్మ, శేషేంద్ర కిటికీ దగ్గరకి వచ్చి నిలబడ్డారు. బస్‌ కదిలేంత వరకు ఆవు దూడకోసం  తాపత్రయ పడ్డట్లు ఆ బస్‌ చుట్టూ తిరిగారు. వాళ్లలా తిరుగుతుంటే మనసంతా గుంజినట్లైంది నరేంద్రకి… ఎంతయినా వాళ్లు తన తల్లిదండ్రులు. తనతోపాటు తన ఇష్టాలను, తన అభీష్టాలను ప్రేమించేవాళ్లు. అభిమానించేవాళ్లు ఈ ప్రపంచంలో వాళ్లిద్దరే! అందుకే తన మనసును అర్థం చేసుకుని తనను ముంబై పంపిస్తున్నారు అని అనుకున్నాడే కాని ఇంకోలా అనుకోలేకపోతున్నాడు.

బస్‌ కదిలి ఓ కిలోమీటర్‌ ప్రయాణం చేశాక తన మొబైల్లోంచి అంకిరెడ్డికి కాల్‌ చేశాడు నరేంద్ర.

అంకిరెడ్డి మొబైల్‌ స్క్రీన్‌ మీద నరేంద్ర పేరు కన్పించగానే ఆన్‌ బటన్‌ నొక్కి ”చెప్పు నరేంద్రా!” అన్నాడు.

”నేను ముంబై వెళ్తున్నాను అంకుల్‌! బస్‌లో వున్నాను. ఇప్పుడప్పుడే రాను. అది చెబుదామనే మీకు కాల్‌ చేస్తున్నాను. మీరు అప్పుడప్పుడు వెళ్లి సౌమ్యను చూస్తుండండి!” అంటూ తన తల్లిలో వచ్చిన మార్పును, తన తల్లి తనకు చెప్పిన ధైర్యాన్ని అంకిరెడ్డితో పంచుకున్నాడు.

అంకిరెడ్డి ఆశ్చర్యపోయి విన్నాడు… నమ్మలేకపోతున్నాడు.

ఊరిమనిషిలా, మెట్టమనిషిలా, మట్టి మనిషిలా, మహా గయ్యాళిలా వున్న తారమ్మలో ఇంత దేశభక్తా? ఇది నమ్మొచ్చా! ఏమో! అప్పుడప్పుడు సౌమ్య దగ్గరకి వెళితే గాని అసలు రహస్యం బయటకు రాదు అనుకున్నాడు.

”నేను తప్పకుండా సౌమ్య దగ్గరకి వెళ్తాను నరేంద్రా! నువ్వు వుండట్లేదు కాబట్టి రోజుకోసారైనా వెళ్లి చూసొస్తాను. నువ్వు వెళ్లగానే కాల్‌ చెయ్యి. సతీష్‌చంద్ర ఫోన్‌ కలవటం లేదు. నువ్వెళ్లాక వాడికి కాల్‌ చేసి నాకు అర్జెంట్  గా కాల్‌ చెయ్యమని చెప్పు!” అన్నాడు.

”ఓ.కె. అంకుల్‌!” అన్నాడు నరేంద్ర.

బస్‌ వెళ్తున్న ఏరియాలో సిగ్నల్స్‌ లేకపోవడంతో కాల్‌ క్‌ అయింది.

జ              జ              జ

ఉదయాన్నే నిద్రలేచి ఎప్పటి లాగే వాకింగ్‌కెళ్లాడు అంకిరెడ్డి. కాలేజీ ప్రాంగణంలో కారు దిగి గ్రౌండ్‌ వైపు నడుస్తుంటే మధ్యలోనే వాసుదేవ్‌, నాయక్‌, జాన్‌ కలిశారు.

జాన్‌ వాళ్ల దగ్గర ఎక్కువసేపు ఆగకుండా

”హాయ్‌ ఫ్రెండ్స్‌! గుడ్‌మార్నింగ్‌” అని చెప్పి వాళ్లకన్నా వేగంగా అడుగులు వేస్తూ గ్రౌండ్‌వైపు వెళ్లాడు. నాయక్‌ కూడా జాన్‌ని ఫాలో అయ్యాడు.

ఇక మిగిలింది అంకిరెడ్డి, వాసుదేవ్‌… వాళ్లిద్దరు ఎంతోకాలం తర్వాత కలిసినట్లు, మ్లాడుకోవలసింది చాలా వుందన్నట్లు నెమ్మదిగా నడుస్తున్నారు.

అంకిరెడ్డి ముందుగా వాసుదేవ్‌తో ”నరేంద్ర తెలుసుగా వాసూ! మా అబ్బాయి ఫ్రెండ్‌! అతనికి జీవితం మొదటి పరీక్ష చాలా క్రిటికల్ దే పెట్టింది” అన్నాడు.

వాసుదేవ్‌ నవ్వి ”మనిషి మానసికంగా, శారీరకంగా దృఢంగా వుండి మంచి ఆలోచనలు చేస్తూ వుంటే జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా పాస్‌ అవుతూనే వుంటాడు. ర్యాంకుల దిశగా వెళుతూనే వుంటాడు. నరేంద్ర గురించి నువ్వు అప్పుడప్పుడు చెబుతుంటే విన్నాను కదా! అతను పర్‌ఫెక్ట్‌లీ మాన్‌! అతన్ని ఏ పరీక్షా ఏమీ చెయ్యదు. ష్యూర్‌!” అన్నాడు.

అంకిరెడ్డి బాధగా ముఖం పెట్టి ”అతని భార్య కోమాలో వుంది వాసూ!” అన్నాడు.

అప్పుడు కూడా వాసుదేవ్‌ నవ్వుతూనే ”అతను సైన్యంలో వున్నాడు కదా! లక్ష్మణుడు లేనప్పుడు ఊర్మిళ నిద్రలో వున్నట్లు నరేంద్ర భార్య కూడా నిద్రలో వుంది.  కొంతకాలం అలా వున్నా నోప్రాబ్లమ్‌! తర్వాత ఆమె అంతి ఆమెనే మేల్కొంటుంది. తొందరేముంది” అన్నాడు.

అంకిరెడ్డి ఆశ్చర్యపోతూ ”మీ మిలటరీవాళ్లు ఇలా ఎలా వుండగలుగుతారు వాసూ! ఇలా వుండాలంటే ఎక్కడ ట్రైనింగ్‌ తీసుకోవాలో చెప్పు! ముందుగా నేను వెళ్లి తీసుకుంటాను” అన్నాడు.

”జీవితమే ఓ ట్రైనింగ్‌ సెంటర్‌! దాన్ని వదిలి ఇంకో సెంటరెందుకు అంకిరెడ్డీ! మన బాధలు, భావోద్వేగాలే మనల్ని నడిపించే గొప్ప ట్రైనర్స్‌! వేరే ఎవరో ఎందుకు? మన జీవితమనే ట్రైనింగ్‌ సెంటర్‌ నుంచే మనం ఏది నేర్చుకున్నా పర్‌ఫెక్ట్‌గా వుంటుందని నా నమ్మకం” అన్నాడు వాసుదేవ్‌.

వాసుదేవ్‌ గంభీరంగా మాట్లాడుతుంటే ఒక్కక్షణం ఆయన వైపు చూసి తిరిగి ముందుకి చూస్తూ ”ఏమోనయ్యా వాసుదేవ్‌! మీ సైనికుల జీవితాలు అంటే అది నేవీ కావచ్చు, ఏర్‌ఫోర్స్‌ కావచ్చు, ఆర్మీ కావచ్చు… చాలా డిఫరెంట్ గా వుంటాయి. ఒక్కోసారి భయం గొలుపుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ నరేంద్ర లేడు. అతని భార్య ఏమైపోవాలి?” అన్నాడు.

”ఏమీ కాదు. బాగానే వుంటుంది”

”అతని తల్లి రాక్షసి…”

”ఆమె పుట్టటంతోనే రాక్షసిలా పుట్టలేదు కాబట్టి ఆమెను నమ్మొచ్చు. చాలా సందర్భాల్లో మనిషిని నమ్మకమే నడిపిస్తుంది అంకిరెడ్డి! ఇంతకీ నీకొడుకు కాల్‌ చేస్తున్నాడా?” మాట మార్చాడు వాసుదేవ్‌.

”రెండు రోజుల నుండి చెయ్యలేదు వాసు!” దిగాలుగా చూస్తూ అన్నాడు అంకిరెడ్డి.

”చేస్తాడు. కంగారేం లేదు. ఈసారి అతను ఇక్కడికి వచ్చినప్పుడు పెళ్లిచేసి పంపు” అన్నాడు.

”పెళ్లా?! బాబోయ్‌ అది మాత్రం చెయ్యను. నరేంద్రను చూశాక పెళ్లంటేనే వద్దనిపిస్తోంది. నా కొడుకు ఇప్పుడే హాయిగా వున్నాడు. వాడిని అలాగే వుండనీయ్‌!” అన్నాడు అంకిరెడ్డి.

”అలాగే వుండనియడమేమిటీ? వింతగా మాట్లాడుతున్నావ్‌!” అన్నాడు వాసుదేవ్‌.

”వింత కాదు, బాధ. అసలు వాడిని ఏదో ఒక కారణం చెప్పి ఆర్మీ నుండే శాశ్వతంగా రప్పించాలని గత కొద్దిరోజులుగా ప్రయత్నించాను వాసుదేవ్‌! ఇక్కడికొచ్చాక పెళ్లి చెయ్యొచ్చని కూడా అనుకున్నాను. కానీ నా భార్య అందుకు ఒప్పుకోవటం లేదు” అన్నాడు.

”ఒప్పుకోవటం లేదంటే.. పెళ్లికా? లేక సతీష్‌ ఇక్కడికి రావానికా?” అడిగాడు వాసుదేవ్‌.

”సతీష్‌ ఇక్కడికి రావడానికే! పెళ్లి గురించి ఇంకా అనుకోలేదు”

”అంటే బావుండదని అనుకోం కాని అంకిరెడ్డీ! మనకన్నా ఆడవాళ్లే చాలా అడ్వాన్స్‌గా వుంటారయ్యా! వుంటున్నారు కూడా. దానికి నిదర్శనం మీ మిసెస్సే! ఆమెలో చూడు ఎంత దేశభక్తినో! కొడుకును సైన్యంలోనే వుంచాలనుకుోంంది. సైన్యం అక్కడ పిష్టంగా వుంటేనే మనం ఇక్కడ ఇంత నిశ్చింతగా వుండగలుగుతామని ఆవిడ కూడా భావిస్తున్నట్లున్నారు” అంటూ మెచ్చుకున్నాడు.

”నా భార్యలో భయం తప్ప దేశభక్తి ఎక్కడిది వాసూ! భక్తి అంటే దేవుడి ముందు కూర్చుని మొక్కటమే దానికి తెలుసు. దేశభక్తికి అర్థమే తెలియదు” అన్నాడు.

ఆయన ఆశ్చర్యపోతూ ”మరి నువ్వేగా సతీష్‌చంద్రను ఇక్కడికి రప్పించాలంటే మీ ఆవిడ ఒప్పుకోలేదన్నావ్‌! అలా ఒప్పుకోలేదంటే ఆమెలో దేశభక్తి, దేశం పట్ల బాధ్యత వున్నట్లే!! అవి లేకుంటే ఏ తల్లీ తన కొడుకును సైన్యంలోకి పంపదు. ప్రతి సైనికుడూ ఒక తల్లి కొడుకే… సైనికుడికన్నా ఎక్కువ ధైర్యం, అతన్ని కన్నతల్లిలోనే వుంటుంది. తల్లి అభిరుచిని బట్టే కదా కొడుకులు తీర్చిదిద్దబడతారు.” అన్నాడు వాసుదేవ్‌.

”నువ్వన్నది ఎంత వరకు కరక్టో నాకు తెలియదు కాని సతీష్‌ని ఏ డాక్టర్‌గానో, ఇంజనీర్‌గానో తీర్చిదిద్దాలన్నది మాత్రం మాధవిలో బలంగా వుండేది. మా ఇంో్ల వాడు చిన్నవాడు కాబ్టి ఆమె ఆలోచనలన్నీ వాడి కెరీర్‌ చుట్టే వుండేవి. కానీ వాడు అలా కాక పోవటంతో ఆ దిగులు మాధవిని బాగా కుంగదీసింది. ఇక అప్పి నుండి మాధవి ఎప్పుడు చూసినా మనం మన పిల్లలకి ఎదురుగా నిలబడి వాళ్లను పరిశీలిస్తే లోకం మన గురించి ఏమనుకుంటుందో తెలిసిపోతుందండి! సతీష్‌చంద్ర మనకు ప్టుాల్సిన వాడు కాదు. మన కొడుకని చెప్పుకోవాలంటేనే నాకు ఎలాగో వుోంంది. వాడు కూడా అందరిలా చదివి వుంటే మనకీ బాధ వుండేది కాదు అని నాతో అనని రోజు లేదు. వాడు ఆర్మీలోకి వెళ్లేటప్పుడు కూడా మాధవి డిప్రెషన్‌లోనే  వున్నది… ఇప్పుడు వాడిని ఇక్కడికి రప్పిస్తానంటే భయపడుతోంది. ‘వద్దండీ! వాడిని అక్కడే వుండనివ్వండి! ఏదో దూరంగా వున్నాడు. వాడిని ఎవరూ చూడరు. వాడి గురించి ఎవరూ ఆలోచించరు. లేకుంటే ‘మా పిల్లలు అదయ్యారు ఇదయ్యారు మీ అబ్బాయి ఇదేనా!’ అని నా ముఖంమ్మీదే అంారు. వాడు చదివిన చదువుకు ఇక్కడ చెప్పుకోదగిన పనేమీ రాదు. అదిచూసి నేను బాధపడతాను. ఐనా చదవుకోలేకపోవటం వాడి కర్మ. మన బాధ్యత మనం చేశాం… అంతకన్నా మనం మాత్రం ఏం చేస్తాం.వాడిని మాత్రం అక్కడే వుండనివ్వండి!’ అని నాతో చెప్పుకుంది. అందుకే నేనీమధ్యన సతీష్‌ గురించి  ఎంత భయపడుతున్నా మాధవితో చెప్పటం లేదు” అన్నాడు.

వాసుదేవ్‌ అంకిరెడ్డిని మాధవీలతను అర్థం చేసుకున్నాడు. చాలామంది తల్లిదండ్రులు వేరే పిల్లల తల్లిదండ్రులతో తమను పోల్చుకుాంరు. ప్రతిభావంతులైన పిల్లలతో తమ పిల్లలని పోల్చి చూసుకుంటారు. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ల కోసమే జీవించే తల్లిదండ్రులున్నారు. తమ జీవితం కోసం పిల్లల్ని ప్టించుకోని వాళ్లున్నారు. దేనిలో అడుగుప్టిెనా పీక్‌కి వెళ్లాలన్న తపన పిల్లల్లో వుండాలి కాని పెద్దవాళ్లు కుమిలిపోతే వస్తుందా? పిల్లలకి కష్టానికి వెనుకాడకుండా ముందుకెళ్లమని చెప్పాలి కాని మీ కెరీర్‌ ఇలాగే వుండాలని రిస్ట్రిక్షన్స్‌ పెడితే వస్తుందా?

”చూడు అంకిరెడ్డీ! సమస్యలు వున్నచోటే పరిష్కారాలు వుంటాయి. ఇప్పటి పిల్లల్లో జీవితం పట్ల ఒక క్లారిటీ లేకుండా వుండదు. వాళ్లు తమ తప్పుల నుండే పాఠాలను నేర్చుకుంటున్నారు. అవసరమైన పరిస్థితులను వాళ్లకు వాళ్లే సృష్టించుకుంటున్నారు. సతీష్‌ని కన్నారు, పెంచారు, చదివించారు. మీరు కావాలని పంపారో లేక ఇంకెలా పంపారో తెలియదు కాని అతన్నయితే మిలటరీలోకి పంపారు. పెళ్లి చెయ్యండి! ఇది నా మాటగా తీసుకుని ఆ ప్రయత్నంలో వుండండి! పెళ్లి లేకుండా వుండడం హాయి అనుకోవద్దు… చేతనైనవాడు ఎక్కడ వున్నా సమర్ధుడుగానే వుంటాడు. సింహాన్నైనా మచ్చిక చేసుకుంటాడు. చేతకానివాడు తేనెటీగలతోనైనా తిప్పలు పడతాడు. నీ కొడుకు సైన్యంలోకి వెళ్ళటానికి మీ ప్రయత్నం లేకపోవచ్చు. కానీ అతను ఎంత ధైర్యం లేనిదే, సమర్ధత లేనిదే సైన్యంలోకి వెళ్లడు… పెళ్లయితే చెయ్యి” అంటూ గ్రౌండ్‌లోకి ప్రవేశించాడు.

వాళ్లిద్దరు ఇంకేం మాట్లాడుకోకుండా ఎవరిపాటికి వాళ్లు సీరియస్‌గా నడవటం ప్రారంభించారు.

జ              జ              జ

ఆలోచించగా అంకిరెడ్డికి వాసుదేవ్‌ చెప్పింది సరైనదే అన్పించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లంటేనే కొంతమంది అబ్బాయిలు భయపడుతున్నారు. పెళ్లాయ్యాక కెరీర్‌ని డెవలప్‌ చేసుకునే కన్నా పెళ్లికి ముందే డెవలప్‌ చేసుకోవాలన్న అభిప్రాయంలో వున్నారు. పెళ్లికి ముందే ఒక ఇల్లు, కారు, హోదా వచ్చాక అప్పుడు ఆలోచిస్తున్నారు పెళ్లి గురించి… వాళ్లతో పోలికిలేంటి సతీష్‌చంద్రకి. వాళ్లంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు… పెద్దపెద్ద జీతాలు తెచ్చుకుంటున్నవాళ్లు. జుట్టున్నమ్మ ఏ స్టైల్లోకైనా హెయిర్‌ స్టయిల్‌ మార్చుకోవచ్చు… అలాిం స్టయిలిష్‌ లైఫ్‌ సతీష్‌చంద్రకి ఎలా వస్తుంది? ఎక్కడో సైన్యంలో ఒంటరిగా వుంటూ చలికి, ఎండకి, వర్షానికి తడుస్తూ నేలమీద యుద్ధం చేస్తుాండు. అలాంటి వాడికి జీవితం గురించి, జీతాల గురించి స్పహ ఎక్కడుంటుంది. యుద్ధం వచ్చినప్పుడో ప్రమాదాలు సంభవించినప్పుడో మిడతల్లా రాలిపోయే పరిస్థితి వాడిది… అందుకే వాసుదేవ్‌ చెప్పినట్లు వున్నంతలోనే సంతోషాన్ని నిస్తూ సతీష్‌చంద్రకి పెళ్లిచేస్తే సరిపోతుంది. ఉన్న నాలుగు రోజులైనా నేను ఎక్కడున్నా నాకంటూ ఓ భార్య వుందన్న ఆనందంలోనైనా వుంటాడు అని అనుకున్నాడు అంకిరెడ్డి. ఆయనకు కొడుకు చేస్తున్న జాబ్‌ పట్ల అసంతృప్తే కానీ తృప్తి ఏమాత్రం లేదు.

ఆ రాత్రికే ఇంట్లో అందర్నీ ఓ చోట కూర్చోబెట్టి.

”సతీష్‌చంద్రకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను” అన్నాడు.

ఆనంద్‌ వెంటనే నవ్వి ”వాడికి పెళ్లెందుకు నాన్నా?” అన్నాడు.

అదేంట్రా అలా అనేశావు అన్నట్లు చూశాడు అంకిరెడ్డి. అక్కడే వున్న మాధవీలత ఏమీ అనలేదు. మోక్ష ప్రశ్నార్ధకంగా ఆనంద్‌ వైపు చూసింది.

”అయినా నాకు తెలియక అడుగుతాను. వాడికేం వయసు వుందని పెళ్లి చెయ్యాలి నాన్నా! వాడి వయసు వున్నవాళ్లకి ఇంకా పెళ్లిళ్లు కానేలేదు. లైఫ్‌లో బాగా సెటిల్ అవ్వాలని జాబ్‌ సర్చింగ్‌లోనో లేక ఇంకా పెద్ద చదువులు చదువాలనో ఏ లండన్‌కో, అమెరికాకో వెళ్తున్నారు. వీడిప్పుడు పెళ్లి చేసుకుని ఏం చెయ్యాలి? అదేం అంటే నరేంద్రకి కాలేదా అంటావ్! అయ్యాక అతనేం సుఖపడుతున్నాడు. చూస్తూనే వున్నాంగా!” అన్నాడు.

పక్కనే వున్న మోక్ష ”ఈయనేదో తెగ సుఖపడిపోతున్నట్లు… అలాంటప్పుడు ఈయనెందుకు పెళ్లి చేసుకున్నాడో?” అని మనసులో అనుకుంది.

”అందరి జీవితాలు, అందరి రాతలు ఒకలా వుండవుగా ఆనంద్‌! నరేంద్ర స్థితిగతులు అతని కుటుంబ నేపథ్యం వేరు. మన స్థితిగతులు మన కుటుంబ వాతావరణం వేరు…. అతనితో మన సతీష్‌చంద్రను పోల్చుకోవద్దు” అన్నాడు అంకిరెడ్డి.

”అయితే వాడికి పెళ్లి చెయ్యాలనే నిశ్చయించుకున్నావా నాన్నా!”

”అవునురా!”

”ఆయినా వాడక్కడ! ఆ అమ్మాయి ఇక్కడ! పెళ్లయ్యాక ఇద్దరూ ఓ చోట లేకుండా వాళ్లేం సంతోషపడతారు నాన్నా?” అన్నాడు ఆనంద్‌.

మోక్షకు మండింది. భార్య పక్కన పడుకుని భార్య తెచ్చే జీతం గురించో భార్య తెచ్చే కట్నం గురించో ఆలోచించే ఇలాంటి మొగుళ్లంతా భార్యల దగ్గర తెగ సుఖపడిపోతున్నా? ఈయన మాటలు వినేవాళ్లు నిజంగా ఈయన ఎంత సుఖపడిపోతున్నాడో అని అనుకోరా!

”అవునండీ! సైన్యంలో వుండేవాళ్లకి పిల్లనివ్వాలంటే ఎవరైనా ఆలోచిస్తారని ఇప్పుడర్థమైంది నాకు. మా ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయిల్ని కూడా కదిలించాను. వాళ్లేమన్నారో తెలుసా?”

”ఏమన్నారు?”

”మీ మరిది గారిని పెళ్లి చేసుకుంటే ఏర్‌టెల్‌ సిమ్‌ తీసికెళ్లి వొడాఫోన్‌లో వేసుకున్నట్లు ఐడియా సిమ్‌ తీసికెళ్లి ాా ఫోన్లో వేసుకున్నట్లు వుంటుంది. అంత డిస్ట్రబెన్స్‌ మాకు అవసరం లేదు. మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు అన్నారు. మరి ఇన్ని కోట్లు వున్న వీళ్లెందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావటం లేదు” అంది.

”సైన్యంలో వుండేవాళ్లకి పిల్లనిస్తే లైఫ్‌ అడ్వాన్స్‌డ్‌గా వుంటుందట. అనేక దేశాలు తిరగొచ్చట. చాలా ప్రాంతాలను చూడొచ్చట. బాగా ఎంజాయ్‌ చెయ్యొచ్చట అని కొంతమందికే తెలుసు. వీళ్లు అలా తెలిసిన వాళ్లే అనుకుందాం! పైగా దీనికి మన అదృష్టం కూడా తోడైందని నేను అనుకుంటున్నాను”

”నక్కల పెళ్లికి కుక్కల గోల అన్నట్లు సతీష్‌ పెళ్లికి మన అదృష్టానికి లింకేంటి?”

”వుందిలే!” అన్నాడు సంతోషపడుతూ. అతను రెండు రోజులుగా పడుతున్న ఆనందానికి కారణం ఈ పెళ్లి సంబంధమే అన్న అనుమానం వచ్చింది మోక్షకి. కానీ ఆనంద్‌కి ఎందుకింత ఆనందమో అర్థం కాలేదు.

”ఏమోనండీ మీరెన్ని చెప్పినా నాకు నమ్మబుద్ది కాలేదు. కోట్లు డబ్బు వుండేవాళ్లు అంతకన్నా ఎక్కువ డబ్బు వుండేవాళ్లతో వియ్యమందుతారు కాని మనలాంటి వాళ్లకు అందరు. అందులో పిల్లనిచ్చే దగ్గర అలాంటి వాళ్లకి డబ్బు వల్ల వచ్చే హోదానే ముఖ్యం.”

”వాళ్లకిప్పుడు కావలసింది డబ్బు కాదు. హోదా కాదు. వాళ్లమ్మాయికి పెళ్లి కావటం ముఖ్యం. మనలాగే వాళ్లు కూడా ఎన్నో సంబంధాలు చూసి అలసిపోయి వున్నారని మధ్యవర్తి చెప్పాడు. మన సతీష్‌ ఆర్మీలో వున్నాడన్న డిఫెక్ట్‌ లాంటిదే వాళ్ల అమ్మాయిలో కూడా వుంది. కాకపోతే దానికీ దీనికీ చిన్న తేడా!”

”జోగీ జోగీ రాసుకున్నట్లు డిఫెక్ట్‌కి ఇంకో డిఫెక్ట్‌ను తోడు చేస్తారా? అసలేంటండీ ఆ డిఫెక్ట్‌? అలాంటిదేమైనా వుంటే మామయ్యగారు ఒప్పుకుంటారా?”

”అందుకేగా ముందు నీతో చెబుతున్నది. నువ్వు మా నాన్నను ఈ పెళ్లికి ఒప్పించు. దీనివల్ల మనక్కూడా కొంత లాభం వుంటుంది. ఆ మధ్యవర్తి గత రెండు రోజులుగా అదే మ్లాడుతున్నాడు. నేను ఆలోచించి వెంటనే ఓ.కె. చెప్పేశాను”

”ఏంటండీ ఆ లాభం? అసలా అమ్మాయిలో వుండే ఆ లోపం ఏంటి ముందు అది చెప్పండి!”

”పెద్ద లోపం ఏం కాదు. పెళ్లయ్యాక అమ్మాయిని లండన్‌ తీసికెళ్లి మంచి ట్రైనింగ్ ఇప్పిస్తారట. అక్కడ వైద్యరంగం ఎంత అడ్వాన్స్‌గా వుందో మనకు తెలుసుగా! పెళ్లికి ముందు అయితే సక్సస్‌ కావచ్చు కాకపోవచ్చు అని వాళ్ల అభిప్రాయమట”

”ఏమైనా జబ్బా??”

”ఛఛ జబ్బా పాడా! అలాంటిదేమయినా వుంటే నేను ఒప్పుకుంటానా? సతీష్‌ నాకు తమ్ముడే బాబు! నువ్వు నన్ను మరీ అంత తక్కువగా అంచనా వెయ్యకు. జబ్బుండే పిల్లతో వాడేం సుఖపడతాడు. వాడిక్కడ కొద్దిరోజులు వున్నా అమ్మాయితో కాపురం చెయ్యగలిగే సౌకర్యం వుండాలా వద్దా! జబ్బుంటే అదెలా కుదురుతుంది?”

”జబ్బు లేదంటారు, లండనంటారు, మరేంటో ఆ లోపం చెప్పరు. ఇదో టెన్షన్‌ మళ్లా!”

”టెన్షన్‌ వద్దు. ఏమొద్దు. చెబుతాను విను. ఆ అమ్మాయి కుడి కన్ను మనలాగా కాకుండా ఎక్కువసార్లు కొట్టుకుంటుందట. తల ఒంచుకున్నప్పుడు అదసలు కన్పించనే కన్పించదట. అందువల్లనే ఏమో ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా తల వంచుకునే వుంటుందట. తల వంచుకుని వుండటం అమ్మాయిలకు ఎంత గౌరవం… ఎంత గౌరవం…”

మోక్షకి పొలమారినట్లై తలమీద కొట్టుకుని ”సతీష్‌ ముందు కూడా తల వంచుకునే వుంటుందా? ఒక్కసారి కూడా తల ఎత్తదా? అలాిం అమ్మాయిని సతీష్‌ ఎలా ఒప్పుకుంటారనుకున్నారండీ?”

”ఒప్పుకోక ఏం చేస్తాడు? అదే పెళ్లయ్యాక నరం దెబ్బతిని రెప్ప అదేపనిగా కొట్టుకుంటూ వుంటే పెళ్లాన్ని పోగొట్టుకుంటారా? ఇది కూడా అంతే!”

”అంతేనా?!!”

”అంతేకాదు. కొద్దిగా నలుపు అట”

”నలుపా? ఆ నలుపు వల్లనే కదండీ! నరేంద్ర అన్ని కష్టాలు పడుతున్నాడు. అసలు నరేంద్ర భార్య సౌమ్య గొప్ప అందగత్తె అట. మామయ్యగారు చెప్పారు. కానీ వాళ్ల అత్తగారు ఒప్పుకోరుగా! ఆవిడకి ఆ నలుపే సెంటర్‌ పాయింటయ్యింది”.

”ఆ నలుపు వేరు ఈ నలుపు వేరు.  వాళ్లకు వీళ్లకు పోలికేంటి చెప్పు! పెళ్లయ్యాక అమ్మాయి మన ఇంటికి వచ్చేటప్పుడు సారెలోకి ఖరీదైన మేకప్‌ కొని పంపిస్తారట. అది కూడా యుఎస్‌ఎ ప్రొడెక్ట్‌. మనం కావాలంటే అమ్మాయితోపాటు ఒక బ్యూటీషియన్ని కూడా మన ఇంటికి పంపుతారట. అసలా బ్యూటీషియన్‌కి బదులు రోజూ నువ్వే ఆ పని చేస్తే వాళ్లిచ్చే శాలరీ ముందు మీ ఏర్‌టెల్‌ వాళ్లు ఇచ్చేది ఒన్‌ బై ఫోర్త్‌ కూడా వుండదేమో. ఇంో్లంచి బయటకు పోకుండా డబ్బులు సంపాయించుకోవచ్చు నువ్వు…” అన్నాడు.

”తోడి కోడలికి మేకప్‌ చేసి వాళ్ల దగ్గర శాలరీ తీసుకోవటమా!! మీరసలు సతీష్‌కి సొంత అన్నయ్యనేనా?? నాకు తాళి కట్టిన భర్తేనా?”

”పిచ్చి డౌట్లు పెట్టుకోకు పిచ్చిదానా? చెప్పింది చెయ్‌! ఇది మనం చేస్తే నువ్వీ సిమ్‌లు అమ్ముకునే ఉద్యోగం చెయ్యనవసరం లేదు. హాయిగా ఇంట్లో వుండొచ్చు. వాళ్లు నాకు ఇస్తామన్న డబ్బు మొత్తం నీ పేరుతోనే బ్యాంకులో వేస్తాను. నువ్వు మా నాన్నను ఒప్పించు. మా నాన్న ఎలా చెబితే అలా వుండు సతీష్‌! వాడు కూడా హాయిగా ఆ ఉద్యోగం మానేసి రావచ్చు”

”మీరు సతీష్‌కి అన్నయ్యలా అన్పించటం లేదు” అంది ఆశ్చర్యపోతూ.

”దేవుడిలా అన్పిస్తున్నాను కదూ!” అన్నాడు ఆనందంతో అతని ఛాతి ఉబ్బి షర్ట్‌ కదిలింది.

కాదు బ్రోకర్‌లా వున్నావంటే చెంపలు వాయిస్తాడని ”అలాంటి అమ్మాయితో సతీష్‌కి పెళ్లంటే వూహించుకో లేకపోతున్నాను. కొద్దిగా ఆలోచించాలి. పాపం అతను కూడా సంతోషంగా వుండాలిగా. సతీష్‌ మనిషి చూడానికి ఎంత బాగుంటాడో మన అందరికీ తెలిసిందే!” అంది.

”వాడి మొహంలే! ఎంత బాగుండి ఏం లాభం? అసలు వాడికి, వాడి చదువుకి, వాడు చేస్తున్న ఉద్యోగానికి పిల్లనెవరిస్తారే! వీళ్లయినా వాడి ఫోని ఇంటర్‌ నెట్లో చూసి వాడి ఫిజిక్‌ నచ్చి ఓ.కే. చేశారు. అసలు వాళ్ల అన్నయ్య ఇంటర్‌నేషనల్‌ బిజినెస్‌ చేస్తాడట తెలుసా? అతనికి మన సతీష్‌ నచ్చినంతగా ఎవరూ నచ్చలేదట. అందుకే పిల్లనిస్తామంటున్నారు. లేకుంటే ఎవరిస్తారు చెప్పు!”

”ఐతే! మీరే చెప్పండి మామయ్య గారితో. నావల్లకాదు.”

”దీనివల్ల మనకి చాలా డబ్బు వస్తుందే! నా మాట విను”

”నాకే డబ్బు వద్దు. ఇలాంటి ఆకూ, పూతా తెలియని పనులు నేను చెయ్యను”

”ఆకూ, పూతా ఏంటే? అందుకే అన్నాను. అది సిటీ బయట అడవిలో పుట్టింది. దానితో నా వల్ల కాదని… అయినా నీతో నా పెళ్ళి చేశారు మా నాన్న. నీ అడవి భాషను అర్ధం చేసుకోలేక చచ్చిపోతున్నాను” అన్నాడు.

ఆమె కాస్త సీరియస్‌గా చూసి ”నాకంటూ ఓ స్పష్టత లేకుండా, నా మనసుకు నచ్చకుండా నేనేపనీ చెయ్యను. చెయ్యలేను. నాకీ ఉద్యోగం వుంది. ఇది చేసుకుంటే చాలు” అంది.

వెంటనే అతను వేగంగా చురుగ్గా పెదాలను కదిలిస్తూ…

”పిచ్చిదానా! పిచ్చిదానా! ఏముందే ఈ ఉద్యోగంలో. మైకా గనులున్న రాజా కూడా ఇంతగా మురిసిపోయి వుండడేమో కదే! ఇప్పుడంటే అతను వెళ్లి జైల్లో వున్నాడనుకో! ఏదైనా సాహసం చెయ్యందే వస్తుందా? భయపడితే దొరుకుతుందా? రాజీపడుతూ పోతే వున్నచోటే వుంటాం తెలుసా?” అంటూ ఆమె బుగ్గ పట్టుకొని గట్టిగా పిండాడు. ఆ నొప్పికి ఆమె కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. అయినా ఆమె అరవకుండా ఆ బాధను గొంతులోనే నొక్కుకుంది. కెవ్వున అరవాలనే అతనంత గట్టిగా గిల్లాడని ఆమెకు అనుభవమే! ఆ అరపు విని ఎవరైనా వచ్చి ‘అదేంటి బాబు?’ అని అడిగితే ‘ఏం మీరు గిల్లరా? మీకు భార్యల్లేరా! భార్యల్ని ఎలా గిల్లాలో చాలా వాిల్లో రాసి వుంటుంది చదివి నేర్చుకోండి! వెదవ సంత. వెదవ సంత” అంటాడు. అందుకే పరువు పోతుందని మౌనంగా వుంది.

ఖాళీ అయిన అతని లంచ్‌బాక్స్‌ని కూడా ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లోనే కుక్కి ”సరేలే! నేను వెళ్తున్నా! మళ్లీ ఒకసారి ఆలోచించు. నీ క్లోజ్‌ఫ్రెండెవరైనా వుంటే సెకెండ్‌ థాట్ తీసుకో. ఇది మనకు మంచి ఆఫర్‌…” అంటూ వెళ్లిపోయాడు.

ఆమె చేయి కడుక్కుని లేచి వెళ్లి తన సీట్లో కూర్చుంది. ఆమె బుగ్గ అప్పటికప్పుడే గులాబి రేకును మడిచి వదిలినట్లు కందింది. అది చూసి తన పక్కసీటు అమ్మాయి సన్నగా, సరదాగా, తనకు మాత్రమే కన్పించేలా రహస్యంగా ఒక కన్ను మూసి నవ్వింది. ”ఇదో పిచ్చిది. అవకాశం దొరికితే ‘ఈ’ అంటుంది. అలాగే చూస్తే ఇంకాస్త అడ్వాన్స్‌ అయి ఒళ్లంతా తిప్పుతూ ‘ఈహీ!’ అంటుంది. చూడలేక చావాలి. అనుకోకూడదు కాని ప్రపంచంలో అక్కడక్కడ ఇలాంటి పిచ్చివాళ్లే ఎక్కువగా వున్నారు” అని మనసులో అనుకుంది మోక్ష.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *