రచన: టి.వి.ఎస్.శాస్త్రి
నాకు ఈ మధ్య ఒక కోరిక కలిగింది. మీరు నవ్వుకున్నాసరే! ఆ కోరిక చెప్పితీరుతాను. అది ఏమిటంటే ‘సన్యసించాలని’! ఆధ్యాత్మిక వాసనలు ఎక్కువై సన్యసించాలనుకోవటంలేదు. ప్రాపంచిక సుఖాలమీద మోజు ఎక్కువై సన్యసించాలనుకుంటున్నాను. అబ్బురపడకండి!అటువంటి కోరిక కలగటానికి కారణం, ఈనాటి కొంతమంది ‘సన్యాసుల’ జీవితాలను గురించిన విశేషాలు విన్న తరువాత నాకు మాత్రం అనిపిస్తుంది– బ్రతికితే సన్యాసిగానే బ్రతకాలని!ఈ మధ్య ఒక సన్యాసి కాని సన్యాసి 5 కోట్ల రూపాయల జరిమానాను 3 వారాల్లో కడతానన్నాడు !40 ఏళ్ళు ఉద్యోగం చేసి సంపాదించినా అందులో పావువంతు కూడా మిగుల్చుకోలేం! మనం పొదుపు చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ మధ్యలో తీసుకుంటే టాక్స్ వేస్తారట. మధ్య తరగతి ప్రజలు పెడబొబ్బలు పెడితే దానిని ఉపసంహరించుకున్నారనుకోండి!
ఈరోజు మన దేశంలో విపరీతమైన క్రేజ్ ఉన్నవాళ్ళు–సినిమాతారలు, క్రికెట్ క్రీడాకారులు, రాజకీయనాయకులు మరియూ సన్యాసులు. వీరందరిలో మొదటి స్థానం సన్యాసులదే! ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ సన్యాసులను ఆశ్రయించి, వారి ఆశీర్వాదాల కోసం ఎదురు చూసేవారే!
ఇవన్నీ గాక నా అదృష్టం బాగుంటే, నా వాగ్ధాటి జనానికి నచ్చితే రాబోయే రోజుల్లో నాకు ‘పద్మ’సత్కారాలు కూడా రావచ్చునేమో! ఈ నా కోరికను ముందుగా నా ప్రాణ స్నేహితునికి తెలియచేశాను. వాడు ఆశ్చర్యపోయి–ఇదేమి కోరికరా బాబూ! ఎవరైనా వింటే నవ్వుతారు అని సూక్ష్మంగా మందలించాడు. వాడికి అసలు విషయం చెప్పిన తరువాత ఆనందంతో నా అభిప్రాయంతో ఏకీభవించి, తొందరగా నిర్ణయం తీసుకో!అందులో ఇది మంచి సీజన్ కూడా అని చెప్పాడు. సన్యాసులకు సీజన్ ఏమిటిరా అంటే, వాడు ‘నవరాత్రులు’వస్తున్నాయి, నాలుగు డబ్బులు సంపాదించుకోవటానికి ఇదే అనువైన కాలం అని వాడికున్న పరిజ్ఞానాన్ని కూడా చూపించాడు. సన్యాసం పుచ్చుకున్నా వీడిని వదలకూడదని నిశ్చయించుకున్నాను. సన్యాసం పుచ్చుకుంటే మొదటి లాభం–మనం చేసిన అప్పులు తీర్చనవసరం లేదట! అలా అని ఒక లాయర్ మిత్రుడు చెప్పాడు, చెప్పటమే కాకుండా నాకు న్యాయశాస్త్ర గ్రంధాలను కూడా చూపించాడు. వాడు నాకొక సలహా కూడా ఇచ్చాడు. అదేమిటంటే “సన్యసించే ముందు విపరీతంగా అప్పులు చెయ్యి. తరువాత సన్యసించు”అని. శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేస్తుంటే, అర్జునుడు కృష్ణుని కాళ్ళ వద్ద నమస్కరిస్తూ శ్రద్ధగా వింటున్న దృశ్యం నా కళ్ళ ముందు కనపడింది. ఆ క్షణంలోనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
అదేమిటంటే నా ఆశ్రమానికి వీడినే న్యాయ సలహాదారుడిని చేయాలని! ఆశ్రమాలకు న్యాయ సలహాదారులు కూడా కావాలని వాడు చెప్పేదాకా నాకు తెలియదు. ఇలా నాకు కలిగిన కోరికను అందరికీ చెప్పాను, నా పిల్లలూ భార్యకూ తప్ప!ముందు బయట వాళ్లకు చెబితే, వారి ద్వారానే వీళ్ళకు తెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదీగాక నా కోరికను సమర్ధించటం కోసం, పీకల దాకా ఇరుక్కున్న నా మిత్రులు, నాభార్యా పిల్లలనూ వాళ్ళే చచ్చినట్లు ఒప్పిస్తారు. నేను సన్యసించటానికి అన్నిటికంటే ముఖ్య కారణం–నాకు అమెరికాలో కూడా కొంత బేస్ ఉండటం. కళ్ళ ముందు డాలర్ల కల్పవృక్షం కనపడింది. ఇంతవరకూ బాగానే లాక్కొచ్చాను కదూ! పేరు కూడా నిర్ణయించుకున్నాను–‘శ్రీ సదానందేంద్ర స్వామి’. పేరు కూడా బాగుంది కదూ! ‘సదానందం’ కోసమే కదా సన్యసిస్తున్నది! వేషం భాష ఇవన్నీ పెద్ద విశేషాలేమీ కావు. నా స్నేహితులకు అన్నీ నచ్చాయి. నా కన్నా వాళ్ళ తొందర ఎక్కువైంది. ఎందుకో వాళ్ళ మీద నాకు కొద్దిగా అనుమానం వేసి ఇలా అడిగాను—“ఇంత అవగాహన, సన్యాసుల జీవితాలను గురించి పూర్తిగా తెలిసిన మీరు సన్యసించకుండా, నన్నెందుకు ముందుకు తోస్తున్నారు?”అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం—“నీవు నాలుగు మాటలు మాట్లాడి బ్రతకగలవు. పైగా మహారాజశ్రీ శ్రీగిరీశం గారికి ఉన్నట్లు కొద్దిగా eloquence కూడా ఉంది. ప్రస్తుతపు రోజుల్లో సన్యాసులకు కావలసిన అర్హతలూ, లక్షణాలూ మాలో కన్నా నీలోనే పుష్కలంగా ఉన్నాయి. ” చాలావరకు కన్విన్స్ అయ్యాను. అనవసరంగా ప్రాణస్నేహితులను శంకించినందుకు బాధ కూడా పడ్డాను.
నా స్నేహితుల్లో ఒకడు మాత్రం చాలా భయపడుతున్నాడు. వాడు వేదాంత గ్రంధాలను ఎక్కువగా చదువుతాడు. వాడు చెప్పేదేమిటంటే, –“ఇంత జటిలమైన వేదాంత విషయాలను ఎలా చెప్పగలవు ?మరియూ వినే వాళ్ళ సందేహాలను ఎలా తీరుస్తావు?”అని. అప్పుడు వాడిని నేను సూటిగా ఒక ప్రశ్న వేశాను, “నీవు ఎంతకాలం నుండి వేదాంత గ్రంధాలను చదువుతున్నావు?నీ సందేహాలు ఏమైనా తీరాయా?” అని. అందుకు వాడు తల అడ్డంగా తిప్పుతూ, “ఒకళ్ళు చెప్పింది మరొకళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పింది, వీళ్ళు ఖండిస్తున్నారు. వీళ్ళు చెప్పింది వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. ఇంతవరకూ నాకు ఒక్క విషయం అర్ధం కాలేదు. ” అని వాడు చెప్పాడు. అయినా సరే వేదాంత ఉపన్యాసాలు వినటానికి వెళ్ళుతుంటాడు, వందల రూపాయలు పెట్టి పుస్తకాలు కొంటూ వుంటాడు. అప్పుడు వాడితో చెప్పాను, “నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ దేశంలో! వాళ్లకు ‘వేదాంత పిచ్చి’. మనం తెలుసుకోవాల్సిన విషయాలు బయట ఎక్కడో ఉంటాయని, వారి భ్రమ!మనకు అర్ధం కానివన్నీ గొప్పవనుకుంటారు కొందరు, అర్ధం చేసుకొనటానికి ప్రయత్నించరు మరి కొందరు!” అని చెప్పాను. ఇంతలో వాడు హడావుడిగా, ఇప్పుడు పత్రికా విలేఖరులు, TV వాళ్ళు వస్తున్నారట! అని బాంబు పేల్చాడు. ఏమి చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాను.
ఎందుకంటే, వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత తేలికకాదు. నా ఆలోచనకు వాడే బ్రేక్ వేసి– వాడే ఇలా చేస్తే సరిపోతుంది, అంత ఖంగారు దేనికి?అని నన్ను తేలిక పరిచాడు. “ఏమి చెయ్యాలో తొందరగా చెప్పు!” అని వాడిని తొందర చేశాను. వాడు ఇలా చెప్పాడు”స్వామి, మూర్ఖులతో మాట్లాడరు అని చెప్పి వారిని పంపివేస్తాను. ” “ఈ ఆలోచన నీకెక్కడి నుండి వచ్చిందిరా?”అని వాడిని అడిగితే వాడు–“పూర్వం నాకున్న ఒక మూర్ఖ భక్త స్నేహితుడు ఈ విషయం చెప్పాడు. “అని అన్నాడు. “ఇంక ఆలస్యం ఎందుకు? తొందరగా ఏదో ఒక పీఠం ఎక్కు. “అని వాడు తొందర పెడుతున్నాడు. అందుకు, నేను, “తొందర పడకు. ప్రజలు మనలను దైవాంశ సంభూతులుగా నమ్మాలంటే, వారికి కొన్ని శక్తులు (magics)చూపించాలి. చేతిలోంచి చిటికెడు బూడిద తీసి వారికి ఇస్తే, వారు మనకు గుప్పెడు బంగారం ఇస్తారు. వారికి ‘విభూతియోగం!’, మనకు ‘స్వర్ణయోగం!’. ప్రజలకు బూడిద ఇచ్చే విద్య నేర్చుకోవటం ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది. అదీ గాక తన్మయత్వంతో నృత్యం చేసే నటనను కూడా నేర్చుకోవాలి!అవి పూర్తి కాగానే నీవన్నట్లు ఏదో ఒక పీఠం ఎక్కుతాను. పైగా నాకు ఒక కేంద్ర మంత్రిగారి మద్దతు కూడా ఉంది. మనకు రాబోయేది ‘స్వర్ణయుగం’. “పనిలో పని ‘రక్తపాతం’కూడా నేర్చుకో గురూ! నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు!”అన్నాడు నా స్నేహితుడు. “రక్తపాతం కాదురా ‘శక్తి పాతం’ అది. అంటే జనం నెత్తిన చేతులు పెట్టటం!’అని చెప్పి వాడిని సమాధాన పరచాను. వాడి సందేహాలన్నిటినీ తీర్చాననుకున్నాను. వాడు అంతటితో వదిలి పెట్టలేదు, ఇదే నా చివరి సందేహం, ఇదొక్కటి తీరుస్తే చాలు నాకు చాలా సంతోషం, అని ఇలా అడిగాడు వాడు, “అసలు వేదాంతం అంటే ఏమిటో చెప్పు చూద్దాం?”అని సూటిగా ఒక ప్రశ్న వేశాడు.
కొద్దిసేపు ఆలోచించాను. నాకు ‘విప్రనారాయణ’ సినిమా గుర్తుకొచ్చింది. ఆ సినిమాలో దేవదేవి(భానుమతి), రంగరాజుని(రేలంగి)ని ఇదే ప్రశ్నవేస్తుంది. అప్పుడు, రంగరాజు ఇలా చెబుతాడు, “చెప్పేవాడికీ, వినేవాడికీ ఇద్దరికీ అర్ధంకాని దానినే వేదాంతం అంటారు”అని. (శ్రీ సముద్రాల గారు ఎంత వి(స)లక్షణంగా చెప్పారో చూడండి! ఆ మహనీయునికి నా శ్రద్ధాంజలి!) అదే సమాధానాన్ని వాడికి చెప్పాను. వాడికి ఇదొక్కటే బాగా అర్ధమయినట్లున్నది. సంతోషంగా వాడు కూడా నాకు పచ్చ జండా చూపించాడు. “నీ ప్రణాళికతో నీవు ముందుకు పో! జనాన్ని నేను పోగు చేస్తాను. ఈ ‘వేదాంతం పిచ్చి’వాళ్ళలో నాకు ‘పిచ్చ’ సర్కిల్ ఉంది. వాళ్ళు విపరీతంగా వేదాంత గ్రంధాలను అప్పుచేసి మరీ వందల రూపాయలు పెట్టి కొంటుంటారు. అందులో ఈ మధ్య నీవు వ్రాయటం కూడా మొదలు పెట్టావు కదా!నీ పుస్తకాలను ‘అచ్చేసి’ఆంద్ర దేశం మీదికి వదిలే హక్కులు మాత్రం నాకే ఇవ్వాలి! పనిలోపనిగా వాటితో కలిపి నా వద్దనున్న పాత పుస్తకాలను కూడా ఏదో ఒక ధరకు అమ్ముకుంటాను. గో ఎహెడ్ !” అని వాడు చెప్పాడు. సన్యాసం స్వీకరించక ముందే చాలామంది శిష్యులు పోగయ్యారు. ఇందాకటి మిత్రుడి సందేహాలన్నీ తీరినాయి. వాడి పనిలో వాడు మునిగిపోయాడు. నా వేదాంత పరిజ్ఞానానికి వాడు అమితమైన ఆనందంపొంది, అప్పుడే రోజూ నా దగ్గరికి రావటం, జనాన్ని తీసుకురావటం మొదలు పెట్టాడు. ఇంక మంచి ముహూర్తం చూసి సన్యసించటమే నా తదుపరి కార్యక్రమం!
(ఇది కేవలం వ్యంగ్య, హాస్య రచన మాత్రమే! ఎవరినీ ఉద్దేశించి వ్రాసింది కాదు. ఎవరైనా భుజాలు తడుముకుంటే మాత్రం నా బాధ్యత కాదు!)
టీవీయస్. శాస్త్రి
Dear TVS, మీ పీఠం పేరు లో ఇంద్రుణ్ణి దించి, ఆయనగారు పరకాయప్రవేశాన అహల్యను కామించిన
గాధను గుప్తంగా గుర్తు చేశారు.అమ్మో! మీరు ఎంతకైనా తెగించేట్టున్నారు.సదానంద స్వాములవారి చెంతకు ఆధ్యాత్మిక”చింత” తో ఆవాసభామలు సావాసం కోసం సమీపిస్తారు.ప్రత్యేక శయనాగారము
సమీకరించుకోండి.ఎందుకైనా మంచిది,గిట్టని “ముండలు” సీ సీ కెమెరాలు పెడతారు,జాగ్రత్త.మరోమాట!
నేను ‘సాయిబు’ ని గదా! పగలు ధూపం వేయడానికి సామ్రాణి,రేరాణులకొరకు అరేబియన్ నైట్స్ సెంటు
హోలు’సేలుగా సప్లయి చేస్తాను,hole ‘ sale రేటుకే.
శ
Extremely but naturally hilarious. You are a blessed writer. Your flair is wonderful. The technique you have used is saying every reality in an ironically humorous way. Kindly keep writing, but don’t forget to post them to me. Last request is that I should also be given rights to sell your books, not to your friend alone as mentioned therein. In the meantime I will try to acquire a marketing degree in addition to my law degree. Thank you profusely for your intellectual brilliance.
మీకు సలహా దారుడు గా, ప్రధమ శిష్యుడు గా, ( బినామి) స్వీకరించండి నన్ను. ఏదో కొంత వాగ్దటి నాకు వుంది. ఆర్థిక లావాదేవీలు చక్కగా చుడగలను అని మనవి చేస్తూ న్నాను . మన దేశం లో సన్యాసి కి చాలా డిమాండు వుంది. మంచి వ్యాసం వ్రాసారు. అభినందనలు
sir mee daggare sishyudi ga cheratha meeru sanyasista.. naa ardihka parisithiti ee madhay bagaledu kudaanu..
అత్యద్భుతః మీకు తీవ్ర తపస్సు తో ప్రాప్తించిన అపారమైన శక్తులు వున్నవనీ, మీరు ముట్టుకుంటే ఇత్తడి పుత్తడి అవుతుందనీ, మీరు పట్టుకుంటే రాయి రంభ అవుతుందనీ పామర మర్త్యులకు చెప్పే ఏర్పాట్లు చేయండి. సన్యాసి సుఖీ, సంసారి దుఖీ. 😀
ప్రారంభం నుండి చివర వరకు సునిసిత హాస్యం మేలవించి నేటి ఆధ్యాత్మిక వ్యాపారులపై మీరు ఎక్కు పెట్టిన వ్యంగ్య బాణాలు అద్భుతం శాస్తి గారూ. 70 లలో ఈనాడు లో వచ్చిన తంబూ వ్యాస పరంపర “స్వగతంబు” కు ఏమీ తీసిపోలేదు. (on lekhini)
Sastry garu sanyasula circus sarcasm super andi
chala bagundi. ippudu sanyasulade rajyam
మీఆలోచన అద్భుత౦ సధనాన౦దేద్రస్వామి. మీకు గిరాకీ పెరిగిన తరువాత నాక్కూడా ఎక్కడైనా ఫ్రా౦చైజీలా౦టది ఇప్పి౦చి ధన్యుణ్ణి చేయ౦డి.
ఏదో ఒక రోజు నేను సన్యసిస్తా —ఈ శీర్షిక నిబట్టే రచయిత అంతరార్ధం అవగతమౌతోంది. ఎంతోమంది దొంగ స్వాములు గురించి తేటతెల్లమైనా , ఇంకా ఈ వృత్తి దిన దిన ప్రవర్దమాన మౌతోంది..రాను రాను సమాజంలో వీళ్ళ లీలల మీద కోపం కన్నా అసూయ గా ఉంటోంది . దీనికి కారణం మారుతున్న జీవన విలువలు , దానికి దోహదపడుతున్న రాజకీయ , న్యాయ వ్యవస్థల అలసత్వం. మన దేశంలో సంస్కృతం , మరియు ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యం .ఉంటే , ఎన్ని వేషాలైనా వేయొచ్చు. అదే పెట్టుబడి.ఒక సంస్కృత శ్లోకం చెప్పడం, తరువాత దానిని తెలుగులో పీకి పీకి , నానార్దలతో , సొంత కవిత్వం జోడించి, వ్యంగాస్త్రాలతో ,పిట్టకదలతో ప్రవచన పిండాలు పెట్టవచ్చు.
శాస్త్రి గారు — మీరు రాసిన భావాలే చాలామంది మనస్సులలో ఉన్నాయి . ఎన్నోసార్లు సరదాగా చెప్పినట్టు , మనస్సులలోనించి తన్నుకు వస్తుంటాయి.స్నేహితుల మధ్య జరిగే చర్చలలో , నేను అన్నాను , నేను విన్నాను . మీ భావాలతో ఏకీభవిస్తున్నాను.
విచారకరమైన దేమిటంటే , స్వాముల వెంట బడి , నేను ఫలాన స్వామి శిష్యుడుని అని చెప్పుకోవడం చాలమందికి ఉన్న ఆధ్యాత్మిక రోగం. కారణాలు అనేకం. ఇక్కడ అవి అప్రస్తుతం..
సన్యాసులు అయితే ఏమి చెయ్యవచ్చో , అవి అన్నీ మీకు తెలిసిపోయినాయి. మీ ద్వారా మాకు కూడా. ఇది అందరూ చదువుతారు. చివరకు ఎవరి నమ్మకాలు వారివి అంటూ యధా తధ స్థితిని కొనసాగిస్తారు.
ఇది కధ లాంటి వ్యాసం . వ్యాసం లాంటి కధ . ఈకోణంలో సన్యాసుల విన్యాసాలని బయట పెట్టడం , చదివేవారిని కాసేపైనా ఆలోచింపచేస్తుంది.
ఆలోచించడం మార్పుకు మార్గం చేస్తుంది . నాకు నచ్చింధి . మీకు నా అభినందనలు ………….సాంబశివ
మీకు తెలియని మహనీయుల జీవిత చరిత్రలేదు. మీరె ఒక మెమొరీ కార్డ్.
శ్రీమతి ఆబ్బురి వారి ని తలుచుకొని మీ రచన అబ్ధుతం. స్త్రీ దైనందిత జీవితాన్ని కళ్ళకు అద్దినట్లుగా వ్రాసారు.మీకు జోహార్లు.
మీకు తెలియని మహనీయుల జీవిత చరిత్రలేదు. మీరె ఒక మెమొరీ కార్డ్.
శ్రీమతి ఆబ్బురి వారి ని తలుచుకొని మీ రచన అబ్ధుతం. స్త్రీ దైనందిత జీవితాన్ని కళ్ళకు అద్దినట్లుగా వ్రాసారు.మీకు జోహార్లు.
jOhaarlu.
చాలా బాగుందండీ మీరు రాసింది వ్యంగ రచన ఐనా పచ్చి నిజం. అలా ఎలా నమ్మేస్తారు జనంఈ బాబాలను… విచక్షణా జ్ఞానం వుండదా… లేక పోతే ఇన్కమ్ టాక్స్ కి సమర్పించే ధనం ఇలా పంచేస్తే పోతుందనా.. సమజాన్ని బాగు చేద్దామనే తపన వున్న సన్యాసులు స్వామి పరిపూర్ణానంద స్వామి లాంటి వారు కూడా వున్నారు.. ఏమైనా మీరు సన్యసిస్తే ఎలాగండి… ఈ కృత్రిమ ెబాబాల నిగ్గు తీర్చే రచనలు ఎవరు రాస్తారు..
మంచి ఆర్టికల్ సర్….నాకు NT రామరావు గారు సన్యాసం నుండి రామనానందశక్తిపాతం వరకూఅన్నీకంటికికనిపించాయి..బెస్ట్ అఫ్ లక్ సర్ మీదారిలో మేమూ నడుస్తాం.
meeku anyapadesamga ee korika undanukunta, first reharsals
INCOME OVER EXPEXDITURE FOR SANYASKI. BHDYATHALU LEVU. BHARVULU LEVU
. MEERU ANNATTUVTAX FREE
జే శ్రీ సదానే౦ద్రస్వామీజికి జై! స్వామివారు కళ్ళు లేనివారికి కళ్ళు, కాళ్ళు లేనివారికి కాళ్ళు పిల్లలులేనివారికి పిల్లలు, ఉద్యొగ౦, గృహయోగ౦, వాస్తు నవగ్రహ పీడ జపాలు…అన్ని సమస్యలకు స్వామివారే పరిష్కరిస్తారు. పాదపూజ లక్షా పాతికవేలు. 2025 దాకా అపాయి౦టమె౦ట్లు లేవు.
శాస్ర్తి గారు నమస్కారములు,
మీ సన్యాశాస్రరమము బాగు౦ది. దయచేసి నన్న కుదిరితే శిష్యపరమాణువుగా స్వీకరి౦చ౦డి నాకు అ౦త తెలివితేటలు లేవనిపిస్తే కనీస౦ఆశ్రమ౦లో ఏదోఒక నాఅర్హతకు దగ్గ పనీప్పి౦చ౦డి. ఏదో నాల్గురూపాయలు కేసుకు౦టా, మీ మేలు మరువను ఏదోరక౦గా మీకు పాదకట్న౦ఘన౦గానే సమర్పి౦చుకు౦టా.
ఫేస్ బుక్ లో ఎందుకు పోస్ట్ చెయ్యరు?
చాలా బాగుంది. ఈనాడు బాగా అవసరమైన రచన. భుజాలు తడుముకునే వాళ్ళు ఇది చదివే అవకాశం లేదు. హాస్యానికి కాదు చాలా గంభీరంగా ఆలోచింపచేసే రచన. శుభాభినందనలు.
దీనిని కేవలం వ్యంగ్య, హాస్య రచన గా తీసుకోరాదు…..చాలా మంది దొంగ సన్యాసుల , దొంగ సన్యాసుల యొక్క భక్తుల , దొంగ సన్యాసులపై ఆధారపడ్డ టీవీ చానళ్ళ, సీడీ కంపెనీల వారిపై ఆధారపడ్డ వ్యాపారులపై తీవ్రముగా స్పందించి, ఉండబట్టలేక ఒక్క సారిగా విరుచుకు పడ్డ లావా స్వరూపపు బ్రహ్మాస్త్రం…. దొంగ సన్యాసులను ఆదరిస్తున్న వారందరూ భుజాలు తడుముకోవాలి….. ముఖ్యముగా … చదువు అంతగాలేని వారు ఎలాగూ వీరి బారిన ఎక్కువగాపడరు కాబట్టి విద్యాధికులూ, గొప్పస్థాయిలోఉన్నవారూ, వీరినుండి బయట పడాలి…. కొత్త… కొత్త భక్తి విధానాలనూ …. సన్యాసులను ఆదరించాలన్న పిచ్చి ఆలోచనల నుండి బయట పడాలి….. కానీ వంటలను ఎలా కొత్త కొత్త రుచులతో చేయటానికి ప్రయత్నిస్తామో పూజలనూ దీక్షలనూ అలాగే తయారు చేస్తాం….. ఆరాధనా స్వరూపాన్ని ఇలా మార్చటమే దొంగ స్వామీజీలకు సువర్ణావకాశం… వీలైనన్ని వివరణలను….. భక్తులలో ఉన్నటువంటి సందేహాలనబడే అటువంటివి….అయినటువంటి…అనగా దొంగ స్వామిజీ ల నబడే టటువంటి సన్యాసులనబడేటటువంటి … వారి మాయమాటలనబదే టటువంటి వారి మోసాలతో వారిలో కలిగినటువంటి సందేలనబడేటటువంటి వాటిని దూరం చేస్తారన్న మాట! (ఇలా ఎంతైనా చెప్పవచ్చు.. ఇప్పటికి సెలవు ) గొప్ప రచనను అందించిన టీవీయస్. శాస్త్రి గారికి ధన్యవాదాలు …..
దీనిని కేవలం వ్యంగ్య, హాస్య రచన గా తీసుకోరాదు…..చాలా మంది దొంగ సన్యాసుల , దొంగ సన్యాసుల యొక్క భక్తుల , దొంగ సన్యాసులపై ఆధారపడ్డ టీవీ చానళ్ళ, సీడీ కంపెనీల వారిపై ఆధారపడ్డ వ్యాపారులపై తీవ్రముగా స్పందించి, ఉండబట్టలేక ఒక్క సారిగా విరుచుకు పడ్డ లావా స్వరూపపు బ్రహ్మాస్త్రం…. దొంగ సన్యాసులను ఆదరిస్తున్న వారందరూ భుజాలు తడుముకోవాలి….. ముఖ్యముగా … చదువు అంతగాలేని వారు ఎలాగూ వీరి బారిన ఎక్కువగాపడరు కాబట్టి విద్యాధికులూ, గొప్పస్థాయిలోఉన్నవారూ, వీరినుండి బయట పడాలి…. కొత్త… కొత్త భక్తి విధానాలనూ …. సన్యాసులను ఆదరించాలన్న పిచ్చి ఆలోచనల నుండి బయట పడాలి….. కానీ వంటలను ఎలా కొత్త కొత్త రుచులతో చేయటానికి ప్రయత్నిస్తామో పూజలనూ దీక్షలనూ అలాగే తయారు చేస్తాం….. ఆరాధనా స్వరూపాన్ని ఇలా మార్చటమే దొంగ స్వామీజీలకు సువర్ణావకాశం… వీలైనన్ని వివరణలను….. భక్తులలో ఉన్నటువంటి సందేహాలనబడే అటువంటివి….అయినటువంటి…అనగా దొంగ స్వామిజీ ల నబడే టటువంటి సన్యాసులనబడేటటువంటి … వారి మాయమాటలనబదే టటువంటి వారి మోసాలతో వారిలో కలిగినటువంటి సందేలనబడేటటువంటి వాటిని దూరం చేస్తారన్న మాట! (ఇలా ఎంతైనా చెప్పవచ్చు.. ఇప్పటికి సెలవు ) గొప్ప రచనను అందించిన టీవీయస్. శాస్త్రి గారికి ధన్యవాదాలు …..
వ్యంగ్య హాస్య రచన ఎవరినీ ఉద్దేశించినది కాకపోయినా భుజాలు తడుముకునే వాళ్ళు చాలా మంది వున్నారు. చాలా బాగుంది సెటైర్.అభినందనలు శాస్త్రి గారు.
ప్రస్తుతం జరుగుతున్న విషయాన్ని వ్యంగ్యంగా చక్కగా చెప్పినందుకు అభినందనలు!
శాస్త్రి గారూ నాకూ మీకున్నటు వంటి కోరికే వున్నది. మీ ప్రధాన శిష్యుడుగా వచ్చేస్తాను.(పోటీ ఎందుకని) నేను అర్ధం పర్ధం లేకుండా అనరగళంగా మాట్లాడ గలను.
కానీ చివరికి సన్నాసులుగా మిగలకుండా మంచి ప్లాన్ చేయండి. నేనూ రెడీ.
వ్యంగ రచన అయినా ఇప్పటి సమాజానికి దర్పణం పట్టింది,
శైలి చదివించేలా ఉండటం మీ గొప్పతనం, సర్ జి
మీరు వ్రాసిన వ్యంగ్య హాస్య రచన ప్రస్తుత పరిస్థికి దర్పణము పడుతుంది ఈ రోజుల్లో సన్యాసుల జీవితము రాజభోగమే ఎటొచ్చి కొంత ఓర్పు పట్టాలి మంచి శిష్యులను సంపాదించాలి ఎందుకంటే వాళ్లే కదా ప్రచారకులు నాకు తెలిసి ఒక మిమిక్రి ఆర్టిస్ట్ ప్రస్తుతము పెద్ద స్వామీజీగాను పీఠాధిపతిగాను చెలామణి అవుతున్నాడు వెర్రి జనము ఉన్నంత కాలము స్వాములకు బాబాలకు ఈ దేశములో కొదవ ఉండదు.ప్రస్తుతము లాభసాటియైన వృత్తి లేదా వ్యాపారము సన్యాసి అవతారమే T.V లు విస్తృతముగా ప్రచారము ఇస్తాయి లేదా సొంత T.V .ఛానల్ పెట్టుకోవచ్చు ఇంచు మించు ప్రతిస్వామిజీకి ఒక ఛానల్ ఉందికదా మొత్తానికి మీ రచన చాలా బాగుంది కనీసము కొంతమందికైనా కనువిప్పుకలిగి ఈ స్వాముల వెంట పడకుండా ఉంటే చాలు ఇక్కడ ఒక ప్రమాదము కూడా వుందండోయి ఏదేదో లాభసాటిగా ఉంది అని సన్నాసులు ఎక్కువ అయే ప్రమాదంకూడా ఉంది.
meeru cheppindi akshara satyame sir…… ee rojulalo…… sanyasulaku vunna demand verevariki ledu…… wish you all the best……. go a head……. i will also support you 100% if you are really interested……..chaduvutunnata sepu navvutone vunnanu…….. nice writeup….
చాలా బావుందండీ శాస్త్రి గారూ , అయ్యో , మరిచిపోయాను , సదానందేంద్ర స్వామి గారు కదా , పేరు పలకడం కొంచెం కష్టంగా ఉంది , మీరు హాస్యం కూడా చాలా బాగా రాసారు . నిజమే , ధనం సంపాదించే సుళువైన ఉపాయమిది .
యీకాలం సన్యాసులను గురించి చక్కగా వివరించారు శాస్త్రి గారు. జన విజ్ఞాన వేదిక వారు నోరు చించుకొని చెప్పినా వినే వాళ్ళు చాల కొద్దిమంది వున్నారు. ఈసమాజాన్ని ఎవరు బాగు చేస్తారు?
ట్విట్టర్, ఫేస్ బుక్ మొదలగు సోషల్ మీడియా నుంచి బయటపడటమే ఈ రోజుల్లో అసలైన సన్యాసం. ఇవి చేస్తే మీ కోరిక తీరినట్లే.
భగవంతునికి కావాల్సింది నిర్మలమైన భక్తి అయితే నేటి సన్నాసులకు ధన, కీర్తులు. అందుకే ఎన్నోఆశ్రమాలు ధనవంతులకు ఎర్ర తివాసీ పరుస్తున్నాయి. ధనంతో ఆత్మజ్ఞానంతో పాటుగా సూక్షంలో మోక్షం పొందాలనుకునే వారికి వీరి ఆశీస్సులు దండిగా ఉంటాయి. స్వేచ్చగా ఉన్నవారే బందితులను విముక్తి చేయగలరు. ఆధాత్మిక ముసుగులో వ్యాపారం అత్యంత హేయమైనది. వ్యంగ రచన అయినా యదార్ధంగా జరుగుతున్నదే తెలియచేసారు. ధన్యవాదాలండి.
మన దేశంలో ఇంతకన్నా తేలిక అయిన పని, మరియు సంపాదనా లేదని గట్టిగా నొక్కి వోక్కణిస్తున్నాను, అందులో మీలాంటి మాటకారి, రాతకారి తప్పకుండా విజయం సాధిస్తారని నమ్ముతున్నాను. చాలా బాగుంది మీ వ్యంగ్య రచన. నేను భుజాలు తడుముకోవట్లేదు అండి.
very intaresting
ఇప్పుడు సమాజంలో స్వైరవిహారం చేస్తున్న పలు ఆందోళన కర సంఘటనలకు మీ వ్యంగ్య హాస్య రచన అద్దం పడుతోంది.(అడ్డం పడుతోంది అంటారా ?) చక్కటి అంశాలు, పలువురు బుర్రలకు పదునుపెట్టి ఆలోచించటానికి అవకాశం కలిగిస్తున్న మీ రచనలు విజయవంతంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను.
ఇదేదో బావుందండోయ్.
” మనం తెలుసుకోవాల్సిన విషయాలు బయట ఎక్కడో ఉంటాయని, వారి భ్రమ!మనకు అర్ధం కానివన్నీ గొప్పవనుకుంటారు కొందరు, అర్ధం చేసుకొనటానికి ప్రయత్నించరు మరి కొందరు!” అని చెప్పాను. ” ……This is an excellent piece of sarcastic article which is a big fact of these days ! Still, these fake God men are being worshiped by all more than customary Gods ! Thanks to our Sastri garu for giving such a wonderful article -D.R.K.REDDY, KAKINADA.
అయ్యా, సదానందేశ్వరా, సన్యాసంలో భాగంపంచుకోడానికి నాపాలుకూడా ఉండేట్టు చూడండి. మరో శిష్యపరమాణువు కోరినట్టు మీతో మాంఛి channel పెట్టించాలని దానికికావల్సిన హంగులూ ఆర్భాటాలూ చెయ్యయగల శక్తి నాకుందనీ (డబ్బులు మీరే తేగలరు సన్యాసిగా) ఇందుమూలముగా తెలియజేస్తున్నాను. ఓం తత్సత్! సన్యాసులు నమ్మరేమోనని అన్నానేగాని దాని అర్థం నాకు తెలియదు! నన్ను మీ టెక్నికల్ కంసల్టెంటుగా పెట్టుకుంటారని ఆశిస్తూ అహం అనగా నేనే!
చాలా బాగుంది.
వడ్లగింజలలో తాలుగింజలూ ఉంటాయి తప్పదు మరి. మీరెన్నుకొన్న నామధేయం బాగున్నది. సదానంద+ఇంద్ర… పనిలో పని ఏదన్నా ఛానల్ కూడా …….
నేటి సన్యాసుల మీద మీ చమత్కారాలు చాలా బాగున్నాయి. వారి వాంఛాలాలసత్వాన్ని చక్కగా వివరించారు. వెర్రి జనాలు ఉన్నంత కాలం వారు వేయి విధాల వర్ధిల్లుతూనే ఉంటారు..
అవినీతిలో కొందరు స్వామీజీలు రాజకీయ నాయకులతో పోటీ పడుతున్నారు!ఇది వాస్తవం!ప్రస్తుతం జరుగుతున్న విషయాన్ని చక్కగా చెప్పినందుకు అభినందనలు!
వాస్తవాన్ని వ్యంగ్యంగా బాగా చెప్పారు!అభినందనలు !
super guruji, appudeppudu bulusu vaaru naaku koshaadhikaari padivi ichchi nela maaliga lo dhanam daachadaaniki permission ichchaaru. panilo pani nannu koshaadhikaariga pettesukondi. tax lu avee nenu choosesukuntaa samarthavantham gaa.. jai sri sadaananda maharaj kee jai..
హహహ–అద్భుతం గా వుంది–రక్త పాతం–అదే శక్తి పాఠం చేయటానికి–మా రేట్ 5000–మరి మీదెంత- పోటీ మరీ రెట్లు పెంచేస్తునాన్నరు–మా శక్తి లుడిగి పోయి ఉన్నమెమో–ఎదో పీఠం లో పాశం అదే పాఠం కి పాతం కి ఖర్చు పెట్టెయ్యటానికి–తెగ ఉబలాట పడిపోతున్న జనం లో మేమూ వున్నాం-అన్నట్లు–పొగ లో బా ని చూపించి సెగ లో కి జనాన్ని తోసి తెగ సమస్యలు అన్ని పరిష్కరిచేస్తున్నారత –ఈ బాబాలు–భక్తులిలా క్యూలు కడుతున్నారు–ఈలోపల పీఠాలా బాబాలు–జపం విడిచి లోత్తం లో పడ్డట్టు–వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటుంటే–ఈ మధ్య వెర్రి భక్తులు–నోళ్ళు వెల్ల బెట్టారు–ఇదే సందు అని మీడియా వాళ్ళు–24 బై 7 కి మేత మెసీసేరు–మనం కళ్ళు పీకు తున్నా–ఆ సోది అంటా చూసీసీమ్–అనక ఏతా వాటా తెలిందేమిటంటే అదంతా publicity stunt ani–veeti to sambandham leni janalu రక రకాల కోసం వాళ్ళ పాట్లు వాళ్ళు పడుటూనే వున్నారు–బాబాలు నోట్లు దండుకుంటూనే వున్నారు–ఇంతకూ మరిన్ని జరిగినా–జనం –మారరు–మంచి అంశం వ్యంగ్య ధోరణిలో వివరించారు–అభివాదములు