April 28, 2024

ఉపయుక్తమైన చిట్కాలు, జాగర్తలు

నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

How to Track your Family, Friends

ఇక బయటికెళ్లిన మన వాళ్లకు ఏమవుతుందో ఇక వర్రీ అవ్వాల్సిన పనిలేదు..

వీడియో లింక్ ఇది:

కాలు తీసి బయట పెట్టిన మనిషి మళ్లీ తిరిగి వచ్చేవరకూ టెన్షనే మనందరికీ.

రోజూ టైమ్‌కి ఇంటికొచ్చే మనిషి గంట దాటినా రాకపోతే… ఫోన్ తీయకపోతే.. ఏం జరిగిందో ఎక్కడున్నారో అని ఆదుర్ధాపడుతుంటాం.

ఇంత మానసిక వత్తిడిని ప్రతీరోజూ అనుభవించే వారి కోసం తయారు చేయబడిన వీడియో ఇది.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి నిశ్చింతగా ఉండొచ్చు. ఈ క్షణం వారెక్కడ ఉన్నారో ఇట్టే తెలుసుకోవచ్చు.

మీరే బయటకు వెళ్లుంటే మీ వాళ్లు భయపడకుండా ఉండడం కోసం.. వారు మిమ్మల్ని ట్రాక్ చేసే ఏర్పాటు మీరే చేయొచ్చు.

How to Trace your Stolen Android Phone?

మీ ఫోన్‌ని కాపాడడానికి కొత్తగా ఏ సాఫ్ట్‌వేర్ అవసరం లేదు.. ఇలా చేయండి!

మీరు ఏ మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఫర్లేదు.. అది దొంగిలించబడినప్పుడు దాన్ని సులభంగా వెదికి పట్టుకునే పలు శక్తివంతమైన సాఫ్ట్‌వేర్ల గురించి గతంలో వివరించాను.

ఇలా వేరే సాఫ్ట్‌వేర్లు ఏమీ అవసరం లేకుండా మీ ఫోన్‌ని వెదికి పట్టుకునే అవకాశం ఇటీవల అందుబాటులోకి వచ్చింది.

మీ ఫోన్‌లోనూ ఇది లభిస్తున్నా మీకు తెలీకపోవడం వల్ల ఎనేబుల్ చేసుకుని ఉండకపోవచ్చు. సో దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఫోన్ పోతే ఎలా track చెయ్యాలి అన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా వివరించాను.

How to Save Your Phone Battery by following few tips?

మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెంచుకోండి ఇలా..

కొత్తగా టచ్‌స్క్రీన్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరూ చేసే కంప్లయింట్ ఒక్కటే.. పాత చవక నోకియా ఫోన్లే బ్యాటరీ బ్యాకప్ రోజుల తరబడి ఇచ్చేవనీ… ఈ కొత్త ఫోన్లు సరిగ్గా బ్యాకప్ ఇవ్వట్లేదని చాలామంది చెప్తుంటారు…

ఎందుకు ఇలా జరుగుతోందో కారణాలతో పాటు ఇప్పుడు మీరు వాడుతున్న లేటెస్ట్ ఫోన్లలో బ్యాటరీ వీలైనంత ఎక్కువ సేపు పెంచుకుంటే టెక్నిక్‌ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.

1 thought on “ఉపయుక్తమైన చిట్కాలు, జాగర్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *