May 3, 2024

శ్రీ కాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయము.

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు,
1

కృష్ణా నదీ తీరము తెలుగు సంస్కృతి వైభావాలకు ప్రముఖ దేవాలయాలకు నెలవైఉంది. అటువంటి ప్రదేశాలలో ఒకటి కృష్ణా జిల్లా,ఘంటసాల మండలములోని శ్రీకాకుళము గ్రామములోని శ్రీ కాకుళ ఆంధ్ర మహా విష్ణు దేవాలయము.
ఆ గ్రామములోని ప్రముఖ దేవాలయాలు వాటి చరిత్ర గురించి కొంత తెలుసుకుందాము.
శ్రీకాకుళము చిన్న గ్రామము కానీ ఆ గ్రామ చరిత్ర చాలా పురాతనమైనది. ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా ఉండేది క్రీ.శ 2 వ శతాబ్దములో శ్రీకాకుళాన్ని మహానగరంగా చరిత్రకారులు అభివర్ణించారు. దివిసీమకు చెందిన ఈ గ్రామము కృష్ణా నదీ తీరాన,రైవిస్ కాలువ చుట్టూ ఉంటుంది. ఈ గ్రామము ప్రత్యేకత ఈ గ్రామములోని శ్రీకాకుళాంధ్ర దేవాలయము లభించిన చారిత్రాత్మక ఆధారాలనుబట్టి విష్ణు అనే ఒక యోధుడు త్రిలింగదేశాన్ని (ద్రాక్షారామము, కాళేశ్వరం, శ్రీశైలము మధ్యగల ప్రదేశాన్ని) ఆంధ్రదేశముగా పరిపాలించేవాడు.
ఆయన సాక్షాత్త్తు మహా విష్ణు అంశతో జన్మించినవాడుగా భావించి ఆయన తదనంతరము ప్రజలు ఆయన గౌరవార్థము శ్రీకాకుళములో గుడిని కట్టించి దేవతామూర్తికి “శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు”అని పేరుపెట్టారు ఈ ప్రధాన దేవాలయాన్ని క్రీ. పూ రెండు లేదా మూడవ శతాబ్దములో శాతవాహన రాజులు నిర్మించారు అని చెపుతారు అంటే ఆంధ్ర విష్ణు శాతవాహనుల కన్నా ముందే ఆంధ్ర దేశాన్ని ఏలినవాడు. ఈ దేవాలయములో చారిత్రాత్మక ఆధారాలు లభ్యమవుతాయి దేవాలయము గోడలపై 32 శిలాశాసనాలు కనిపిస్తాయి వీటిలో కృష్ణ దేవరాయలు కాలానికి చెందినవి కూడా వున్నాయి.
ఈ దేవాలయములోని ప్రధాన విగ్రహమూర్తి లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే శంఖము కుడిచేతిలోను, చక్రము ఎడమ చేతిలోనూ ఉంటాయి. ఇక్కడి దేవాలయములోని ఆధారాలనుబట్టి శ్రీ మహావిష్ణు దశావతారాలలో శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉండదు. దశావతారాలు అంటే మత్స్య, కుర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశరామ, రామ, బలరామ, బుద్ధ,మరియు కల్కిమాత్రమే.
ప్రస్తుతము ఉన్న ఆలయము చారిత్రాత్మక ఆధారాలను బట్టి క్రీ.శ 1010 లో నిర్మించబడింది. చోళుల పరిపాలనలో రాజులు విగ్రహాన్ని కృష్ణానదినుండి వెలికి తీసి ఈ ఆలయాన్ని పునర్మించారు మరల 1992 పుష్కరాల సమయములో
ప్రభుత్వము పునర్నిర్మాణాన్ని చేసింది ఇది ఏమయినప్పటికీ అతి పురాతన దేవాలయము ప్రస్తుతము నిర్లక్యానికి గురి అవుతన్నదని ఆలయాన్ని చూస్తే మనకు అర్ధము అవుతుంది, ఈ దేవాలయానికి ఐనంపూడి గ్రామమములో 16.44 ఎకరాలు, శ్రీకాకుళము గ్రామములో 9.25 ఎకరాలు, తెలుగురావుపాలెములో 16.73 ఎకరాలు, పాపవినాశనము గ్రామములో 11.45ఎకరాలు, గోగినేనిపాలెములో 15.41 ఎకరాల భూములు ఉన్నాయి ఇవికాకుండా చేపల చెరువులు కూడా వున్నాయి వీటిని ప్రతిసంవత్సరం బహిరంగ వేలం వేసి వచ్చిన ఆదాయాన్నిదేవస్థానానికి జమ చేస్తారు. ప్రతి యేడు వైశాఖ మాసములో శుక్ల త్రయోదశి నుండి బహుళ విదియ వరకు అంటే ఐదు రోజుల పాటు స్వామివారి వార్షిక
బ్రహ్మోత్సవాలు ఘనముగా నిర్వహిస్తారు.
2
శ్రీకాకుళములో ఆంధ్ర మహా విష్ణు మందిరములో పాటు శ్రీ రాజ్యాలక్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామి మందిరము (శివాలయము), రామాలయము, హనుమాన్ మందిరము, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరము, వినాయకుడి మందిరము కూడా ఉన్నాయి.
శ్రీ కాసుల పురుషోత్తమ కవి ఈ స్వామివారిని కీర్తించుచు రచించిన 108 పద్యాలతో కూడిన “ఆంధ్ర నాయక శతకము”ఆలయ ప్రాంగణములో రాతి శాసనాల రూపములో భద్రపరిచారు ఈ ఆలయ ప్రాంగణములో ఈ మధ్యనే శ్రీ కాసుల పురుషోత్తమకవి వంశీకులు, ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతేకాకుండా ఈ గ్రామము తెలుగు సాహిత్యములో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది.
ఆంధ్ర భోజుడుగా కీర్తించబడే శ్రీ కృష్ణదేవరాయలు క్రీ.శ 1518లో తన కళింగ దండయాత్ర మార్గములో ఇక్కడ ఆగి స్వామి వారిని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని చెపుతారు అప్పుడు శ్రీ కృష్ణ దేవరాయలకు స్వామి వారి కలలో
సాక్షాత్కారము అవటము వల్ల స్వామి వారి ఆనాటి ప్రకారము,
” తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స”
అని పలికి ప్రభంధ గ్రంధము “ఆముక్త మాల్యద”ను రచించాడు అందుకే ఆలయ ప్రాంగణములో శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహన్ని ప్రతిష్టించారు

3

ఈ వూరి ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఊరి మధ్యలో “గాయక సార్వభౌమ కీర్తి శేషులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు”( శ్రీ మంగళంపల్లి గారి గురువర్యులు) విగ్రహము ఉంటుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *