April 27, 2024

ఇంద్రియాలు – అంతరేంద్రియం

రచన: అఖిలాశ

జ్ఞానం ఆజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది
ఆఙ్ఞానాన్ని చీల్చి చీకటిలో ఉన్నా ఙ్ఞానాన్ని వెలిగించు
నిర్లక్ష్యం నీ కక్ష్యను మారుస్తుంది
నిర్లక్ష్య కక్ష్యలోకి నీ అడుగు వేయకు
అసహనం నీ సహనానికి పరీక్ష
సహనంతో అసహన పరీక్షను జయించు
కామక్రోధాలు అతల పాతాళానికి త్రోయును
కామక్రోధాలు విడువండి సత్యలోకాన్ని చేరండి
అశాంతి మీ శాంతిని చెడగొట్టును
శాంతితో అశాంతిని శాంతింప చేయండి
అసంతృప్తి ఉన్నచోట సంతోషం ఉండదు
సంతృప్తితో అసంతృప్తిని బర్తి చేయుము
పరులపై అసూయ పడకు పరలోకాలు పయనమవ్వగలవు
దురాశను ధరిచేయానియక
దురాశను దహించి ఉన్నత ఆశయాలకై జీవించు
కోపం సకల చెడు గుణాలకు మూల కారణం
కోపాన్ని అదుపు చేసి కుదుపులు లేని జీవనాన్ని గడుపు
గర్వపడి గగనానికి వెళ్ళకు
నిగర్విల జీవించి అందరిని సమానంగా భావించు
దేహి అన్న వారిని ద్వేషించకు దానధర్మలతో సత్కరించు
అహంకారంతో అందరిని దూరం చేసుకోకు
మమకారంతో జీవులందరిని ప్రేమించు
సోమరిగా ఉండకు శ్రమికునిగా ఉండి ఆదర్శంగా నిలుచు
హింస మార్గాన్ని విడిచి అహింస బాట వైపు సాగిపో
కపటం నటించకు నిష్కల్మషమైన ప్రవర్తన ప్రదర్శించు
పొగడ్తలను దూరంగా ఉంచు లోభిగా జీవించకు లోకులకై జీవించు
ఇంద్రియాలను అంతరేంద్రియ సహాయంతో జయించి మోక్షం పొందు నరుడ…!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *