April 27, 2024

GAUSIPS – ఎగిసే కెరటాలు-9

రచన: – శ్రీసత్య గౌతమి

కౌశిక్ ఆఫీసుకి వెళ్ళిన వెంటనే అడ్మినిస్ట్రేటర్ డయానా తో తన బడ్జెటింగ్ గురించి మాట్లాడాడు.

డయానా వెంటనే ఫైల్స్ ని తిరగేసి, కౌశిక్ గ్రాంట్ ఒకటి రెన్యువల్ అయితే ఒక సంవత్సరం పాటు ఒక మనిషి జీతమివ్వడానికి కాని బెనిఫిట్స్ లేకుండా అంటే ఒక పార్ టైం జాబ్ ని కల్పించేటంత మాత్రమే సరిపోతుంది అని చెప్పింది.
“వెల్ డయానా … థట్ ఈజ్ నాట్ ఐ యాం లుకింగ్ ఫర్” … కౌశిక్ అన్నాడు.
“లేకపోతే మిగితా గ్రాంట్స్ అన్నీ క్యాండిడేట్స్ తో ఫిలప్ అయి ఉన్నాయిగా, ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకి, ఎవరి జీతాలు వాళ్ళకి” … అంటూ డయానా కౌశిక్ మొహం లోకి తేరిపారా చూస్టోంది.
“ఇప్పటికిప్పుడు నేను దాని పైన ఎక్స్ టెన్షన్ ఆఫ్ వర్క్ ఎవరితోనూ ల్యాబ్ లో చేయించలేను. వాళ్ళందరూ వాళ్ళ ప్రాజెక్ట్లతో బిజీ. వాటిని ఆపి, క్రొత్తదానిలో పెడితే, అవి కుంటు పడతాయి, వాట్ టు డూ?” అని వర్రీ అయ్యాడు.
డయానా అతని వర్రీ ని చూసి, “ప్రాబ్లం ఏంటి? అర్జెంట్ గా మీ ల్యాబ్ కి మనిషులు అక్కర్లేదు, అలాగే డబ్బూ అక్కర్లేదు. చాలినంత ఉంది. వర్రీ దేనికి?”
“ఒకరిని ల్యాబ్ లోకి హైయర్ చేద్దామని”.
“ఏ ప్రాజెక్ట్ కు కావాలి? చెబితే నేను లెట్టర్స్ వ్రాస్తాను యూనివర్సిటీ కి, ఏ మెయింటైనన్స్ ఫండో ఇమ్మని, ఎంతో కొంత మనీ ఇచ్చే అవకాశముంది కదా ..అయినా పని కాకపోవొచ్చు”
“రైట్… ఉన్న గ్రాంట్లకు సరిపడా స్పేస్, మెయింటైనన్స్ అంతా ఇచ్చింది. గ్రాంట్లలో సరిపడా క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని డీవియేట్ కూడా చెయ్యలేను, ఎలా ఎలా ????” అని అనుకుంటూ డయానాకు థాంక్స్ చెప్పి అక్కడినుండి కదిలి వెళ్ళిపోయాడు కౌశిక్.
డయానా అలానే చూస్తూ ఉండిపోయింది.
కాసేపాగి మళ్ళీ ఫొన్ చేసింది డయానా కౌశిక్ కు.
అంత అవసరమైతే పోనీ పార్ట్ టైమే తీసుకోండి, ఆ ఎక్స్ టెన్షన్ ఆఫ్ వర్క్ ని వచ్చిన వాళ్ళనే చెయ్యమనండి, ఉన్నవాళ్ళు గైడ్ చేస్తారు … అన్నది.
కౌశిక్ కు అంతకన్నా వేరే మార్గం లేదు. ఎందుకంటే ఛటర్జీ రిక్వెస్ట్ చేశాడు, పైగా సింథియా కన్నీళ్ళకి కూడా బాగా కరిగి ఉన్నాడు. ఆనాడు తాను ఇండియా వెళ్ళినప్పుడు తనని అన్నివిధాలా బాగా చూసుకున్నది కూడా, మర్చిపోలేదు కౌశిక్. అదే ధీమా కదా సింథియాకు!
బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు కౌశిక్.
డయానాకు మళ్ళీ ఫోన్ చేసి, ఒక యాడ్ ని వెబ్సైట్ లో పెట్టమన్నాడు, పార్ట్ టైం అని. తర్వాతి విషయాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా చెయ్యాలో అడ్మినిస్ట్రేటర్స్ కి తెలుసు.
ఆ రోజంతా ఆలోచించి, ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ల్యాబ్ లో ఉన్న సీనియర్ పర్సన్, పైగా వర్క్ లో స్మార్ట్ లేడీ, లహరి. సింథియాను లహరి క్రింద వేసి, ఆ పార్ట్ టైం ప్రాజెక్ట్ ని లహరి ఇన్ చార్జ్ లో ఉంచితే … టైం, డబ్బు, మెటీరియల్స్, రియేజెంట్స్ సింథియా చేతిలో పడి వ్యర్ధం కావు ఎందుకంటే లహరి ఇన్ చార్జ్ కాబట్టి, సింథియా కూడా లహరి సూపర్విషన్ లో పని నేర్చుకుంటుంది. తనకూ మొగమాటం పోకుండా ఉద్యోగం ఇచ్చినట్లుంటుంది. ల్యాబ్ లోనే సింథియా ఉంటుంది కాబట్టి, తనకేమవసరమొచ్చినా తాను చూసుకొనగలడు అనే సామాన్యపు ఆలోచనలో పడుపో యాడు. సింథియా యొక్క అసామాన్యతని అర్ధం చేసుకొనేటంత అనుభవం అతనికి ఆమెతో లేదు. కౌశిక్ పూర్తిగా ఛటర్జీ, సింథియాలను నమ్మేసాడు.
మరుసటిరోజు … ల్యాబ్ మీటింగ్ లో …
“లహరీ అండ్ ఆల్ … వుయ్ ఆర్ గెటింగ్ ఎ న్యూ పోస్ట్ డాక్ ఇంటూ అవర్ గ్రూప్. షి ఈజ్ వెరీ గుడ్ ఇన్ పర్ష్యూయింగ్ ప్రాజెక్ అండ్ స్పెషల్లీ షి హాజ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ కైండ్ ఆఫ్ వర్క్” … అని గబ గబా అబద్దాలు చెప్పేశాడు.
అంతేగాని ఆమె పేరు గానీ, ఎక్కడ ఉద్యోగం ఊడగొట్టుకొని ఇక్కడ ఎలా రాబోతున్నదని గానీ చెప్పలేదు వాళ్ళకు, అసలేమి చదివిందని కూడా చెప్పలేదు.
లహరీ “ఓ … దట్స్ నైస్. వేర్ ఈజ్ షి కమింగ్ ఫ్రం? … అడిగింది, నవ్వుతూ.
వెంటనే కౌశిక్ “ఫ్రం ఇండియా. షి హేజ్ ఎక్స్లెంట్ పబ్లికేషన్ రికార్డ్. ఐ న్యూ హెర్ బాస్”
ఇది ఛటర్జీ, కౌశిక్ కి చెప్పిన అబద్ధం.
వస్తాయి పబ్లికేషన్లు సింథియాకు, ఆమేమైనా వ్రాయాలా చెయ్యాలా? బిశ్వా నుండి కొట్టేసిన పి.హెచ్.డి, అతను వ్రాసి వదిలేసిన పేపర్లు. ఇప్పుడు హాయిగా పబ్లిష్ అవుతున్నాయి సింథియా పేరు మీద. సింథియా వెళ్ళిపోయినా ఛటర్జీ కి ఆమె బాధ్యత పోలేదు, అయినా ఛటర్జీ కి కూడా అవసరమే. అందుకే ఆ పేపర్లను అటు ఇటు చేసి తాను కూర్చొని వ్రాస్తూ, సింథియా పేరు ముందు పెట్టి తన వర్క్ గా పబ్లిష్ చేస్తున్నాడు. స్వార్ధం!

భిశ్వా మాత్రం తేరుకోవడానికి ఇంకా టైం పడుతుందనీ, వైద్యులు చెబుతుంటే గొల్లు మని ఏడుస్తూ మందులు వాడిస్తున్నారు బిశ్వా తల్లిదండ్రులు. బిశ్వా కి కాంఫిడెన్స్ మీద దెబ్బ కొట్టేశారు ఛటర్జీ, సింథియా.. మెల్లగా తేరుకుంటాడు.
**************************
మరుసటిరోజు ల్యాబ్ కి వెళ్తూనే లహరితో మాట్లాడాడు కౌశిక్.
“లహరీ, హౌ ఈజ్ యువర్ వర్క్ గోయింగ్ ఆన్?”
“గుడ్. యెస్టర్డే ఐ ప్రెజెంటెడ్ థ డాటా ఆన్ కరెంట్ ఎక్స్ పెరిమెంట్స్” … చిన్నగా ఆశ్చర్యపోతూ, నవ్వుతూ సమాధానమిచ్చింది లహరి.
“యెస్ యెస్. యువర్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ స్లో. ఈ లెక్కన నువ్వు చేస్తే డెడ్లైన్స్ మిస్ అవుతాను, గ్రాంట్స్ మిస్ అవుతాము”
“ఎక్స్ క్యూజ్ మీ … డిడ్ నాట్ గెట్ యువర్ పాయింట్” … భృకుటి ముడిచి అడిగింది లహరి.
“యెస్. యు ఆర్ స్లో ఇన్ డూయింగ్ థ థింగ్స్. ఐ కెనాట్ వెయిట్” … మొదటిసారిగా లహరిని నిందించడం మొదలుపెట్టాడు కౌశిక్.
లహరికి అర్ధంకాలేదు ఏమి చెప్పాలో. ప్రతివారం క్రొత్త రిజల్ట్స్ చూస్తున్నాడు, ఏది ఎప్పుడు జరగాలో అన్నీ జరుగుతూనే ఉన్నాయి, తానేమీ ఏ బ్యాక్ లాగ్స్ లో లేదు. మరి ఏంటిదీ????
ముఖంలో చాలా బాధను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నటించడం మొదలు పెట్టాడు కౌశిక్. ఆతర్వాత వెళ్ళిపోయాడు.
అలా అప్పటినుండీ, రోజుకి ఒకసారయినా సరే వచ్చి ఆమెని నిందించి వెళ్తున్నాడు. అలా అమెఒక్కర్తానికే. మిగితా ఎవరినీ ఏమనటం లేదు. లహరికి అవమానంగా అనిపిస్తున్నది అలాగే మూడ్ ఆఫ్ అయిపోతున్నది.
కౌశిక్ సూటిగా ఏదీ చెప్పటం లేదు. అస్తమానూ ప్రాజెక్ట్ మీద పెట్టి లహరిని బాధపెట్టడం తప్పా.
మిగితా కొలీగ్స్ తో మాట్లాడింది లహరి, వాళ్ళందరూ వెళ్ళి అతనితో డైరక్ట్ గా మాట్లాడమని చెప్పారు. సరే అని వెళ్ళి తలుపు తట్టింది. అతని చాంబర్ డోర్ దగ్గర్గా వేసి ఉంది, తాను చిన్నగా తట్టినా వినిపించుకొనే పరిస్థితిలో లేడు కౌశిక్. కౌశిక్ ఎప్పటినుండో ఫోన్లో మాట్లాడుతున్నట్లున్నాడు, అందులోనే మునిగిపోయున్నాడు.
అతనికి పర్సనల్ సెక్రటరీ కి చెప్పి ఇవతలకి వచ్చేసింది. అతని కాల్ అయ్యాక చెప్తానంది సెక్రటరీ. ఎప్పటికీ చెప్పలేదు. సాయంత్రం చేసి మళ్ళీ కౌశిక్ రూం వైపు వెళ్ళింది. సెక్రటరీ కనబడింది. మళ్ళీ ఫోన్ మీదే కౌశిక్ ఉన్నట్లు చెప్పింది. తన మెసేజ్ కౌశిక్ కి అందించినట్లుగా కూడా చెప్పింది. ఇహ ఆ పూటకి వదిలేసి లహరి వెళ్ళిపోయింది. ల్యాబ్ లోకి వెళ్లి కొంచెం పని ఉంటే చూసుకొని, బ్యాగ్ సర్దుకొని వెళ్ళబోతుంటే తల ప్రక్కకు తిప్పి చూసింది. కౌశిక్ ఇంకా తన చాంబర్ లోనే ఉన్నట్లున్నాడు.
“అరె… కౌశిక్ ఉన్నాడే. మరి నా మెసేజ్ తెలుసుకొని కూడా ఎందుకు నన్ను మాట్లాడడానికి పిలవలేదు?” … అని అనుకున్నది.
సరే ఏదయితే అదే అవుతుంది. వెళ్ళి తానే మాట్లాడాలి అని వెళ్ళింది.
కౌశిక్ … అప్పుడే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు, మళ్ళీ అదే నవ్వు, అదే సరదా … లహరి ప్రొద్దున్న చూసినదే. కౌశిక్ ఈ లోకంలో లేడు. వెనుదిరిగి వెళుతూ… కౌశిక్ నోటినుండి సింథియా సింథియా అనే మాట విన్నది.
కానీ తనకు అదే మొదటిసారి ఆ మాట వినడం. ఎవరోలే … ఏదోలే… అనుకొని అక్కడినుండి వెళ్ళిపోయింది లహరి.
******************
మరుసటి రోజు కౌశిక్ తానే వచ్చాడు లహరి చాంబర్ కి.
“సారీ లహరీ, నిన్న చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండడం వల్ల, నీ మెసేజ్ తీసుకున్నా మీట్ అవ్వలేకపోయాను. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ?”
లహరి అవాక్కయిపోయింది, ఆ ప్రశ్నకు. “ఏమీలేని చోట రాళ్ళేసి కలకలం లేపుతున్నాడు. ఎందుకలా అని అడుగుదామనేసరికి మీటింగ్స్ లో ఉన్నానని తప్పుకుంటున్నాడు. ఇప్పుడొచ్చి నీకేమి చేయగలను అంటున్నాడు. చాలా కన్ ఫ్యూజ్ చేస్తున్నాడు నన్ను” … అని అనుకొంది.
ఏమి చెప్పాలో తెలియక … ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని, అని అనేసింది.
“సరే… టెల్ మి” అన్నాడు.
“యు సెడ్ … మై ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ స్లో. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ యు మీన్”.
“వెల్ .. ఐ మీన్ థట్ ఓన్లీ”
“ఐ నెవెర్ ఫెల్ట్ థట్ వే”
“బట్ ఐ ఫెల్ట్ ఇట్” … అని ఎడ్డ మంటే తెడ్డ మంటున్నాడు. ఏమి చెయ్యాలో చెప్పడు, ఎక్కడ స్లో కూడా చెప్పడు. తన ఉద్దేశాలని బయటపెట్టడు. అలా వాదించి వాదించి లహరి శక్తినంతా హరించి వెళ్ళిపోయాడు, వెళ్ళి మళ్ళీ ఫోన్ మీద కూర్చున్నాడు.
ఇదంతా వింటున్న, సెక్రటరీ కి కూడా ఆశ్చర్యం వేసింది. సెక్రటరీ కి తెలుసు, ల్యాబ్ లో ఉన్న ప్రతి విషయం ఈ మధ్య క్రొత్తగా సింథియా అనే వ్యక్తితో ఫోన్లో చర్చిస్తున్నాడు. కానీ తాను పర్సనల్ సెక్రటరీ కనుక కాన్ ఫిడెన్షియల్ గా ఉంచుతుంది. పాపం లహరికి, మిగితావాళ్ళకీ తెలియదు.
********************
చివరగా … ల్యాబ్లో లహరికి, మిగితావారికి కలిపి చెప్పాడు. రెండురోజుల్లో సింథియా అనే వ్యక్తి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వబోతుందని. ఆ విషయం ఎలాగూ ల్యాబ్ మీటింగ్ లో చెప్పాడు, నిన్న ఫోన్లో మాట్లాడేటప్పుడు, అతని నోటినుండి సింథియా అనే పేరు విన్నది. ఇప్పుడు ఆ సింథియా పేరే అందరితో పాటు విన్నది.
తర్వాత లహరిని పర్సనల్ గా మళ్ళీ ఆమె పని చేసుకుంటునప్పుడు, వర్కింగ్ బెంచ్ దగ్గిరకి వచ్చి మాట్లాడసాగాడు.
లహరి ముఖం లో ఒకప్పటి ఆనందం లేదు, సింథియా వచ్చేలోపులే … ఆ ఆనందాన్ని సగం హరించేశాడు కౌశిక్. ఆ పేలవమైన మొహం చూసినా ఏమీ పట్టనట్లు చెప్పుకుపోతున్నాడు లహరికి.
“ఇప్పటివరకు నువ్వు చేస్తున్నదాన్ని సింథియాకు ఎలా చెయ్యాలో చెప్పు” అన్నాడు కౌశిక్.
అర్ధం కాలేదు లహరికి. “వాట్?” … చిరాగ్గా మొహం పెట్టింది లహరి.
ఆమె అసంతోషానికి కారణాలు తానే అని కౌశిక్ కి తెలీదా ఏంటి? కాబట్టి ఏమీ పట్టనట్టు….
“నువ్వు విన్నది నిజమే” అన్నాడు.
“మరి నేనేమీ చెయ్యాలి?”
“వెల్ … గైడ్ చెయ్యి ఆమెని.
“నా ప్రాజెక్ట్ ని మధ్యలో నేను ఆపేసి… ఆమె కిస్తే … తానెలాగ చేస్తుందో?”
ఆ మాటకు కౌశిక్ చాలా ఫ్యూరియస్ అయిపోయాడు. “యు కెన్ నాట్ గెట్ ఎలాంగ్ విత్ ఎనీబడీ. అందుకే అలా పాపం ఆమె మీద చెబుతున్నావ్”
ఆ మాటకి … మనసులోనే గట్టిగా “స్టాప్ థ నాన్సెన్స్” అని అరుచుకున్నది లహరి.
“ఎలాగో బాధగా నోరు పెగల్చుకొని … ఆమె మీద చెప్పడానికి నాకు ఆమె ఎవరో తెలుసా?…యు ఆర్ మేకింగ్ డామేజ్డ్ స్టేట్మెంట్స్ ఆన్ మి”.
“ఐ డిడ్ నాట్ ఫెల్ట్ థట్ వే. యు ఆర్ మేకింగ్ డామెజ్డ్ స్టేట్మెంట్స్ ఆన్ హెర్”
“ఐ యాం టాకింగ్ అబౌట్ థ ప్రాజెక్ట్. సడన్ గా క్రొత్త వాళ్ళని పెడితే… వాళ్ళు ప్రాజెక్ట్ ని అర్ధం చేసుకొని చేతుల్ని వార్మ్ అప్ చేసుకొనేసరికి టైం పడుతుంది. అప్పుడే ప్రాజెక్ట్ కుంటుపడుతుంది, అందుకే చెప్పాను”
“అందుకే కదా నిన్ను గైడ్ చెయ్యమంటున్నాను”
“కానీ ఆమెకోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది”
“అలా జరగడానికి కుదరదు. ప్రాజెక్ట్ ఏమాత్రం కుంటుపడడానికి వీల్లేదు, ఎట్ థ సేం టైం సింథియాని మూడునెలల్లో నీ లెవ్లె లో వర్క్ చేసేదానిలా తయారు చెయ్యాలి, అది నీ డ్యూటీ” అంటూ ఒక్క మాట ఎక్స్ ట్రా వినకుండా చకా చకా నడుచుకొని వెళ్ళిపోయాడు.
లహరికి ఇదే మొదటిసారి కౌశిక్ లో మరో మనిషిని చూడడం. ఈ క్రొత్త మనిషి దుర్మార్గుడు.
లహరికి తన ప్రాజెక్ట్ మరొకరి షేర్ చేసుకుంటున్నందుకు బాధలేదు, సాగిపోతున్న ప్రవాహంలో ఆనకట్టవేస్తే … నీళ్ళు ఎలా వేరే వేరే డైరక్షన్లలో నీళ్ళు వ్యర్ధమవుతాయో అదే ప్రమాదముంది హటాత్తుగా ప్రాజెక్ట్ ఆగిపోయినా, క్రొత్త వాళ్ళ చేతిలో అదీ వర్క్ రాని వాళ్ళ చేతిలో పెడితే.
సింథియా చేతిలో ప్రాజెక్ట్ ని పెట్టి, లహరిని గైడ్ చెయ్యమన్నప్పుడే అర్ద్జమయ్యింది సింథియాకి ఏమీ రాదని. అది డైరక్ట్గా చెప్పలేక… ఎందుకంటే ఏమీ రాని మనిషి ని ఎవరూ పెద్ద ప్రాజెక్ట్స్ లో పెట్టరు. ఏదో చిన్న ప్రాజెక్ట్స్ సెపరేట్ గా ఇచ్చి సీనియర్లు వాళ్ళని గైడ్ చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి వ్యవహారం అలా కనబడడం లేదు.
పెద్ద చేపలకి గాలం వేసే సింథియా గైడన్స్ లో కౌశిక్ ఇప్పుడు నడుస్తున్నాడు, పైగా ఛటర్జీ అండదండలు ఇద్దరికీ ఉన్నాయి ఎవరి స్వవిషయాల్లో వాళ్ళకి.
పాపం ఇదేమీ తెలియని లహరి ఖిన్నురాలై కౌశిక్ ప్రవర్తనకు బాధ పడుతూ రూం కి వెళ్ళిపోయింది.
రెండురోజులు దాటాక సింథియా రానే వచ్చేసింది. వస్తూనే నేరుగా ల్యాబ్ దాటుకుంటూ, ఎవరి మొఖాలకాసి కూడా చూడకుండా నేరుగా కౌశిక్ రూం కి వెళ్ళిపోయింది. ఏ తీరులో వచ్చే ఉద్యోగ లక్షణం ఆ తీరులోనే ఉంటుంది. ఆమె అలా కదులుతూ ఉంటే ఆమె ని చూస్తూ అందరూ ఎవరికి వారు చిన్నబుచ్చుకున్నారు కాసేపు.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *