May 4, 2024

నదుల తీరాలపైననే నాగరికతలన్నీ

రచన: రామా చంద్రమౌళి     నాగరికతలన్నీ నదుల తీరాలపైననే పుట్టినపుడు మనిషి తెలుసుకున్న పరమ సత్యం .. ‘ కడుక్కోవడం ‘ .. ‘ శుభ్రపర్చుకోవడం ‘ ఒంటికంటిన బురదను కడుక్కోవడం , మనసుకంటిన మలినాన్ని కడుక్కోవడం చేతులకూ, కాళ్ళకూ.. చివరికి కావాలనే హృదయానికి పూసుకున్న మకిలిని కడుక్కోవడం కడుక్కోవడంకోసం ఒకటే పరుగు కడుక్కోడానికి దోసెడు నీళ్ళు కావాలి .. ఒక్కోసారి కడవెడు కావాలి మనిషి లోలోపలి శరీరాంతర్భాగమంతా బురదే ఐనప్పుడు కడుక్కోడానికి ఒక నదే […]

*మొగ్గలు*

  రచన:   – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్   చీకటిలోకి ప్రయాణం చేస్తూనే ఉంటాను వెలుగుచుక్కలను వెతికివెతికి ముద్దాడాలని కిరణాలు వెలుతురు చినుకులు   దుఃఖాలను దిగమింగుతూనే బతుకుతుంటాను జీవనసమరంలో ఆటుపోట్లు సహజాతిసహజమని సుఖదుఃఖాలు జీవితంలో ఆలుమొగులు   కష్టాలతోనే జీవననౌకను నడుపుతుంటాను ఆనందాల తీరాన్ని సునాయాసంగా చేరాలని ఆనందాలు కౌగిట్లో వాలే పక్షులు   పూలను చూసి గర్వంగా మురిసిపోతుంటాను స్వేచ్ఛగా నవ్వుతూ పరిమళాన్ని పంచుతాయని పూలు మనసుకు హాయినిచ్చే మలయమారుతాలు   తొలకరి చినుకులకు […]

*అమ్మేస్తావా అమ్మా*

  రచన: అభిరామ్     అయ్య పనికెళ్ళగానే నీవు కూలికి కదలగానే ఇంట్లో ఉన్న అంట్లు తోమి ఊరి చివర నుంచి కట్లు మోసి మైళ్ళదూరం నడిచి నీళ్ళు తేచ్చిన నేను నీకు బరువయ్యానా అమ్మ అయ్యచేసిన అరువుకు నన్ను అమ్మేస్తావా అమ్మా   చదువుల పలక పట్టకుండా చేలోని సెలికపట్టి అయ్య వెంట తిరుగుతూ సాళ్ళు నీళ్ళతో తడిపి నేను కూడ తడిచిపోయి పగి‌లిన ప్రత్తిలా నవ్విన నేను నీకు బరువయ్యానా అమ్మ అయ్యచేసిన […]

|| కవితా! ఓ కవితా! ||

  రచన: కొసరాజు కృష్ణప్రసాద్   కవితా! ఓ కవితా! నా మదిలో మెదలినపుడు, మస్తిష్కపు నాడులలో మోసితి నిను తొలిసారిగ తల్లియు తండ్రియు నేనై. ఎన్నెన్నో ఊహాలతో, మరియెన్నో కలలతోటి, పులకించితి నీ తలపుతొ ఏ రూపున ఉంటావోనని.   కలం నుంచి జాలువాఱి వెలువడగా నిన్నుఁజూచి, సుఖప్రసవమై నిన్నుఁగన్న ఆనందపు అనుభూతితొ, మురిసి మురిసి ముద్దాడిన మధుర క్షణం అతిమధురం.   అక్షరాలే పువ్వులుగా ఏరి ఏరి కూరుస్తూ, నీ భావానికి మెరుగులద్ది తీర్చిదిద్ది […]