May 2, 2024

ఆనందం..

రచన: బి.రాజ్యలక్ష్మి   ప్రతి మనిషి లో  మరో వ్యక్తిత్వం తప్పనిసరి !అంతర్లీన  ఆలోచనలు  భావాలూ  మెరుగుపడిన  స్మృతులు  అసలుమనిషి జాడలు  మనకు తెలియకుండానే  తెలుపుతాం! ఒకరోజు  ఆలా  కళ్ళుమూసుకుని  ఆలోచనలలోనికి  నన్ను  నేను  తొంగి  చూసుకున్నాను !కలం  నన్ను  పలుకరించింది ! గళం  పలుకమన్నది !కానీ  మనసుమాత్రం  మరోలోకం లో మధుర మురళిని  ముద్దాడింది !నల్లనయ్య  మోహన  వంశి   అలలతేరుపై నాముందు  వాలింది ! నిజం !సాగరతీరం , సంధ్యాసమయం  పున్నమి రేయి  జాలువారే  వెన్నెల  […]

🌷 *మొగ్గలు*🌷

రచన:- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఆలోచనలకు భావాలతో అంకురార్పణ చేస్తేనే కానీ అక్షరాలు రసగంగకవితాప్రవాహాలై పరుగెడుతాయి ఆలోచనలు మేధస్సుకు పూచిన పువ్వులు ఉదయాలు సుప్రభాతగానాలను వినిపిస్తేనే కానీ మట్టిమనుషులు వేకువను ముద్దాడే వెలుగవుతారు ఉదయాలు కోడికూతల రాగాలకు ప్రతీకలు కెరటాలు అలజడులతో పోరుసల్పితేనే కానీ సాగరం గంభీరమైన తన అస్తిత్వాన్ని చాటుకోదు కెరటాలు ఆటుపోట్లను భరించే నిర్ణిద్రగానాలు కిరణాలు వెలుగుబాణాలను సంధింపజేస్తేనే కానీ తిమిరం ఎప్పటికైనా ఓటమి అంచున నిలబడాల్సిందే కిరణాలు అజ్ఞానాంధకారాన్ని తొలగించే దివిటీలు మనిషి […]

ఇకనైనా మేల్కో

రచన: శ్రీనివాస్ సూఫీ   మెదడు పొట్లం విప్పి నాలుగు పదాలు వాక్యాలకోసం అకస్మాత్తుగా వెతుక్కుంటే అలానే ఉంటుంది… స్పష్టత కరవైతే అంతే… గోదారిలో మునిగి కావేరిలో తేలి యమున గట్టుకు కొట్టుకు పోవటం….. అవగాహన గాలమో, వలో లేకపోతే ఎవరికైనా మాటలు, భావాల వేట ఎలా సాగుతుంది.. జాలరి ఒంటరిచేతులు విసిరినంత మాత్రాన చేపలు చిక్కటం చూశావా… నీ ఇంటి ముందో వెనుకో.. ఒకడు ఆఖరి యాత్రకు ఒట్టికాళ్ళతోనే నడిచాడని తెలిసినపుడు.. అతన్ని సమీక్షించేందుకు నీ […]

వేపచెట్టు

రచన:  పవన్ కుమార్ కోడం వసంతకాలపు చిగుళ్లతో చిరుగాలి పూయిస్తూ ఉక్కపోతలో ఉపశమన్నాన్ని అందిస్తుంది లేలేత ఆకులు నోటిలో నూరి చేదు కాస్త తియ్యదనంగా మారింది విచ్చుకున్న వేప పూత పచ్చడిలో పరిమళించి ఊగాదికి ఊపిరి పోసింది విసిరి విసిరి కొడుతున్న ఎండను కొమ్మల  ఆకుల చేతులు అడ్డుపెట్టి నీడను పరిచి నిప్పులకుంపటికి ఆహుతవుతుంది దుఃఖాన్ని దిగమింగుకుని దారిద్య్రాన్ని దాచుకుని దోపిడీకి తావులేకుండా ఆకురాలు కాలాన్ని అధిగమించి పేటెంట్ హక్కుతో విదేశాలకు పయనించి శ్రమనంతా  ఔషదాల తయారీకి […]

మనం ఇలా ఉంటామెందుకు?

రచన: వసంతకుమారి పొద్దున్న లేస్తూనే దేముణ్ణి పూజిస్తాం-ఇంట్లో ఇల్లాలిపై మాత్రం కసుర్లు. శివుడు తనలో అర్ధ భాగమిచ్చాడని తలుస్తూ- నీకేమీ తెలీదని భార్యని దెప్పి పొడుస్తూ. పుస్తకాన్ని సరస్వతీ అని నమస్కరిస్తుంటాం- ప్రతీదానికీ పేపర్ చెత్త కోసం వాడతాం. అగరబత్తి డబ్బా పైన ఉండే దేముని బొమ్మనీ దాస్తాం-ప్రతీ అబద్దానికీ దేముడిపై ఒట్టేస్తూ. లక్ష్మీ దేవిని పూజిస్తూ-లక్ష్మీ బాంబుని పెల్చేస్తూ దీపావళి. ప్రతీ రోజూ గుడి కెళ్లాలని ప్రయత్నిస్తాం-వెళ్ళినా వరసలోనిలబడకుండా ముందుకు తోసుకెళ్ళిపోతూ. ప్రసాదం కళ్ళకద్దుకుని తింటాం-చేతిని […]