April 26, 2024

బొటన వేళ్లు

రచన: ఈతకోట సుబ్బారావు

దేశం నిండా
ఈ బొటన వేళ్ళ పంట
తగ్గనంత వరకు ఇంతే.

ఓటు వేసే రాచ కార్యం నుండీ
నోటు పై సంతకం వరకు
బొటన వేళ్లు పండుతున్నాయి.

విత్తిన చేతుల నుండి
వేలాడే శవాల వరకు
అన్నీ బొటన వేళ్లే కదా.

ఓ రైతు నడిగాను
చదువుకోరాదా అని
జవాబు విని నేను చనిపోయారు
చదువుకున్న వాళ్లేగా
మమ్మల్ని మోసం చేస్తున్నది
చదువుకొని మేం
మోసం చేయలేం బాబూ.

1 thought on “బొటన వేళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *