April 28, 2024

విశ్వపుత్రిక వీక్షణం – భూమి ద్వారం మూసుకపోతోంది

రచన: విజయలక్ష్మి పండిట్. మన దేశంలో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళలలో చిన్నవయసులోనే 15-45 ఏండ్ల లోపే గర్భసంచి తొలగింపుకు లోనవుతున్నారని, ఇది మహిళలలను ఆరోగ్య సమస్యలకు గురిచేయడమే కాకుండా కొన్ని బీద, వెనుకబడిన, నిరక్షరాస్య మానవ సమూహాలు, జాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్న నిజాలు. ఇటీవల మహిళా దినోత్సవ సధర్భంగా “ వసుంధర “ పురస్కార గ్రహీత గైనకాలజిస్టు డా. వెంకట కామేశ్వరి గారి ప్రత్యక్ష అనుభవం ఆమె మాటలలో మనలో […]

యోగాసనం 2

రచన: రమా శాండిల్య హరి ఓం భద్రాసనం భద్రాసనం అంటే ఆసనం పేరులోనే భద్రత యిముడ్చుకున్నది. అంటే ఆ ఆసనం వేయడం వలన మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది అని వేరే చెప్పక్కరలేదు కదా. భద్రాసనం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది అరుగుదల ఆహారం ఆరగడానికి పనికి వస్తుంది. కాంష్టిపెషన్ ఉండదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ , ఇన్డేజెషన్ ఇలాంటి వాటికి కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో ప్రతివారికి నడుము నొప్పి ఉంటోంది ఆ నొప్పికి […]

అంబ -శిఖండి వృత్తాంతము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. మాహా భారతములో అనేక పాత్రలలో కారణజన్మురాలై భీష్ముడి మరణానికి కారణము అయిన అంబది చాలా ప్రత్యేకమైన పాత్ర ఈమె కాశీ రాజు ముగ్గురు కుమార్తెలలో పెద్దది ఈవిడ సాళ్వుని ప్రేమించింది ఇద్దరు వివాహము చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు ఈవిడకు భీష్ముడి మరణానికి గల సంబంధము ఏమిటో తెలుసు కుందాము. శంతనుడు మరణించాక రాజ్యపాలన భారము సత్యవతి పుత్రుల పరము అయింది భీష్ముడు తన ప్రతిజ్ఞ వల్ల రాజ ప్రతినిధిగా ఉండి సత్యవతి […]

విశ్వనాథ వారి భ్రమరవాసిని

రచన: రాజన్ అలల సవ్వడులలతో హోరెత్తుతూ.. తిరిగి నెమ్మదించి, ప్రశాంతత పొందిందనే లోపుగనే మరింత ఉధృత కెరటాలతో ఎగసిపడి, కల్లోలము నుండి ప్రశాంతతకు, ప్రశాంతత నుండి కల్లోలానికి తన పథాన్ని మార్చి మార్చి, నురగల నగవులో లేక నశ్రువులో చిందించే సాగరానికి సైదోడు… మనిషి మనస్సు. ఆలోచనల, కోరికల పుట్టినిల్లయిన అటువంటి మనస్సును గూర్చి, దాని స్వభావమును గూర్చి ఒక ఆలోచన చేయించి, ఆంతరిక ప్రపంచ జ్ఞానమును, బాహ్య ప్రపంచ విజ్ఞానమును కలబోసి, అక్షరములుగా పోతపోసి మనకందించిన […]

కవితా నీరాజనమైన నివేదన

రచన: సి.ఉమాదేవి కవయిత్రి కవితా చక్ర పలికించిన నివేదన, రాగాలు పలికిన కవితాఝరి. అక్షర ఆర్తితో లిఖించిన ప్రతి పదము రచనాపూదోటలో కవితాసుమమై మధురిమలను వ్యాపింపచేస్తుంది. కలము, గళము యుగళగీతమై అందించిన కవితార్చనలోని తాత్వికత, తాదాత్మ్యతకు గురిచేస్తుంది. పుస్తకం శీర్షిక నివేదన, కాని ప్రతి వాక్యములో ఆరాధన, ఆవేదన సమ్మిళితమైన నివేదనగా రూపుదిద్దుకున్న రచన. ‘దోసిటనిండిన ఆశల పూలరెక్కలు మాయమై హృదయభారాన్ని మిగిల్చాయనడంతో’ నివేదన అక్షరానికి ఊపిరవుతుంది. ‘నేను నడిచే దారుల్లో నీమాటల పూవులు నన్ను తాకుతున్నాయి, […]

మార్మిక శూన్యం

రచన: రామా చంద్రమౌళి అనువాదం: అనంత పద్మనాభరావు మార్మిక శూన్యం నిజానికి చాలాసార్లు మనకు ఏమి కావాలో మనకు తెలియదు ఖాళీ గ్లాస్‌ వంటిది జీవితం అని ఒక ఉవాచ గ్లాస్‌ సగం నిండి ఉందా.. సగం ఖాళీగా ఉందా అని ఒక చతురుడి ప్రశ్న అసలు ఈ ‘ ఖాళీ ’ ఏమిటి లోపల .. ఆత్మలో అని ఒక మీమాంస ఇక అన్వేషణ మొదలౌతుంది అప్పుడు ఏదో అభౌతిక ప్రతిద్రవ్యం ( anti matter […]

దేనికి ..?

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. మాటకా? మనసుకా? దేనికి నీ ప్రాధాన్యత? వయసా?వలపా? దేనితో నీ అన్యోన్యత? రూపానితోనా?గుణానితోనా? దేనితో నీ సారుప్యత? నిన్నటితోనా?నేటితోనా? దేనితో నీ తాదాత్మ్యత? జననంలోనా?మరణం లోనా? దేనిలో నీ తాత్వికత? సంపాదనతోనా?సత్యసంధత తోనా? దేనితో నీ సామీప్యత? మాయలకా?మహిమలకా? దేనికి నీ ప్రాధాన్యత? కరుణతోనా?కరుకుతనంతోనా? దేనితో నీ పరిపక్వత? శాంతికా?భ్రాంతికా? దేనితో నీమనో పులకిత? ద్వేషించటానికా?దీవించటానికా? దేనికి నీ అస్వస్థత? స్వార్ధమా?పరమార్ధమా? ఏది నీకు అలభ్యత?

ఆడంబరపు కోరికలు….

రచన : శ్రీకాంత గుమ్ములూరి. చక్కటి ఎర్రటి కలువలు బురద కొలనులో విరగబూచి పథికుల మనసును దోచిన రీతి ఊహలపై అల్లుకుని ఇచ్చకాల మాటలతో నా మనసును ఆవరించి సరస సల్లాపాలాడే ఆడంబరపు కోరికలారా వదలి పోరెందుకని ? ఉన్నత శిఖరాలను చేరాలని ఒంటరి లోకాలలో ఏకాకిగ పేరు ప్రతిష్టల వలయాలలో అంతరాత్మను కోల్పోయి భంగపడ్డ ఆశయాలు పదే పదే వెక్కిరించి అటూ ఇటూ కాకుండా తట్టని ఆలోచనలను పెంచిన ఆడంబరపు కోరికలారా వదలి పోరెందుకని ? […]

బొటన వేళ్లు

రచన: ఈతకోట సుబ్బారావు దేశం నిండా ఈ బొటన వేళ్ళ పంట తగ్గనంత వరకు ఇంతే. ఓటు వేసే రాచ కార్యం నుండీ నోటు పై సంతకం వరకు బొటన వేళ్లు పండుతున్నాయి. విత్తిన చేతుల నుండి వేలాడే శవాల వరకు అన్నీ బొటన వేళ్లే కదా. ఓ రైతు నడిగాను చదువుకోరాదా అని జవాబు విని నేను చనిపోయారు చదువుకున్న వాళ్లేగా మమ్మల్ని మోసం చేస్తున్నది చదువుకొని మేం మోసం చేయలేం బాబూ.