April 27, 2024

నా శివుడు

రచన: రాజన్ దిక్కుల చిక్కుల జటాజూటము అందులొ హరిసుత నిత్యనర్తనము కొప్పున దూరిన బాలచంద్రుడు జటగానుండిన వీరభద్రుడు . గణపతి ఆడగ నెక్కిన భుజములు మాత పార్వతిని చేపట్టిన కరములు స్కందుడు కూర్చొను ఊరువు నెలవులు సకల దేవతలు మ్రొక్కెడు పదములు . అజ్ఞానాంతపు ఫాలనేత్రము శుభాలనిచ్చే మెరుపు హాసము ఘోరవిషమును మింగిన గ్రీవము సర్వలోక ఆవాసపు ఉదరము . మదమను గజముకు చర్మము ఒలిచి ఒంటికి చుట్టిన తోలు వసనము మృత్యుంజయుడను తత్వము తెలుపు మెడలో […]

గజల్

రచన: శ్రీరామదాసు అమరనాథ్ అల తాకగానే దరి పులకరించింది నది సొగసుతో తాను పరవశించింది . కల చెదిరి మదిలోన గుబులాయనేమో ఒక మనసుకై తనువు పలవరించింది . తలపైన పూబంతి వికసించెనేమో ఒక ప్రేమ అనుభూతి పరిమళించింది . ఇలలోన అందాలు దాగున్నవేమో ఒక సొగసు వెన్నెలై పరితపించింది . శిలలోని సొంపులను పరికించితే ‘శ్రీయా ‘ ఒక మూగ రస జగతి పలుకరించింది .

నిజాలు

రచన: పారనంది శాంతకుమారి. అమ్మలాంటి చంద్రుడున్నా… నాన్నలాంటి సూర్యుడులేని రాత్రిలో, ఎంతటి భయమో మనని వాటేస్తుంది. తెల్లవారితేమాత్రం… అదేభయం ముఖం చాటేస్తుంది. అమ్మ ప్రేమలాంటి వెన్నెల- ఇవ్వలేని ధైర్యాన్ని, నాన్నప్రేమలాంటి వెలుగు ఆశ్చర్యంగా ఇవ్వగలుస్తుంది. వెన్నెల ఇచ్చేఆహ్లాదం కన్నా వెలుగు ఇచ్చే ఆరోగ్యమే జీవితాన్ని సాఫీగా నడిపిస్తుంది. వెన్నెలవల్ల కలిగే బ్రాంతులనుండి వెలుగు మనని విడిపిస్తుంది, వాస్తవంలోని విలువలను మనకి నేర్పిస్తుంది. అనుభవిస్తే….వెన్నెల ఇచ్చే చల్లదనం కన్నా వెలుగు ఇచ్చే వెచ్చదనం మిన్నఅనిపిస్తుంది. ఆలోచిస్తే….వెన్నెల వెదజల్లే చల్లదనానికి […]

అనిపించింది

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. ఈ సృష్టిలో అమ్మ నాన్నకంటే ఎందుకు ఎక్కువో మన దృష్టిలో నాన్న అమ్మకంటే ఎందుకు తక్కువో ఆలోచిస్తేనే అర్ధమవుతుంది, అవలోకిస్తేనే బోధపడుతుంది. కలయికలోని సుఖాన్ని మాత్రమే ఆశించే నాన్నలోని ఆవేశంవల్లే ఈ సృష్టిలో నాన్నతక్కువయ్యాడని అర్ధమయింది. కలయిక తరువాత కలిగే కష్టాలన్నిటినీ అమ్మ ఆనందంతో ఆస్వాదించటంవల్లే మన దృష్టిలో అమ్మ ఎక్కువయ్యిందని బోధపడింది. కోపం ధూపమై నిలిచి ఉన్ననాన్న ప్రేమ, శాంతం ఆసాంతం కలిగిఉన్న అమ్మ ప్రేమ, కరిగి కన్నీరయ్యే మెత్తదనాన్ని […]