June 19, 2024

మాలిక పత్రిక జనవరి 2020 సంచికకు స్వాగతం..

  Jyothivalaboju Chief Editor and Content Head కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహంతో  ముందుకు అడుగులేస్తూ, నడుస్తూ, పరుగులు పెడదాం. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది కదా. ఇప్పుడిప్పుడే కదా కొత్త సంవత్సరం అనుకున్నాం. అంతలోనే  మళ్లీ ఇంకో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ బిజీ బిజీ లైఫ్ లో అంతా వేగవంతమయిపోయింది. ఎలా తెల్లవారిందో, అప్పుడే రాత్రి కమ్ముకుందో అనపిస్తుంది. అంత వేగంగా గడిచిపోతుందని అందరూ ఒప్పుకుంటారు. పాఠకులకు, […]

రాజీపడిన బంధం – 1

  రచన: కోసూరి ఉమాభారతి “వెండితెర – సినీ సర్క్యూట్ వారి – తాజావార్త ” – పేపర్ చదువుతూ, ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తున్న శైలిలో చేయి పైకెత్తి స్వరం పెంచిందామె. “ ‘మొరటోడు’ సినిమా చిత్రీకరణ సమయంలో- ‘రొమాంటిక్ సీక్వెన్స్ కోసం వెరైటీగా బాక్సింగ్, ఫుట్బాల్ క్రీడల్లో పాల్గొన్నందుకు నటి రాణి గాయాలకి లోనై అస్వస్థతకి గురవడంతో వారంపాటు షూటింగ్ నిలిపి వేసినట్టు దర్శకుడు కరుణాకరం అందించిన వార్త. వరుణ్ హీరోగా నిర్మాణంలో ఉన్న […]

చిన్ని ఆశ

రచన: నాగజ్యోతి రావిపాటి పక్షిగా నా పయనం ఎటువైపో తెలియదు..కాని నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నా.. ఆ దూర తీరాలు కనిపించి కవ్విస్తున్నా.. అలుపెరగక ముందుకు సాగుతున్నా.. నా ఈ ఒంటరి పయనంలో ఒక చోట నాలాగే మరిన్ని ఆశా జీవులు కనిపించాయి..మాట మాట కలిసి మనోభావాలు తెలిపి ఈ సారి గుంపుగా తరలి వెళుతుంటే..ఎన్నో సూర్యోదయాలు పలకరించి పారవశ్యం కలిగించాయి. ఆ మేరు పర్వతాలు గర్వంగా నిల్చుని తమ శోభను చూపుతున్నాయి. హిమాని నదుల అందం […]

ఆపద్ధర్మం

రచన: డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం రావి చెట్టు నీడన చప్టా మీద కూర్చున్న సుందరం చుట్టూ చూసాడు. ఉదయం పదకొండు గంటల సమయంలో గుడి నిర్మానుష్యంగా వుంది. గర్భ గుడి తలుపులు తెరిచి వున్నప్పుడే అర కొరగా వుంటారు భక్త జనం. ఇక గుడి తలుపులకు తాళం పడ్డాక పిట్ట, పురుగు కూడా కనబడదు ఆవరణలో. ఒక అరటి పండు చేతిలో పెట్టకపోతాడా పూజారి అన్న ఆశతో వచ్చిన సుందరానికి ఆ రోజున తొందరగా పూజ ముగించి, […]

కనువిప్పు

రచన: చిత్రపు లక్ష్మీ పద్మజ ఉదయం ఏడున్నరయింది. సుశీల ఈలోపు ఆరుసార్లు వాకిట్లోకి తొంగి చూసింది. పనమ్మాయి రత్నమ్మ కోసం. గేటు ఇప్పుడు చప్పుడవటంతో మరోసారి చూసింది. రత్నమ్మ. ”ఏమే ఇవాళ ఇంత ఆలస్యం అయ్యింది” అంది సుశీల. ”ఏం చెప్పను అమ్మా వస్తూనే వున్నా, రాత్రంతా మా మరిది తాగేసి వచ్చి పెళ్లాన్ని చితక బాదాడు. గొడవంతా సద్దాుమణిగి పడుకునే సరికి ఆలస్యమైంది. కాస్త ఆలస్యంగా లేచాను. ఇదిగో ఎంత సేపు అంతా చక్కబెట్టేస్తాను”. అంటూ […]

గడిలో దాగిన వైజ్ఞానిక నుడి – 4

గడి కూర్పరి: చాగంటి కృష్ణకుమారి wts సూచనలు : అడ్డం: 1. సూక్ష్మ దర్శిని కి ఇంగ్లీషు అటుదిటుగా (4) 3.మన ఎముకల ఆరోగ్యానికి ఈ రసాయన లోహము కీలకమైనది ( 4) 5. — వుంటే కలదు సుఖం 6. ఆత్రము ( 4 ) 8. తెలుగు మహిళల కోసం గృహలక్ష్మి అనే పత్రికను ప్రోత్సహించిన్ కె. ఎన్. కేసరి గారి మునిమనవడు నేపధ్య గాయకునిగా , శాస్త్రీయ సంగీత గాయకునిగా బాగాప్రసిద్దుడు . […]

చీకటి మూసిన ఏకాంతం – 9

రచన: మన్నెం శారద రెండ్రోజుల తర్వాత సాగర్ నుండి ఫోనొచ్చింది. “నిశాంతా నీ రిపోర్టులు వచ్చేయి. నీకేం లోపం లేదు. ఒకసారి హితేంద్రని కూడ పంపు! అతన్ని కూడ ఎగ్జామిన్ చేస్తే..‌.” “అలాగే. థాంక్స్” అంది నిశాంత. “ఎలా వున్నావు?” “బాగానే వున్నాను.” ఫోను క్రెడిల్ చేస్తుండగా లోపలికొచ్చేడు హితేంద్ర. అతనింటికొచ్చి రెండ్రోజులు దాటింది ‌ అతని వంక తేరిపార చూసింది నిశాంత. అతని మొహం సీరియస్ గా వుంది. “ఎవరితో మాట్లాడుతున్నావ్ ఫోన్లో!” అనడిగేడు సోఫాలో […]

అమ్మమ్మ – 9

రచన: గిరిజ పీసపాటి తెనాలి తాతయ్య నాగ చదువుకోవడం కోసం చందమామ, బాలమిత్ర పుస్తకాలు ప్రతినెలా తెప్పించేవారు. నాగ స్కూల్ నుండి వచ్చేలోపు చిన్న బావ వాటిని నాగకు అందకుండా దాచేసేవాడు. అతను రెండు పుస్తకాలు పూర్తిగా చదివిన తరువాత కానీ తిరిగి నాగకు ఇచ్చేవాడు కాదు. ఈలోపు మళ్ళీ నెల తిరిగి వచ్చేసేది. దానితో కొత్తగా వచ్చిన వెంటనే పుస్తకాలు చదివే అలవాటున్న నాగ ఆ పుస్తకాల కోసం ఏడ్చేది. వెంటనే పెద్ద బావ నాగను […]