June 24, 2024

తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను

రచన: రామా చంద్రమౌళి

నడచి వెళ్ళిన ప్రతిసారీ పాదముద్రలేమీ మిగవు
నడచి వచ్చిన దారికూడా జ్ఞాపకముండదు
చూపున్నీ లక్ష్యాలపైనే ఉన్నపుడు
ఇక వ్యూహాలే పన్నాగాలౌతాయి
పాచికలు విసుర్తున్న ప్రతిసారీ
అటు ఎదురుగా నీ ప్రత్యర్థీ.. ఇటు నీకు నువ్వే కనిపిస్తావు
ఐతే.. కొన్ని విజయాలను అనుభవిస్తున్న దీర్ఘానుభవం తర్వాత
కొన్ని ఓటములు విజయాలకన్నా మిన్నవని తోస్తుంది
వెలుతురుకంటే చీకటి కూడా చాలా ముఖ్యమని
నిద్రపోవాలనుకుంటున్నపుడు అర్థమౌతుంది
‘ లైట్లు ’ ఆర్పేయడం ఒక్కోసారి అనివార్య క్రియ-

మనుషులంకదా.. అప్పుడప్పుడు
ఇష్టం లేకున్నా కొన్ని లోపలి తలుపులు తెరుచుకుంటాయి
కిటికీలు కూడా రెక్కలను విప్పుకుని
ఒక పాత గాలి.. పాత జ్ఞాపకాలు.. పాత పురాపరిమళం
చటుక్కున ఒక ‘ శంకరి ’ గాడు జ్ఞాపకమొస్తాడు
ఆరవ క్లాస్‌ నుండి.. ఎనిమిది వరకు సహపాఠి
బడి దొంగ.. గాజు పలకపై నూనె బిందువు
చివరికి ‘ హమాలి ’ గా మారాడు
చూచినప్పుడల్లా.. పెనంపై నీళ్ళని చిలకరించినట్టు
వర్షంలో తడిచిన నేలపై ఇనుపకడ్డీ దిగుతున్నట్టు
వాడు కనబడ్డప్పుడల్లా
మధ్య ఒక ఇనుప గోడ కాని .. కనిపించడమే లేదీ మధ్య
మనుషులు ఉండీ ఉండీ పరదాల వెనక్కు మాయమైపోతారు
జ్ఞాపకాల నుండి కూడా
సుభద్రేమైపోయింది .. రమణేమైపోయాడు .. రేష్మా ఎక్కడుందో
ఏ ఒక్క వ్యక్తైనా
భౌగోళిక భౌతిక కేంద్రమై
మన ప్రపంచంలో మనం ఒక రాలుతున్న నక్షత్రంలా మిగిలి
శిఖరంపై నుండి సానువుల్లోకి
జారిపోవడాన్నే ‘ జీవితం ’ అని నిర్వచించుకుంటున్న వేళ
తిర్యక్‌ రేఖవలె.. సమాంతర రేఖవలె
అప్పుడప్పుడు కలిసి.. కరచానం చేసి కనుమరుగైన వాళ్ళు
చిన్ననాటి రహీం ,
ఉద్యోగంలో చేరిననాడు ‘ జాయినింగ్‌ రిపోర్ట్‌ ’ రాసిచ్చిన గంగాధర్‌,
ఎదురింట్లో ప్రతి రాత్రీ కవ్వించిన కమల
ఆరి వెలిగి.. వెలిగి ఆరి.. యిక మెగుతూనే ఉండిన కమల బాల్కనీ లైట్‌
ఏరీ వీళ్లందరు.. ఏమయ్యారు –

రైలు ముందుకు దూసుకుపోతోందీ అంటే
ప్రపంచం వెనక్కి జరిగిపోతోందని అర్థం కాదుగదా
జీవితాలే సాపేక్షాలైనప్పుడు
అభౌతిక స్నేహాలు.. దుఃఖాలు.. అనునయింపు.. ప్రేమలు.. ఆత్మీయతలు
భ్రాంతులు
ఇవన్నీ మనుషులు మనుషులుగా
కలుస్తూ విడిపోతూ.. విడిపోతూ కూడా అప్పుడప్పుడు కలుస్తూ
పరమపద సోపానంపై తడబడ్తున్నపుడు
కింద
పాము చేత మింగబడ్తూ
నిచ్చెనపై మిడుకుతూ.. జారి పడి.. పడి లేస్తూ.. లేస్తూ పడ్తూన్న
అందరినీ భుజాలపై చేతులేసి .. కౌగలించుకుని
ఒక నువ్వు.. మరొక నువ్వు.. ఇంకొక నువ్వును
మరొక నేను గుండెకు హత్తుకుంటూంటే
మనుషులు అనేక ఆకాశాలౌతారు విస్తరిస్తూ.. కదా –

Translated by Purushothama Rao Ravela

You and the other Me

Every time we walk ahead
no footprints will stay there for longer duration.
Even the path we tread, hitherto, will also
not be treasured preciously in our memory planks.
When all our looks get tagged to the destined goals,
all our strategies turn out as conspiring plots.
When we dole out dices, each time,
the opponent always sits facing yoy
and you continue to be visible
staying along on this side, apparently.
But after enjoying the stream of successes once for all,
adoring for longer stints in minds and souls
surprisingly some defeats stand aloft
in higher plane than the earlier positions,
we have continuously acclaimed earlier.
Even darkness, at times, appears more attached
and emotionally get associated with us , than
the earlier glare of astounding brightness.

This stand is clearly evident,
when we decided to depart from the present scenario.
When we go to sleep,
we can’t but switch off the lights, burning till then.
Of course we are all human beings in letter and spirit.
Even if we don’t desire to be so,
the inner doors get opened automatically.
The windows span out their wings.
One old breeze and very old memory and the scents of the rarest ancient anecdote flash on my mind.

My friend , Sankar comes up sharply on memory plank.
He was my class mate till eighth class.
I feel as if some oil marks were spilled on his glassy plank of life.
When we come across at any point, we feel,
as if there was an iron wall
emotionally raised between us.
But he is not to be seen frequently, these days.
He was an absconding guy in the school hours since the beginning.
At long last, he settled as a cooli.
He became a pinching memory, of course ,
in the physical world where we live in presently.
What happened to Subhadra, Ramana, Where is Reshma.,
Where are all these bosom friends.

Any one, in this materialistic world, where
we also continue to breathe in,
we drop down in this materialistic world,
like stars jumping down from the sky
And, preferably, the life is defined then as
the slip down of humans to the deep down
the valleys from very higher planes.
Like oblique lines and also like parallel lines,
we shake hands , and surprisingly disappear with no foreseen signs.
In childhood, friend Rahim, who took
the help of Gangadharam, another friend,
Ravali who was residing in our opposite house,
putting on and off the lights in the nights indicating her presence.

Where have they all gone ?
When we say the train is catching up speed
to move fast so ahead of us,
it appears as if the whole world is moving backwards.
When all our lives are on relative lines
The friendship bonds, sorrows, and closely knit relations,
and soul stirring experiences,
all these things conglomerate as if they are just human beings
and also depart and very rarely join to gether.
They seem to be fluttering on the map of snakes and ladders.
They will be eaten away by snakes and some times
dragged down from the ladder and
of course may raise high once again.
we place our hands on each others’ shoulders
and hug each other in extreme affection and love.
Once upon a time one you and the other I,
we both hug each other intently .
When will this sky start to expand widely
in the no human world?
This is a big question, standing lorge before us.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *