రచన: మణి

కాలమా ! ఓ గమనమా!!

అలసట, ఆకలి ఎరుగని, వార్దక్యం లేని ఓ సొగసరి,
వివిధ ప్రమాణాలు ఉన్నా, నీ ప్రయాణంలో ఏ మార్పూ ఉండదు.

విశ్వ విజేతలను అలఓకగా ఓడించగల ధీశాలి,
తారతమ్యభేదాలు, భేషజాలు తెలియని భాగ్యశీలి.

ప్రవాహ ఝరీ వేగాన్ని ఆవలీలగా జేయించగల నీవు,
కాంతి వేగాన్ని సైతం క్షణిక లో కమ్మేయ్యగలవు

జననానికి నీవు, మరణానికి నీవు, జీవన స్రవంతికి నీవు
చరిత్రకు సాక్షి నీవు, భవిష్యత్తుకు భరోసా నీవు

నీ విలువెరిగి నిన్ను ఆచరిస్తే అందలం ఎక్కిస్తావు ! ఆదమరిస్తే ఇక అధోగతే కదా!!

By Editor

One thought on “కాలంపై నా కలం.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *