April 26, 2024

అత్రి మహర్షి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

అత్రి ఒక మహా ఋషి.అత్రి సప్తర్షి మండలంలో ఏడవ ఋషిపుంగవుడు అంటే దైవిక వృత్తాంతం ప్రకారం సప్త ఋషులలో చివరివాడు, నాలుక నుండి ఉద్భవించినట్టుగా నమ్ముతారు. వైఖానస సంప్రదాయాలను అనుసరించి మహామునులను నలుగురుగా నిర్ధారించారు. వారు అత్రి, భృగువు, మరీచి, కష్యపుడు.అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు అంటే బ్రహ్మ దేవుని మనస్సు లోనుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు అత్రి మహమునితో తనకు సృష్టి కార్యములో సాయపడటానికి పుట్టించాను అని చెపుతాడు అత్రి మహర్షి ఒక మంచి అనుకూల ప్రదేశాన్నిఎన్నుకొని తపస్సు ప్రారంభిస్తాడు.ఈయన చేస్తున్న ఘోర తపస్సు కు బయటకు వచ్చిన గొప్ప తేజస్సు భూమి, ఆకాశము అన్ని వైపులా వ్యాపిస్తే భూమి, ఆకాశము ఈ తేజస్సును భరించలేకపోవటం వల్ల ఆ తేజస్సు సముద్రములో పడిపోతుంది ఈ విషయము తెలుసుకున్న బ్రహ్మదేవుడు అత్రి మహర్షికి పెళ్లి అయినాక ఆ తేజస్సులో కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా జన్మిస్తాడని , క్షీరసాగర మధనంలో మిగిలిన అంశం వచ్చి చంద్రుని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు.
కొంతకాలము తరువాత అత్రి మహర్షి, కర్దముడు, దేవహుతి దంపతుల తొమ్మిది కూతుళ్లతో ఒకరైన అనసూయ దేవిని వివాహమాడతాడు అత్రి భార్య అనసూయ ఏడుగురు పతివ్రతలలో ఒకరిగా పరిగణించ బడుతుంది. ఒకసారి త్రిమూర్తులు అనసూయాదేవి ప్రాతివత్యన్ని పరీక్షంచటానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు అప్పుడు అత్రి మహర్షి వారికి ఆతిధ్యము ఇస్తాడు కానీ త్రిమూర్తులు అనసూయాదేవి నగ్నముగా వారికి వడ్డించాలని షరతు విధిస్తారు అతిధులుగా వచ్చిన త్రిమూర్తులు స్నానము చేసి భోజనానికి కూర్చున్నప్పుడు అనసూయ వారిపై మంత్ర జలాన్ని చల్లి వారిని శిశువులుగా మార్చి నగ్నముగా వడ్డించి ఆ తరువాత వారిపై మంత్రజలాన్ని చల్లి మామూలుగాచేసి భోజనము తినమని చెపుతుంది భోజనము చేసిన వెంటనే వారిని పసిపాపాలుగామార్చి ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చుతుంది తమభర్తలను వెతుక్కుంటూ త్రిమూర్తుల భార్యలు అనసూయ దగ్గరకు వచ్చి వారి పతులను ఇమ్మని అడుగుతారు
త్రిమూర్తులు అనసూయ ప్రాతివత్యనికి ముగ్దులై వారి అంశాలతో కుమారులు జన్మిస్తారని వరము ఇస్తారు వారే దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రడు అనే ముగ్గురు కుమారులు ఒకసారి కౌశికుని భార్య సూర్యుడు ఉదయిస్తే తన భర్త మరణిస్తాడు అని తెలిసి సూర్యోదయాన్ని ఆపుతుంది ఆ సందర్భములో అనసూయ సూర్యోదయాన్ని జరిగేటట్లు చేసి కౌశికుని ప్రాణాలను కూడా కాపాడుతుంది. సంతానము కలిగినాక అత్రి మహర్షి ఆనసూయతో, “మనకు మంచి సంతానము కలిగారు ఇక నేను తపస్సుచేసుకోవటానికి వెళతాను నీవు నీ పిల్లలతో ఉండేటట్లయితే ఉండు లేదా నాతొ అడవులకు రా దలచుకుంటే రా” అని అంటాడు అనసూయ ,”నాకు మీ తోటిదే లోకము నేను మీతో వస్తాను కానీ పిల్లలు ఇంకా చిన్నవారు కాబట్టి వారు కొంత పెద్ద ఆయ్యేదాకా ఉండి వెళదాము ఈ లోపు వారి పెంపకానికి ధనము అవసరము కాబట్టి పృధు మహారాజు దగ్గరకు వెళ్లి ధనము కోరండి”అని చెపుతుంది.ఆ సమయములోనే పృధు చక్రవర్తి అశ్వ మేధ యాగము చేస్తున్నాడు ఆ చక్రవర్తి యాగాశ్వానికి రక్షణగా తన కొడుకుతో పాటు వెళ్ళమని అత్రి మహర్షిని అడుగుతాడు. మహర్షి అంగీకరించి యాగాశ్వము వెంట వెళతాడు పృధు చక్రవర్తి వైభవానికి ఈర్ష్య చెందిన ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేస్తాడు దివ్య దృష్టితో విషయము తెలుసుకున్నా మహర్షి ఆ విషయాన్ని చక్రవర్తి కుమారుడికి చెప్పగా ఆతను ఇంద్రుడిని జయించి యాగాశ్వాన్ని తీసుకువస్తాడు అశ్వమేధయాగాన్ని పూర్త్తిచేసిన చక్రవర్తి అత్రి మహర్షి అపారమైన సంపదలను ఇస్తాడు మహర్షి వాటిని తన కుమారులకు అప్పగించి అనసూయతో తపస్సు చేసుకోవటం కోసము అడవులకు వెళతాడు.దేవ దానవులకు యుద్ధము జరుగుతున్నప్పుడు రాహువు ప్రయోగించిన అస్త్రాల వల్ల సూర్య చంద్రులు కాంతి విహీనము అవుతారు అప్పుడు అత్రి మహర్షి దేవతల పక్షాన నిలబడి తన చూపులతోనే దానవులను సంహరిస్తాడు.
హిందూ సంప్రదాయంలో సప్తర్షి నక్షత్ర మండలం (ఏడు గొప్ప నక్షత్రాల కూటమి)లో అత్రి ఒక నక్షత్రం.ఈ ఋషి గురించి ఎక్కువగా ౠగ్వేదం గ్రంథంలో ప్రస్తావించబడింది.అత్రి గురించి రామాయణం, మాహాభారతాల్లో కూడా వివరాలు లభిస్తూన్నాయి అత్రి మాహముని గౌరవార్థం ఋగ్వేదంలోని ఐదవ మండలాన్ని అత్రి మండలం అని పిలుస్తారు. అందులోని ఎనభై ఏడు శ్లోకాలు ఆయనకు, ఆయన వారసులకు ఆపాదించబడ్డాయి ఆయన అగ్ని, ఇంద్రుడు, హిందూ మతం యొక్క ఇతర వేద దేవతలకు అనేక వేదశ్లోకాలను రచించారు.అత్రి సంహితలు, అత్రి స్మృతులు మొదలగు గ్రంథములను కూడా రచించారు. వీటిలో దానములు, ఆచారములు, గురు ప్రశంస, చాతుర్వర్ణ ధర్మములు,జపమాల పవిత్రత, బ్రాహ్మణులకు ఉండవలసిన సుగుణములు, యమ నియమములు, పుత్రులు, దత్త పుత్రులు, ప్రాయశ్చిత్తములు, అశౌచములు మొదలగు ఎన్నో విషయములు గురించి వ్రాసారు. అత్రి గురించి ప్రస్తావన వివిధ గ్రంథములలో కనబడుతుంది అతను వివిధ యుగాలతో సంబంధం కలిగి ఉన్నాడు, రామాయణ సమయంలో త్రేతా యుగంలో గుర్తించదగినది, అతను, అనసూయ రాముడికి, అతని భార్య సీతకు సలహా ఇచ్చినప్పుడు. ఈ జంట గంగా నదిని భూమిలోకి తీసుకురావడానికి కూడా కారణమని చెప్పవచ్చు, వీటి గురించి శివ పురాణంలో కనుగొనబడింది ఋగ్వేదం యొక్క అత్రి శ్లోకాలు శ్రావ్యమైనవి. ఆధ్యాత్మిక ఆలోచనలను పెంపొందించుచూ సంస్కృత భాష యొక్క వశ్యతను పద నిర్మాణము లను తెలియచేయునవిగా ఉన్నాయి.

1 thought on “అత్రి మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *