April 27, 2024

ప్రశ్నలు స్వీయశిక్షలే …

రచన:చందలూరి నారాయణరావు

ప్రశ్నలు
మనసు లోతుగా మారుమ్రోగే
అర్ధంకాని అగాధాలే..

అనుభవాలై
పెనవేసుకొని మెలిపెట్టే
మొనదేలిన వేదనాయుధాలే…

ఎన్నాళ్ళుగా మోస్తున్నా
కుంగదీస్తున్నా
భారం తగ్గని చేదు నిజాలే….

వయసు కరిగిపారే
భావసంద్రంతో
అలల కలల్లో స్రవించే తీపిబాధలే…

మనసు మెరుపులలో తేలియాడే
తరుగులేని ఊహాలే
తరిగిపోని ఆశలబాకులే.

ప్రశ్నలు జీవితమంతా
విధించుకొనే పరీక్షలే.
స్వీయశిక్షలే.
* * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *