April 26, 2024

ఓ చల్లగాలి

రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి

నీవు ఊపిరివి
సుగంధాల పరిమళం పంచాలన్నా
మట్టిమధువుతో గుండె తట్టి లేపాలన్నా
ఆనందాల రెక్కలు కట్టి ఎగిరించాలన్నా
నీకు సాధ్యమే
నీవు క్షణంలో
వాలతావు ఎక్కడైనా
నీవు సెకనులో
దూరతావు ఏగుండెలోనైనా
నీకు పరిచయంలేని
మంచి మనసంటూ లేదు ఈ అవనిపై
నీకు తెలియని
గొప్ప హృదయమంటూ లేదు ఈ భువిపై
నీవు చూడని
అందమంటూ లేదు ఈ నేలపై
అందుకే నిను ప్రార్దిస్తున్నా
ఓ నా చల్లగాలి
నాకు తగిన కన్యకను నా దరిచేర్చవా
నూరేళ్ళ జీవితానికి తోడుగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *