రచన: శశిబాల
ఎచ్చన్ని సూరీడు తుమ్మెదా సల్లంగ వచ్చాడు తుమ్మెదా
పొద్దు పోడిసేనంటు తుమ్మెదా ..మరి పల్లె లేసేసింది తుమ్మెదా
కొప్పులో పూలెట్టి కొత్త పావడ గట్టి మామకై వచ్చాను తుమ్మెదా
మామేమో లెగడాయే పక్కేమో దిగడాయే ఊరంతా నవ్వేరు తుమ్మెదా
కొండల్లో కోనల్లు ఎక్కి సూసొద్దామంటే నిద్దర లేవడు తుమ్మెదా
వులుకులికి సూస్తాడు తుమ్మెదా
పంట సేనుల్లోన వరికోత కొస్తేను సాటుకి లాగిండు తుమ్మెదా
కొంటె కోణంగి ఐనాడు తుమ్మెదా.. నేను సిగ్గుతో సితికెను తుమ్మెదా
గోదారి సందట్లో ఆ గూటి పడవల్లో వూరు మర్సిపోయి తుమ్మెదా
మరి వూసులాడే మమ్మ తుమ్మెదా
నెత్తిన కూడెట్టుకొని ,చంకల నీళ్ళట్టుకొని మామకై వచ్చాను తుమ్మెదా
మరి మనసు లాగేసిండు తుమ్మెదా
సక్కనోడూ మావ సెంత సేరాడంటే సిగ్గుల్లు మొలిసేను తుమ్మెదా
మరి లగ్గాలే కరువాయే తుమ్మెదా ….మంచి రోజుల్లేవంటమ్మ తుమ్మెదా