October 16, 2021

వెన్నెల జాము

రచన: డా. బాలాజీ దీక్షితులు పి వి

వెన్నముద్ద
తినిపిస్తుంది కన్నె చందమామ

కన్నుల పూసిన కలువలు
గండె గూటికి చేరుస్తుంది వెన్నెల హంస

మధుర మధురామృత
మధువును త్రాగిస్తుంది వలపుల పందేరం

పరిమళ సుధాసుగంధంతో
అప్సర మధనం చేస్తుంది చిరు వయ్యారం

ప్రేమ నెమిలిక నెయ్యంతో
నిలువెళ్ళా పూస్తుంది వన్నెల సోయగం

పదునైన పైయెదల పరువపు
శూలాలతో దాడి చేస్తుంది కన్నె తనం

స్వప్నం నుండి లేవగానే
వెన్నెల జాము
మల్లెల వర్షంలో
భావుక తపస్సుచేసే ఋషిలా వుంది మనసు

ఊహల నిజం
ఎప్పుడు చేస్తుందో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *