June 25, 2024

భుజంగ ప్రయాత శారదాష్టకం. ఆదిశంకరాచార్యులు.

తెలుగు పాట భావము: పంతుల ధనలక్ష్మి.

భవాంభోజ నేత్రాజ సంపూజ్య మానా
లసన్మంద హాసా ప్రభావక్త్రచిహ్నా
చలచ్చంచలాచారు తాటంకకర్ణాం
భజే శారదాంబా అజస్రం మదంబామ్!!

1.
బ్రహ్మ విష్ణు శివుల పూజించె దేవీ
ముఖము పై చిరునవ్వు కాంతి గలదేవీ
అందముగ మెరిసేటి కర్ణాలంకృతమే
ఆ శారదాంబ నే కొలుతు నే నెపుడూ!

శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు చేత పూజింపబడుచుంటివి. ముఖముపై
చిరునవ్వు కాంతి కలదానివి. అందముగ మెరుపునలె కదులునట్టి
కర్ణాభరణములు కలదానివి.అటువంటి
శారదా మాతనే ఎల్లపుడూ కొలిచెదను.
అని శంకరాచార్యులు పలికిరి.

2.
సుసీమంత వేణీం ద్రుశానిర్జితైణీం!!
రమత్కీర వాణీం నమధ్వజ్ర పాణీం!!
సుధా మంధరాస్యాం ముదాచింత్యవేణీం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

మంచిపాపట దీసి జడనువేసినది , లేడి కనులనుమించు కనులందమేకలది, ఇంద్రుడే కొలిచినది చిలుకపలుకులు గలది, ముఖము జూచినచాలు అమృతంపుమయము. అనేక రూపాల ధ్యానించతగినది. ఆ శారదాంబనే కొలుతు నేనెపుడూ!

3
కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం!!
కలాభిర్వినిద్రాం కలాపైస్సుభద్రాం!!
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

చూపులందూ దయను, కరముల జ్ఞాన ముద్రనూ, చతుషష్ఠి కళలందు ఆరితేరినదీ, మంగళకరమైన అలంకరణ కలదీ, పురములనెపుడూ రక్ష సేయునది, ముందుగానే నీకు శుభములిచ్చునదీ ఆ శారదాంబనే కొలుతు నేనెపుడూ!

4.
కురంగే, తురంగే, మృగేంద్రే, ఖగేంద్రే,
మరాలే, మదేభే, మహోక్షేధిరూఢాం!!
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం!!
భజే శారదాంబా మజస్రం మదంబాం!!

లేడియూ గుర్రము సింహమేనుగులను, హంసను ,గరుడుని, వృషభమ్మునెక్కి, సామవేదానికి స్వరూపమై నీవు
భాసించు అమ్మనే కొలుతు నేనెపుడూ..ఆ శారదాంబనే కొలుతు నేనెపుడూ!

5.
లలామాంక ఫాలాం లసద్గాన లోలాం!!
స్వభక్తైకపాలాం యశశ్రీకపోలాం!!
కరే త్వక్షమాలాం కనత్ప్రత్న లోలాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

నుదుటనూ తిలకమ్ము ధరియించు దేవీ, గానమందును మిగుల ఇష్టమగు దేవీ, భక్తులను రక్షించు లక్ష్యమే కలదీ, కీర్తి శోభను కలుగు కపోలమ్ము కలదీ, కరమున నక్షమాల ధరియించు దేవీ, మెరిసేటి హారముల ధరియించు దేవీ.. ఆ శారదాంబనే కొలుతు నేనెపుడూ/ఆ శారదాంబనే కొలుతు నేనెపుడూ!!

6.
సుశాంతాం సుదేహాం ద్రుగంతే కచాంతాం!!
లస త్సల్లతాంగీ మనంతా మచింత్యాం!!
స్మరే త్తాపసైః సంగ పూర్వ స్థితాం తాం!!
భజే శారదాంబా మజస్రం మదంబాం!!

శాంతమైనట్టి స్వభావమ్ము కలదీ, అందమైనట్టి దేహమ్ము కలదీ, మెరుపు తీగంటి తనువునే కలదీ, ఊహించుటకునూ శక్యమ్ము కానిదీ, అనంతమ్మేనీవు అందరికి తల్లీ, సృష్టికన్నా నీవు పూర్వమే యుంటివి ఋషివాక్కు చేతనే తెలియబడు చున్నదీ! ఆ శారదాంబనే కొలుతు నేనెపుడూ!!

7.
జ్వలత్కాంతి వహ్నీం జగన్మోహనాంగీం!!
భజన్మానసాంభోజ సుభ్రాంత భృంగీం!!
నిజస్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

అగ్ని జ్వాలనుబోలు కాంతియును కలదీ, జగత్తునే మైమరచు తనువునే గలదీ, భక్త మనోపద్మముల తిరుగు తుమ్మెదవీ, తనగూర్చి పాటలు నాట్యములయందే, ఆసక్తి చూపేటి అమ్మ శారదనే, ఆ శారదాంబనే కొలుతు నేనెపుడూ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *