December 6, 2023

మాలిక పత్రిక నవంబర్ 2021 సంచికకు స్వాగతం

పాఠక మిత్రులు, రచయితలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఇంటింటా ఆనందపు దీపాలు సదా వెలుగుతూనే ఉండాలని మనసారా కోరుకుంటూ నవంబర్ సంచికకు సాదర ఆహ్వానం… మాలిక పత్రికలో ఇటీవల ప్రారంభించిన కొత్త సీరియల్స్, వ్యాస పరంపరలు, కథలు మిమ్మల్ని అలరిస్తున్నాయని అనుకుంటున్నాము…   ముందు ముందు మరిన్ని విశేషాలు మీకోసం అందించనున్నాము.  రమా శాండిల్యగారు ఇటీవలే కాశీ క్షేత్రం గురించిన సమగ్ర సమాచారంతో ముక్తి క్షేత్రం పేరిట కొత్త పుస్తకాన్ని అందించారు. రమగారు వచ్చే నెల నుండి అష్టాదశ […]

వెంటాడే కథలు – 2 – జాలిగుండెకు రిపేరు!

రచన: చంద్రప్రతాప్ కంతేటి     నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ […]

ధృతి – 6

రచన: మణి గోవిందరాజుల “అదిగో బామ్మా అదే ఏఎంబీ మాల్” కార్ బొటానికల్ గార్డెన్ సిగ్నల్ దగ్గరికి రాగానే ఎక్జైటింగ్ గా చూపించారు పిల్లలు. బయటినుండి చాలా పెద్దగా ఉండి ఠీవిగా కనపడుతున్నది ఆ మాల్. “అమ్మో! ఎంత పెద్దగా ఉన్నదో” ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది బామ్మ. “మరేమనుకున్నావ్? అందుకే అక్కడికి వెళ్దామన్నది” ఉత్సాహంగా అన్నారు ఆర్తి, కార్తి. కార్ పార్కింగ్ దగ్గర ఆగగానే బయటికి ఉరికారు ఆర్తి, కార్తి. వాళ్ళకు చాలా ఆనందంగా ఉన్నది. ఎన్ని […]

సాఫ్ట్‌వేర్ కథలు: 2 – పచ్చడి

రచన: రవీంద్ర కంభంపాటి ఉదయం ఎనిమిదిన్నర కావొస్తూంది.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా అటూ ఇటూగా అదే టైముకి వచ్చే ఆ ఐటీ కంపెనీ బస్సు , ఆ రోజు కూడా టైముకే ఆఫీసు చేరుకుంది. అంత సేపూ బస్సులో కూచుని ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉన్న ఆ కంపెనీ ఉద్యోగులు, బస్సు దిగి, మళ్ళీ ఎవరి ఫోన్ల వేపు వాళ్ళు చూసుకుంటూ ఆఫీసు వేపు నడవడం మొదలెట్టేరు. ఆఫీసు ముందున్న విశాలమైన లాన్ లో […]

మోదుగపూలు – 4

రచన: సంధ్య యల్లాప్రగడ ఉదయం ఏడుగంటలకు లేచి బయటకొచ్చిన వివేక్‌కు అంతా హడావిడిగా కనిపించింది. ప్రక్క రూములో ఉన్న సాగర్ సారు ఉన్నాడేమో చూస్తే అతను రెడి అయిపోయి ఉన్నాడప్పటికే. “శుభోదయం సారు” పలకరించాడు వివేక్‌. “లేచారా! మీకు చెప్పలేదు కదా ఇక్కడ ఉదయం ఐదు నుంచి ఆరు వరకు యోగా ఉంటుంది. పిల్లలందరూ చేస్తారు. కొందరు టీచర్లు కూడా చేస్తారు. మేము ఉదయమే వాకింగ్‌కి వెడతాం. ఈ రోజు వెళ్ళి వచ్చేశాం కూడా” చెప్పాడతను. “అవునా. […]

తాత్పర్యం – 5 – అతడు

రచన: రామా చంద్రమౌళి మనిషి శరీరం ఒక బయో వాచ్. ఇరవై నాలుగు గంటల సమయానికి సెట్ చేయబడి. . ట్యూన్ చేయబడి. . అసంకల్పిత నియంత్రణతో దానంతటదే నడిచే ఒక జీవవ్యవస్థ. ఈ రోజు ఈ క్షణం ఏమి చేస్తావో. . రేపు మళ్ళీ అదే సమయానికి అదే పనిని చేయాలనే అదృశ్య కుతూహలం. . అదే సమయానికి నిద్ర. . అదే సమయానికి ఆకలి. . అదే సమయానికి సెక్స్. . అదే సమయానికి […]

తామసి – 13

రచన: మాలతి దేచిరాజు CYBERABAD COMMISSIONER OFFICE ముందు ఆగింది ఏ.సి.పి. రుద్రాక్ష్ కార్. కారులో నుంచి దిగగానే, “గుడ్ మార్నింగ్ సార్!” సెల్యూట్ చేసాడు..పీ.సి. తనూ చేసాడు. లోపలికి నడుస్తుండగా ఎదురయ్యాడు సి..ఐ..సాగర్. “ఇంతకీ ఆ శవం ఎవరిదో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా?” అడిగాడు రుద్రాక్ష్ “ఇప్పుడే ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి సార్… మీ టేబుల్ మీద పెట్టాను.” అనగానే తన క్యాబిన్ లోకి తలుపు తోసుకుని వెళ్ళాడు రుద్రాక్ష్. టేబుల్ పైన ఉన్న ఫైల్ […]

చంద్రోదయం – 21

రచన: మన్నెం శారద ఎప్పట్లా చిరునవ్వుతో ఎదురు వెళ్లలేకపోయేను. అది భయం కాదు. మనసులో యేదో స్పందన కలుగుతోంది. ఏవిటది? ఆలోచనలకందని మధురస్వప్యం ఏదో నా కళ్లముందు కదులుతోంది. పనిపిల్లతో కాఫీ పంపించేను. “మీ అమ్మగారు ఘోషా చేస్తున్నారా?” అని అతను అడగటం నాకు విన్పిస్తూనే వుంది. అయినా అప్పటికి నేను బయటికి వెళ్లలేదు. “మైడియర్ స్వాతి మేడంగారూ. మీరు ఆఫీసుకు ఎందుకు రాలేదో, ఏమైందో కనుక్కుందామని వచ్చేను. కారణం చెబితే ఈ దీనుడు సెలవు తీసుకుంటాడూ” […]

భుజంగ ప్రయాత శారదాష్టకం. ఆదిశంకరాచార్యులు.

తెలుగు పాట భావము: పంతుల ధనలక్ష్మి. భవాంభోజ నేత్రాజ సంపూజ్య మానా లసన్మంద హాసా ప్రభావక్త్రచిహ్నా చలచ్చంచలాచారు తాటంకకర్ణాం భజే శారదాంబా అజస్రం మదంబామ్!! 1. బ్రహ్మ విష్ణు శివుల పూజించె దేవీ ముఖము పై చిరునవ్వు కాంతి గలదేవీ అందముగ మెరిసేటి కర్ణాలంకృతమే ఆ శారదాంబ నే కొలుతు నే నెపుడూ! శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు చేత పూజింపబడుచుంటివి. ముఖముపై చిరునవ్వు కాంతి కలదానివి. అందముగ మెరుపునలె కదులునట్టి కర్ణాభరణములు కలదానివి.అటువంటి శారదా మాతనే […]

మారిన జీవితం

రచన: ప్రభావతి పూసపాటి “ఒక్కసారి వీలు చూసుకొని రా రామం నీతో చాలా విషయాలు మాట్లాడాలి, ఫోన్ లో చెప్పలేను, నువ్వు సృజన రెండు రోజులు ఉండేలా రండి, “ఫోన్ లో అక్క గొంతు భారంగా వినపడుతోంది, “ఏమైంది అక్క? ఏదైనా కంగారు పడే విషయమా” ఆత్రంగా అడిగాను, ” కాదు లేరా, కొంచెం నీతో మాట్లాడితేగాని మనసుకి ప్రశాంతత కలగదు అందుకే” , గొంతులో జీర వినపడింది, “అలాగే అలాగే అక్క, రాత్రికి బయలుదేరుతాను, నువ్వు […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

November 2021
M T W T F S S
« Oct   Dec »
1234567
891011121314
15161718192021
22232425262728
2930