March 19, 2024

తమాషా అనుభవం

 

రచన: రాజ్యలక్ష్మి బి

 

ఉదయం 8:00 అయింది మాలతి జుట్టు ఆరబెట్టుకుంటున్నది.  మాలతి మరింత అందంగా వయ్యారంగా కూర్చుని పాటలు వింటూ తనలో తానే నవ్వుకున్నది. ఆ నవ్వు లో తన పతి దేవుడు రఘు దరహాసం కలిసింది తెల్లవారుజామున ఆఫీసుకు పనిమీద క్యాంపు వెళ్లిన రఘు రాత్రికి రానని తోచకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమన్నాడు. మాలతికి గత సంవత్సరం లోకి ఆలోచనలు వెళ్లిపోయాయి తను డిగ్రీ ఫైనల్ వుండగా రఘుతో పెళ్లి జరిగింది పెళ్లయిన మూడు నెలలకే ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా యీ వూరు వచ్చారు.  అనుబంధాలు బంధాలు నిత్య వసంతాలు కాపురం ఆనందంగా సాగిపోతున్నది.  రఘు మాలతి ని ప్రేమగా చూసుకుంటాడు. మొదట్లో రఘు క్యాంపు కు వెళ్తుంటే చాలా బాధగా ఉండేది కానీ క్రమంగా అలవాటయింది. పక్కింటి రాగిణి ఉష ఒకే వయసు వాళ్లు,  సరదాగా గడిచిపోతున్నది. అందరివి కొత్త కాపురాలు అవ్వడం వల్ల ఇంకా పిల్లలు లేకపోవడం వల్ల ముగ్గురు సరదాగా హుషారుగా ఉన్నారు.  గుమ్మం దగ్గర పిలుపు వినబడే సరికి మాలతి తలతిప్పి చూసింది. అందమైన ఒక యువతి గులాబి జార్జెట్ చీర లో మెరిసిపోతూ వయ్యారంగా నవ్వుతూ ఉన్నది. చూడగానే ఆకర్షించే అందమైన యువతి రూపం. మాలతికి నవ్వుతూ”లోపలికి రండి”అంటూ నవ్వింది.  ఆమె వచ్చి కుర్చీలో కూర్చుంది.  రెండు నిమిషాల పాటు ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఆ యువతి మాలతి కూర్చున్న గదిని పరిశీలనగా చూసింది ఆధునికత నాగరికత సాంప్రదాయం అలంకరణ ఆమెకు నచ్చింది. కళ్ళతోనే అభినందనలు తెలిపింది, మాలతి కూడా చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపింది. ఇద్దరూ కళ్ళతోనే పలకరించుకున్నారు.

“ఏం పని మీద వచ్చారండీ” అడిగింది మాలతి.

“నా పేరు నీరజ, మా వారికి యీ వూరు ట్రాన్స్ఫర్ అయ్యిందండీ, నిన్న రాత్రే యిక్కడికి వచ్చి హోటల్ లో దిగాం.  మాకు తెలిసినవాళ్లు మీ వీధిలో ఒక పోర్షన్ రెంటుకు వుందని తెలిసింది, ‘ టు లెట్ ‘ బోర్డు చూసాను అన్నది ఆమె.

మాలతికి యెక్కడలేని వుత్సాహమొచ్చింది.  రెండో పోర్షన్ వాళ్లు ఖాళీ చేసి పదిహేను రోజులయ్యింది.  ఇంటి ఓనరు యిదె వూళ్లో దూరంగా యింకో స్వంత యింట్లో వుంటారు.  ఎవరైనా యిల్లు అద్దెకు కావాలని వస్తే పోర్షన్ చూపించి అద్దెకు కుదర్చమని రఘుకు చెప్పారు.  మాలతి కూడా ఆ పోర్షన్ లోకి యెవరైనా వస్తే బాగుంటుందని అనుకుంటున్నది.  ఇప్పుడు నీరజను చూసేటప్పటికి ఒకటే సంతోషమేసింది.  అయినా సంతోషాన్ని బయటకు కనపడనివ్వకుండా,

“అవునండీ మీకు కావాలా?” అన్నది మాలతి.

“అందుకే కదండీ నేను వచ్చింది! యిల్లు చూపిస్తారా ?” నీరజ నవ్వ్వుతూ మాలతిని చూసింది.

మాలతి నీరజకు పోర్షన్ చూపించింది.  రెండు గదులు, వంటిల్లు, వెనకాల కాస్త ఖాళీ స్థలం.  అన్ని సౌకర్యాలూ వున్నాయి.  నీరజకు నచ్చింది.  అద్దెంతని, అడ్వాన్స్ ఎంతివ్వాలని మాలతిని అడిగింది.

“ఇంటి ఓనర్ రంగయ్యగారు రెండువేలు చెప్పమన్నారు, ఒక నెల అడ్వాన్స్ తీసుకోమన్నారు, మీకు నచ్చిందా నీరజగారు” అడిగింది మాలతి.

“నాకు నచ్చిందండీ, అడ్వాన్స్ తీసుకోండి”అంటూ మాలతి చేతిలో రెండువేలు పెట్టింది.

“త్వరగా పోర్షన్ లో దిగండి”నవ్వింది మాలతి.

“అలాగే మాలతిగారు, మా వారు ఆఫీసు అయిపోగానే యిద్దరం కలిసొస్తాము.  బదిలీ అంటే నాకెందుకో బాధగా వుంటుంది.  మీలాగే యెవరో ఒకరు ఫ్రెండ్ అవుతారు, సరదాగా సంతోషంగా గడిపేస్తాం.  కానీ వాళ్ళని వదిలి వెళ్లేటప్పుడు చెప్పలేని దిగులేస్తుంది.  అయినా అందరితో కాంటాక్స్ వున్నాయిలెండీ ఇంత త్వరలో మీలాంటి వారితో ఆత్మీయ స్నేహం కుదురుతుందని నేనీ వూళ్లో అడుగుపెట్టినప్పుడు వూహించనేలేదు.  మరి నేను వెళ్ళిరానా”నీరజ మాలతి చెయ్యి ఆప్యాయంగా నిమిరి గేటు దగ్గరికి వెళ్లింది

ఇద్దరూ బాగా పరిచయం వున్న స్నేహితుల్లాగా ఫీలయ్యారు.  మాలతి నీరజను తల్చుకుంటూ వంటపనిలో జొరబడింది.  వంట ముగించింది.  ప్రక్కింటి రాగిణీ, ఉషలకు ఫోన్ చేసి నీరజ అద్దెకు చేరుతున్న విషయం చెప్పింది.  మల్లెపూలు రెండు మాలలు అల్లింది.  తను ఒకటి జడలో తురుముకుని, రెండోది నీరజ కోసం పెట్టింది.  అద్దె కు యిస్తున్న గదుల్లో వున్న తమ మంచాలను, పారుపూలను తీసివేసి అంతా శుభ్రం చేసింది.  నీరజ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

—————–

మధ్యాహ్నం పన్నెండు గంటలకు నీరజ చేతిలో సూట్కేస్ తో ఆటో దిగింది.  మాలతి యెదురొచ్చి లోపలికి తీసుకెళ్లింది.

“ఆయన కోసం చూసి చూసి నేనే వచ్చేసానండీ, మీ యింటి అడ్రస్ మెసేజ్ చేసాను.  సామానంతా ప్యాక్ చేయించి మూవర్స్ ప్యాకర్స్ లో తెప్పిస్తున్నాం.  ఆయన వస్తే కానీ అవిరావు. ”అంది నీరజ.

“నీరజగారు, రండి భోజనం చేద్దాం, మీకోసమే యెదురు చూస్తున్నాను”అంటూ మాలతి నీరజకు మల్లెమాల అందించింది.

“అయ్యో మీకెందుకండీ శ్రమ? నేను హోటల్లో తినేసే వచ్చాను, మీరు తినేసి రండీ మాలతీ, నేను యిక్కడే కూర్చుంటాను” అంది నీరజ.

“అదేమిటి నీరజా !1భోజనానికి రండీ అంటే ముందే తినొస్తారని చెప్పలేదు, చెప్పక పోవడం వల్ల తినేసి వచ్చారన్నమాట ! అయినా మీరు నాతో కలిసి భోజనం చెయ్యాల్సిందే, మా వారు కూడా లేకపోవడం తో నాకు అసలు ఒక్కదాన్ని తినాలనిపించడం లేదు”అంది మాలతి అలక మొహం పెట్టి ముద్దు ముద్దుగా నీరజను చూసింది.  నీరజ ఆ మాటలకూ, చూపులకూ కరిగిపోయింది.  భోజనం చెయ్యడానికి ఒప్పుకుంది.  ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు.  రాగిణీ, ఉషా కూడా వచ్చారు.  అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.  ఇంతలో యింటి ముందు ఆటో ఆగింది.  దిగుతున్న వ్యక్తిని చూపించి ఆయన తన భర్త అని, అలాగే మాలతిని కూడా పరిచయం చేసింది.  రాగిణీ, ఉషా వెళ్లిపోయారు.  అతను నవ్వ్వుతూ మాలతిని చూసాడు.

“నీరజా, ఆఫీసులో జాయినింగ్ రిపోర్ట్ యిచ్చి పర్మిషన్ తీసుకోవడం వల్ల లేట్ అయ్యింది, మాలతి గారూ నా పేరు వివేక్, “అంటూ తనల్ని తాను పరిచయం చేసుకున్నాడు. పోర్షన్ చూసాడు.  నచ్చిందని చెప్పాడు.

“నీరజా, నా ఫ్రెండ్ రాంబాబు అత్తవారిల్లు యీ వూరే ట! ఈ రాత్రి వాళ్లింట్లో వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ వుంది, నిన్ను తీసుకు రమ్మన్నాడు, నీకు చెబ్దామని వచ్చాను, వాడికి నా హెల్ప్ కావాలిట, యింకో రెండు గంటల్లో వస్తాను, అందంగా తయారయ్యి రెడీగా వుండు” అంటూ వివేక్ హడావిడిగా వెళ్ళిపోయాడు.  నీరజ గుడ్లప్పిగించి చూస్తూ వుండిపోయింది.

“చూసారా మాలతి, నా నగలూ, చీరెలూ అన్నీ హోటల్ లో వున్నాయి, తాళంచెవులూ ఆయన దగ్గరే వున్నాయి, నాకు మాట్లాడే అవకాశం కూడా యివ్వకుండా వెళ్లిపోయారు.  ఫ్రెండ్స్ కనిపిస్తే చాలు, పెళ్ళాం సంగతే మర్చిపోతారు”అంది నీరజ దిగులుగా.

“నీరజా, నాకు బోలెడు కొత్త చీరెలు వున్నాయి, నా నగలూ వున్నాయి.  చక్కగా అందంగా తయారవ్వండి”అంటూ నగలూ చీరెలూ అన్నీ నీరజ ముందే అల్మారా తీసి మంచం మీద పర్చింది మాలతి.

“మాలతిగారూ! వద్దండీ, ఉదయమే మీకు పరిచయం అయ్యాను.  నన్ను నమ్మి మీ నగలూ యిస్తామంటున్నారు,  చీర కట్టుకోమంటున్నారు, మీ మంచితనం మా అక్కయ్య నీరద గుర్తొస్తున్నది.  అక్కయ్య కూడా నేనేదయినా కావాలంటే వెంటనే తనవన్నీ యిచ్చేది.  ఎంత రాత్రయినా వచ్చి మీ నగలు యిచ్చేస్తానండీ యింకో గంటలో ఆయన వస్తారు”అంది నీరజ.

మాలతి తన మూడుపేటల చంద్రహారం, పగడాల నెక్లసు యిచ్చింది.  నాలుగు జతలగాజులు తనే స్వయంగా నీరజ చేతులకు తొడిగింది.  నీరజ అందంగా, సొగసుగా తయారయ్యింది.  ఇంతలో వివేక్ ఆటో తీసుకొచ్చాడు.  భార్య ముస్తాబును మెచ్చుకోలుగా చూసాడు.

నీరజ ఆటో యెక్కుతూ, “మాలతీ వెళ్ళొస్తాను”అంటూ నవ్వింది.

——————————-

 

“బాధ తట్టుకోలేక నీరజకు నగలిచ్చిన విషయం చెప్పి పెద్దగా యేడ్చేసింది.  రఘు తెల్లబోయాడు.

“నీకసలు బుద్ధుందా! అద్దెకు దిగడానికి వచ్చిన ముక్కూ మొహం తెలియని కొత్తవాళ్లకు నగలిస్తావా? పైగా ”నన్నెవరూ బోల్తాకొట్టించరు”అని వాదిస్తావుగా నీకు టోకరా యిచ్చి నగలు కాజేసి వెళ్లిపోయారు.  వాళ్లు రారు, నగలు మర్చిపో, పద వాళ్ల సూటుకేసు చూద్దాం”కోపంగా అరిచాడు రఘు.  నిద్ర మత్తు యెగిరిపోయింది.  మాలతి చెంప వాయించాలనిపించింది.  కానీ మాలతి కన్నీళ్లూ, అమాయకత్వానికి కరిగిపోయాడు.

సూటుకేసు లో రెండు చీరెలు, రెండు పుస్తకాలూ వున్నాయి. ”నిన్ను బోల్తా కొట్టించడం సులువే, అయినా యింత గుడ్డిగా నమ్ముతావని నేనెప్పుడూ ఊహించలేదు, నిన్నెవ్వరు మోసగించలేరని గొప్పలు చెప్తావుగా అప్పుడేమయింది నీ తెలివి ?పొలిసు కంప్లైంట్ యిద్దామా”అన్నాడు రఘు.

రఘు మాటలకు మాలతికి యేడుపు సమాధానం.  రఘు కూడా యేమి మట్కాడలేదు.  ఇద్దరూ భోజనం చేసి, రఘు టీవీ చూస్తున్నాడు, మాలతి లోపలికెళ్లి పడుకుంది.  రెండుగంటల సమయం లో యింటిముందు ఆటో ఆగింది.

“మాలతీ మనింటికెవరో వచ్చారు, రా”అంటూ రఘు మాలతి పిలిచాడు.  కళ్లు తుడుచుకుంటూ మాలతి వచ్చింది.  నీరజా, వివేక్ ఆటో దిగారు.  రఘు”మాలతీ వీడు వివేక్” అంటూ నవ్వాడు.  మాలతి గుడ్లప్పిగించి చూస్తున్నది.  నీరజ నవ్వుతున్నది.

“మాలతిగారూ యిదిగో మీ నగలు, మెం పారిపోయాం అనుకున్నారా, “నవ్వుతూ నీరజ నగలు మాలతి చేతికిచ్చింది.

“మాలతీ”అంటూ వివేక్ చాలా చనువుగా పిలిచాడు.  ఉలిక్కిపడింది అంత చనువు పిలుపుకు, అదీ తన భర్త ఎదురుగుండానే >

“నిన్నింకా అయోమయం లో వుంచనులే చెల్లాయ్ !మీ పెద్దనాన్న కొడుకు యింట్లోనించి వెళ్లిపోయాడని తెలుసుగా, “అన్నాడు వివేక్.

“అవును, అమ్మా, నాన్నా చెప్పుకుంటుంటే విన్నాను.  నాకప్పుడు అయిదేళ్ళుంటాయేమో !కానీ నాకు సరిగా గుర్తుకూడా లేదు యీ మధ్యనే తిరిగి వచ్చాడనీ, పెళ్లికూడా చేసుకున్నాడని నాన్న చెప్తే తెలిసింది. ”అన్నది మాలతి.

“వాడే నేను, నా భార్య నీరజ! నాన్నతో ఘర్షణ పడి వెళ్లి ఆలా ఆలా తిరుగుతూ అనుకోకుండా ఒక బడిపంతులుగారి ఆశ్రయం దొరికింది.  చదువూ, వుద్యోగం జీవితం గాడిలో పడింది.  వారి బంధువులమ్మాయి నీరజను చేసుకున్నాను.  నాన్నను కలిసాను.  అందర్నీ కలవాలని సెలవు పెట్టి బయల్దేరాం.  మా అక్కయ్య యీ వూళ్లోనే  వుంది .  బావగారు రఘు,  ఒక ఆఫీసులోనే చేస్తారని నాన్న చెప్పారు.  రెండు రోజుల క్రిందట రఘుని కలిసాను.  మాటల్లో మాటగా రఘు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పి నీకు కనువిప్పు కలిగేలాగా చెయ్యమన్నాడు.  అందుకే యీ నాటకం ఆడాం చెల్లాయ్”అన్నాడు వివేక్.

“అయితే అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసారన్నమాట”బుంగమూతి పెట్టింది మాలతి.

“నిన్నెవ్వరూ మోసం చెయ్యలేరని అన్నావుగా!! అందుకే యీ ప్లాను వేసాం”అన్నాడు రఘు.  అందరూ నవ్వేసారు.

 

————

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *