March 19, 2024

బహువిధ యజ్ఞకర్త “శౌనక మహర్షి”

రచన: శ్యామసుందర రావు

పూర్వము విజ్ఞాన ఖని తపస్సంపన్నుడు అయినా శునక మహర్షి ఉండేవాడు అయన కుమారుడే శౌనక మహర్షి ఈయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నైమిశారణ్యము తండ్రి దగ్గర సకల యజ్ఞ నిర్వహణా సామర్థ్యము, వేద వేదాంగములు, నియమ నిష్టాగరిష్టుడై నేర్చుకొని తల్లిదండ్రుల అనుమతితో నిర్జన ప్రదేశము కొరకు బయలు దేరి, చివరకు నైమిశారణ్యము చేరుకొన్నాడు. ఇంక ముందుకు వెళ్ళలేక, ఆక్కడే స్థిర నివాసము ఏర్పరుచుకొని, అనేక మంది ముని పుంగవులని శిష్యులుగా చేసుకొని, మహాతపోధనుడై, బ్రహ్మజ్ఞానియై, కులపతియై, బ్రహ్మ జ్ఞాన దాన విరాజితుడై, దయామయుడై, శాంఖ్యా యోగాచార్యుడై వెలుగొందాడు శౌనక మహర్షి. నైమిశారణ్యాన్ని తన తపస్సుకు ఎన్నుకోవటానికి గల కారణాలు అనేకము. నైమిశారణ్యము ఏంతో అందమైన ప్రదేశము. ఈ నైమిశారణ్యము విష్ణు మూర్తి మందిరములా, మాధవి మన్మధులకు ఇష్టమైనట్లు, సరస్వతి దేవితో కలసి ఉన్న బ్రహ్మ గారి ఇల్లులా, ఈశ్వర సభలా, వహ్ని, వర్ణ, చంద రుద్ర సమీరణ, హైమావతి, కుబేర, గాలవ, శాండిల్య, వంటి మునులతో కూడుకుని, కుబేరుని ఖజానాలు, రఘురాముడి యుద్ధములా, పరుశరాముడి పౌరుషములా, ఇంకా వేదాల, గాయత్రి నిలయమై అమరావతి పట్టణముల పురుషోత్తముని సేవకు అవసరమైన ఫలాలతో, గొప్ప మునుల తపస్సులతో పవిత్రమై ఉండటం వలన ఆ ప్రదేశానికి విష్ణు క్షేయత్రము అని పేరు వచ్చింది.

శౌనక మహర్షి వెయ్యి సంవత్సరాలు జరిగే సత్రయాగము చేయాలనీ సంకల్పించి ఆ యాగ నిర్వహణకు ఎన్నోగ్రంధాలు చదివి ఎన్నోపురాణాలు విని ఏంతో జ్ఞానము సంపాదించుకున్నా సూత మహర్షిని ఎన్నుకున్నాడు. వేయి సంవత్సరములు వైదికోక్తములగు సర్వ యజ్ఞకర్మ కలాపములు ప్రతిరోజు నెరవేర్చిన పిదప సమస్త పురాణములు, ఇతిహాసములు చెప్పించు కొనుటకు శౌనక మహర్షి సూత మహర్షిని కోరడం జరిగింది. ఇందులో భాగంగా సూతుల వారు కృష్ణ కథాశ్రవణము వారందరికీ వినిపించారు ఆ విధముగా సూతులవారు అక్కడి మునులందరికి భగవంతుని ఏక వింశత్వవాతార కధలు అంటే విష్ణు మూర్తి అవతారము ఎత్తిన కధలు అన్ని పురాణాలు వినిపించాడు. కొన్నాళ్ల తరువాత మళ్ళీ శౌనక మహర్షి లోకానికి మంచి జరగాలని ద్వాదశ సంవత్సర సత్ర యాగాన్ని మొదలు పెట్టి సూతుల వారిని ని పిలిపించి మునులందరికి భారత కధలు వినిపించాడు సూతుడు శౌనకాదులకు పద్మ పురాణము అంతయు వినిపించి వారందరినీ అమిత ఆనంద కందళిత హృదయార విందులను చేసి తను కూడ బ్రహ్మానందము పొందాడు. పద్మ పురాణము అంటే విష్ణుమూర్తి నాభి నుంచి పుట్టిన కమలము గురించి చెప్పేది. కల్పాంతరములో మత్స్య రూపములో ఉన్న అది దేవుడు వేదవేదాంగ పురాణాలలో పద్మ పురాణము కూడ దేవలోకములోను, మనుష్యలోకములోను ప్రతిష్టించబడింది. పద్మపురాణాన్ని హరి, బ్రహ్మకు, బ్రహ్మ నారదునికి , నారదుడు వ్యాసునికి వ్యాసుడు సూతునికి చెప్పగా అయన శౌనకాది మునులకు చెప్పాడు ఈ విధముగా శౌనక మహర్షి చేసేన యాగాల వల్ల పురాణాల శ్రవణము వల్ల ఆ ప్రదేశము పుణ్యక్షేత్రము అయి బ్రహ్మ లోకముగా విరాజిల్లేది.

నిరంతరము జ్ఞాన్నాన్ని పొందాలనే తపన ఉన్న జిజ్ఞాసువు శౌనకుడు అంగీరస మహర్షి వద్దకు వచ్చి “ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లు ఆవుతుంది?” అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు “పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసార చక్రం నుంచి విముక్తుడవుతాడు. ” అంటూ ముండకోపనిషత్తు అనే ఉపనిషత్తును అంగీరసుడు బోధించాడు

పాండవులు అరణ్యవాసము బయలుదేరినప్పుడు గంగాతీరములో ఒక చెట్టు క్రింద ఒక రాత్రి గడిపి మళ్లి బయలుదేరారు. వీరీ వెంట అక్కడే ఉన్న బ్రాహ్మణులు వాళ్ళ దగ్గర ఉన్న అగ్నిహోత్రాలను తీసుకొని పాండవుల వెంట బయలుదేరాఋ ధర్మరాజు తన దగ్గర ధనము లేనందువల్ల వారికి భోజన వసతి ఎలా కల్పించాలి అని చింతిస్తున్నప్పుడు శౌనక మహర్షి ర్మరాజుకు డబ్బు లేదని చింతించవద్దు అని చెప్పిఅనేక ధర్మ సూక్షములను ధర్మరాజుకు బోధించి సూర్యుని ఆరాధించామని ఉపదేశించాడు ధర్మరాజు ఆ విధముగా సూర్యుని ప్రార్ధించగా సూర్యుని అనుగ్రహముతో వేల బ్రాహ్మణులకు అతిధి పూజ చేయ గలిగాడు

ఋగ్వేదం రక్షణ కొరకు శౌనక మహర్షి అనువాకానుక్రమణి ఆర్షానుక్రమణి చందోనుక్రమణి దేవతానుక్రమణి పాదానుక్రమణి, సూక్తానుక్రమణి ఋగ్విధానం బృహద్దేవతా ప్రాతిశాఖ్యం శౌనకస్మృతి అనే గ్రంథాలు రచించాడు. ఇందులో మొదట సూచించినవి ఏడు గ్రంథాలు మాత్రము అనుక్రమణికా వాజ్మయములో చేరతాయి. శౌనక మహర్షి వ్రాశిన అనుక్రమణికములలో అనువాకానుక్రమణి తప్ప మరొకటి లభించుట లేదు. మిగతావి కేవలం వేదరాశులలో (సధ్గురశిష్య రచనలలో) ఉల్లేఖనాలు రూపాలలో మాత్రమే మనుగడలో ఉన్నాయి. శౌనక మహర్షి చరణ వ్యూహ అను ధర్మశాస్త్రమునకు గ్రంథకర్త. ఆ విధముగా శౌనక మహర్షి బ్రహ్మజ్ఞానిగా బహువిధ యజ్ఞ కర్తగామః ధర్మ వేత్తగా ప్రసిద్ధి కెక్కాడు సూతుని ద్వారా మునులకు అనేక పురాణాలను వినిపించి వారిని పుణ్యాత్ములుగా గావించాడు.

1 thought on “బహువిధ యజ్ఞకర్త “శౌనక మహర్షి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *