March 19, 2024

మాలిక పత్రిక జులై 2022 సంచికకు స్వాగతం

  మాలిక పత్రిక పాఠక మిత్రులకు సాదర ఆహ్వానం.. మాలిక పత్రిక ఎప్పటికప్పుడు మంచి రచనలు అందించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి మీ ఆదరణ కూడా లభిస్తుంది.. ధన్యవాదాలు.. చిరుజల్లులతో నగరాలు, మనసులు కూడా కాస్త చల్లబడ్డాయి కదా. మల్లెలు ఇంకొంతకాలం ఉంటామంటున్నాయి. మామిడిపళ్లు ఇక సెలవు అంటున్నాయి. వర్షపు జల్లులలో తడిసిన మొక్కలు రంగురంగుల పువ్వులతో ప్రకృతి పులకించబోతూ ఉంది. రాబోయే బోనాల పండుగ మనమందరం సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక ముఖ్యవిషయం […]

ధృతి – 13

ఆఖరు భాగం రచన: మణికుమారి గోవిందరాజుల ఆ రోజు రాత్రి అన్నం తింటున్నప్పుడు చెప్పింది తాను చేసిన ఘనకార్యం. నిర్ఘాంతపోయి చూస్తుండిపోయింది తులసి. “అదేంటే? ఇప్పుడు వద్దు అనుకున్నాముగా? పరీక్షలు దగ్గరకొస్తుండగా నీకిది అవసరమా? దీని పర్యవసానం నీ చదువు మీద పడితే నువు ఎంత డిస్ట్రబ్ అవుతావు? ఇప్పుడు నీ పిలక వాళ్ళ చేతుల్లో ఉన్నది” లబలబలాడింది. “అమ్మా! ఆయనది అంత చీప్ మెంటాలిటీ కాదు. నువ్వేమీ కంగారు పడకు. ఇప్పుడు నేనేమీ చెప్పకపోతే, అది […]

మోదుగపూలు – 12

రచన: సంధ్యా యల్లాప్రగడ గిరిజన గ్రామంలో అందరు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం అనేది గోండుల సంస్కృతిలో భాగం. గ్రామంలో పెళ్లిళ్లు, పండుగలు అందరూ కలిసే చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక గ్రామానికి, మరో గ్రామానికి మధ్య తగవులు వస్తాయి. మాములుగా వారి తగవులు వారు తమ గ్రామపంచాయితిలో తీర్చుకుంటారు. గ్రామాల మధ్య గొడవలకు కూడా మార్గం ఉంది. పది పన్నెండు గ్రామాలకి ఒక రాజు ఉంటాడు. వారి తగవులు తీరుస్తాడు ఆ రాజు. ఈ చిన్న […]

చంద్రోదయం 30

రచన: మన్నెం శారద స్వాతి బద్ధకంగా పడుకొంది. సారథి ఆమె నుదుటమీద చెయ్యేసి “జ్వరం లేదే!” అన్నాడు. “నాకేమిటోగా వుందండి” అంది అతనికి దగ్గరగా జరిగి పడుకొంటూ. “పడుకొంటే అలాగే వుంటుంది. లే. లేచి కాఫీ త్రాగు. అదే పోతుంది.” “అబ్బా! నన్ను కాస్సేపు పడుకోనివ్వండి. నాకిప్పుడే లేవాలని లేదు” అంది గారంగా. “సరే! కాఫీ నేనే తెస్తానుండు”సారథి కాఫీ స్వయంగా కలుపుకొచ్చేడు. ఆమె అయిష్టంగా త్రాగి వెంటనే వాంతి చేస్కుంది. “అదేమిటి? లోపల జ్వరమేమో. రెడీ […]

తాత్పర్యం – దృష్టి

రచన: రామా చంద్రమౌళి డాక్టర్ నరేందర్ ఎం బి బి ఎస్. ఎప్పట్నుండో కిటికీలోనుంచి చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఎదురుగా అప్పుడే సూర్యోదయమౌతోంది. ఎర్రగా. కాంతివంతంగా. సూర్యుడుదయిస్తున్నపుడు అందరూ వెలువడే కాంతిని గమనిస్తారు. చూస్తారుగాని వెంట అవిభాజ్యంగా వెలుగుకిరణాలతోపాటు కలిసి వచ్చే ఉష్ణం గురించి ఎవరూ ఆలోచించరు. ఎందుకో అతనికి కాళోజీ కవితా చరణాలు గుర్తొచ్చాయి చటుక్కున. “సూర్యుడుదయించనే ఉదయించడనుకోవడం నిరాశ ఉదయించిన సూర్యుడస్తమించడనుకోవడం దురాశ” తన జీవితంలో సూర్యుడుదయించాడా. సూర్యోదయాన్ని తను గుర్తించకముందే అస్తమించాడా. వ్చ్. , […]

కంభంపాటి కథలు – భూలోక రహస్యం

రచన: కంభంపాటి రవీంద్ర బాప్టిస్టు చర్చికి ఎడమ పక్కకి తిరిగితే వచ్చే వీధిలోని మూడో ఇల్లు అచ్యుతమణి గారిది. ఆ ఇంట్లోని నాలుగు వాటాలూ అద్దెకిచ్చేయగా, ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఓ మూలనున్న ఎర్ర మందార చెట్టు పక్కనున్న చెక్కల బడ్డీ భూలోకంగాడిది. అచ్యుతమణిగారి ఇంట్లోని ఓ వాటాకి, ఈ చెక్కల బడ్డీకి కలిపి నెలకి యాభై రూపాయలు అద్దిస్తూ, ఐదేళ్ల నుంచీ అక్కడే గడిపేస్తున్నారా భూలోకంగాడి కుటుంబం. అప్పట్లో ఆ వీధికే కాదు, ఆ […]

పరవశానికి పాత(ర) కథలు – మంచులో మనిద్దరం

రచన: డా. కె. వివేకానందమూర్తి విశాఖపట్నంలో స్టీలు ప్లాంటు తీసుకురావాలని విద్యార్థులకున్నంత గాఢంగా, విద్యార్థుల్లో క్రమశిక్షణ తీసుకురావాలని ఉపాధ్యాయులనుకున్నంత గాఢంగా – లక్ష్మీవారం నాడు లక్ష్మీకుమారి మనసులో రసభావాలు పోజిటివ్ గా తీసుకురావాలని బాలరాజు అనుకున్నాడు. అంతకు ముందే అమితమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చినా అదే బాటలో అతనిన్నాళ్ళు నడవలేదు. మనస్సుకి తెగింపు చాల్లేదు. కానీ ఉన్నట్టుండి వెళ్ళిపోయిన లక్ష్మీవారం లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్మి వందనం లక్షలకొద్దీ ప్రేమ భావాలతో లక్షణంగా తయారై వచ్చి, విశాఖపట్నం బీచ్ […]

అమ్మమ్మ – 37

రచన: గిరిజ పీసపాటి తల్లి చెప్పిన విషయం మొత్తం విన్నాక వసంత తోక తొక్కిన త్రాచులా పైకి లేచింది. “అసలెందుకీ దాగుడుమూతలు? ఇక్కడాయనకి ఏం లోటు జరిగిందని వెళ్ళిపోయారో నాకర్ధం కావడం లేదు. కుష్ట మామ అబద్ధం చెప్తున్నారని నాకప్పుడే అనుమానం వచ్చినా, ఢీల్లీ మామ కూడా వెళ్ళొచ్చి ఆయన మన ఊరిలో లేరనేసరికి నిజమే అనుకున్నాను. చిన్నప్పటి నుండి మన ఇంట్లో మనిషిలా ఉంటూ ఢిల్లీ మామ కూడా అబద్ధం చెప్తాడని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు […]

వెంటాడే కథలు – 10

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో. . రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా […]

ఆ చేత్తో..

రచన: కుమార్ జొన్నలగడ్డ కాలం మారుతోంది. దశాబ్దాలు మారుతున్నాయి. సాంఘిక వ్యవహారాలు, పోకడలు మారుతున్నాయి. ఆర్ధిక అసమానతలు తగ్గుతున్నాయి. అంతా మారుతోంది అని అనుకున్నప్పుడు ఇంకా మారనిది సమాజంలో పాతుకుపోయినది ఏమిటంటే పురుషాధిక్య సమాజం. ఒక స్త్రీ యెంత యెత్తుకు యెదిగినా, ఇంకా ఒక స్త్రీ భావనలకి ప్రొత్సాహం ఇవ్వకుండా వారిని ఎప్పుడూ రెండవ తరగతి పౌరుల్లాగానే ఈ సమాజం చూస్తోంది. ఈ భావాలు మగవారిలోనే కాకుండా ఆడవారిలో కూడా ఉన్నాయి.అలాంటి సమాజంలో తనను తాను ప్రోత్సహించుకుంటూ […]