June 25, 2024

వెంటాడే కథ -13 … విందు!

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]

పంచనదీశ్వరస్వామి

ధర్మసంవర్థనీసమేత శ్రీ పంచనదీశ్వర స్వామి ఆలయం!! రచన: రమా శాండిల్య ఈ మధ్య మేము చేసిన తమిళనాడు, కేరళ యాత్రలో ఒక భాగమైన, ఒకరోజు దర్శించుకున్న క్షేత్రమే ఈ, ‘పంచనదీశ్వర స్వామి’ ఆలయం. తమిళనాడు రాష్ట్రంలోని, తంజావూరు జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లె ఈ ఆలయం ఉన్న, ‘తిరువయ్యారు’. తంజావూరు నుంచి ఉదయం ఎనిమిది గంటలకు తిరువయ్యారు బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ, మొదట పంచనదీశ్వరాలయము దర్శించుకున్నాము. దర్శనానికి వచ్చిన తోటి భక్తులనుంచి సేకరించిన సమాచారం ప్రకారం, […]

రైభ్య మహర్షి

రచన: శ్యామ సుందరరావు రైభ్య మహర్షి వృత్తాంతాన్ని ధర్మరాజుకు అరణ్య పర్వంలో పాండవులు తీర్ధయాత్రలు చేస్తున్నప్పుడు లోమాంశుడు అనే ఋషి చెపుతాడు. రైభ్యుడు, భరద్వాజుడు ఇద్దరు మంచి స్నేహితులు అన్నదమ్ములులా మెలుగుతూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. రైభ్యుడు చిన్నతనము నుండి గురు శుశ్రుహ చేస్తూ వినయవిధేయలతో గురువులనుండి వేదాధ్యయనము చేస్తూ ఉండేవాడు గురువులు కూడా రైభ్యుని గురుభక్తికి మెచ్చి ఆయనకు అన్ని వేదాలను నేర్పారు. కొన్నాళ్ల వేదధ్యాయనము చేసినాక రైభ్యుడు దేవా గురువైన బృహ స్పతిని కలిసి […]

కోటి విద్యలు కూటి కొరకే

రచన: ప్రకాశలక్ష్మి పొట్టకూటికోసం బొమ్మలాడించే, ఓ…బడుగుజీవి…నీ సంపాదన కొరకు, నీ చిల్లుల గుడిసెలో ఎన్ని నకనకలాడే, కడుపులు ఎదురు చూస్తున్నవో, అయ్య …ఎపుడు వచ్చునో … అమ్మ బువ్వ ఎపుడు వండునో అని. ఉన్న ఊరు ముసలి తల్లితండ్రులను వదలి, పసిపాపలతో ఊరు కాని ఉరు వచ్చి, రహదారి పక్కన గుడారాలలో… దేవుడి బొమ్మలు, చేసే ఓ.. కాందిశీకా। దారిదోపిడి దొంగలతో, ఖాకీ జులుంతో చీమ, దోమ విషప్పురుగులతో, మలమల మాడే ఆకలి కడుపులతో, బతుకుబండి వెళ్లదీసే, […]

విశృంఖలాలు

రచన: జి. రాజేంద్రప్రసాద్ నోటికి హద్దూలేదు పద్దూలేదు తలచిందే తడవుగా తూటాలుగా మాటలు ప్రేలుస్తుంది వాన చినుకుల్లా ప్రేమజల్లులు కురిపిస్తుంది వసంత కోకిలలా గానామృతం చిందిస్తుంది సుమతీ శతకకర్తలా నీతిని బోధిస్తుంది మనసుకు పగ్గాలులేవు సంకెళ్ళులేవు గాలి వీచినట్లుగా ఆలోచనలు పరుగెత్తుతాయి ఆకాశంలో మేఘాల్లా ఉరుముతాయి మెరుస్తాయి రెక్కలిప్పిన పక్షుల్లా ఎగురుతాయి విహరిస్తాయి కోర్కెలు తీర్చుకోటానికి కవ్విస్తాయి కష్టపెడతాయి కవికలానికి అవధులులేవు అదుపులులేవు భావాలు పుడితే బయటకొచ్చి పొంగిపొర్లుతాయి అక్షరాలు ముత్యాలుగా అల్లుకుంటాయి పేరుకుంటాయి పదాలు ప్రాసలతో […]