May 5, 2024

ఇదేనా ఆకాంక్ష

రచన: రాణి సంథ్య

సచ్చినోడా.. నీకు అక్కా చెల్లి లేర్రా…
గట్టిగా ఎవరో బస్సులొ అరవడంతో ఈ లోకంలోకి వచ్చింది..
క్షణంలో బస్సు ఆగడం.. ఆమే ఇంకా అంతా కలిసి ఒక వ్యక్తిని బాదడం నా కళ్ల ముందే జరిగిపొతుంది..కానీ అసలేమైందో అర్దం కావట్లేదు! గబుక్కున తేరుకుని, నా పక్కన ఉన్నావిడని అడిగా.. ఎమైంది అని ?
ఆ వ్యక్తి ఆవిడను వెనకనుంచి చేయి వేసాడుట.. అందుకే.. గుసగుసగా చెప్పింది!
అప్పటికి ఆ వ్యక్టిని కొట్టి పంపించి వెసారు జనాలు. మొత్తనికి అలా నా హుషారైనా తలపులను ఈ సంఘటన పూర్తిగా ఆక్రమించుకోని ఏదో తెలియని బాధని భయాన్ని నింపేసింది… దేశ రాజధాని మొదలుకుని ఎక్కడా ఆగని ఈ దౌర్జన్యాన్ని ఎలా ఆపడం..???
ఎక్కడ ఈ అక్రుత్యాలకి ముగింపు??? అలా ఆలోచిస్తూనే ఇంటికి వచ్చింది! అన్యమనస్కంగానే ఇంట్లొ అందరినీ పలకరిస్తూ పనులు చేసుకుంటుంది కానీ… ఆలోచనలు మాత్రం ఆగలేదు! ఎదో చేయాలి, తన వంతు ప్రయత్నంగా ముందడుగు వెయాలి. మెల్లిగా పడుకునే సమయానికి గది లో అదే విషయంపై భర్తను కదిలించింది..
ఎం చేస్తావ్.. నువ్వు నేను ఎమీ చేయలేము, మద్యతరగతి వాళ్లం, మనవల్ల ఎమౌతుంది చెప్పు. అనవసరంగా ఎక్కువాలోచించి మనసు పాడు చేసుకోకు, పడుకో.
ఇంక తను ఏం మాట్లాడుతుంది, దైర్యం చెప్పి ముందుకు తీస్కెల్లాల్సిన వాళ్లె వెనకడుగు వేస్తే?
అలా ఆలొచిస్తూనే నిద్రలోకి జారుకుంది.
ఉదయం లేచిందెగ్గరినుంచి అన్ని పనులు చేస్తున్నా, మనసు మాత్రం అదే విషయం ఆలోచిస్తుంది. ఏమి చేయాలి? దీనికి ముగింపు ఎక్కడా? ఆడవారు డ్రెస్సులు నిండుగా వేసుకుంటె..? కరాటే నేర్పిస్తే..? సినిమాలు కావ్య గ్రంథాలుగా మారితే..? ఆడ శిశువుల సంఖ్య పెరిగితే….? చట్టాలు కఠినంగా మార్చి, అమలు పరిస్తే ..? ఇంకా ఎవేవో చేస్తే, మారితే ఈ సమస్య తీరిపోతుందా? ఎక్కడ ఈ సమస్యకి మూలం? అంటూ మనసు ప్రశ్నిస్తూనే ఉంది!

నేనుగా ఈ సంఘానికి గోప్పగా ఎమీ చేయలేకపొవోచ్చు, కాని నా వంతు క్రుషి గా చిన్న ప్రయత్నం చేయాలనుకున్నా.

మనం నేర్చుకునే చదువు మన మెదడుకు కాకుండా మనసును తాకి, విస్తరించి, విఙ్ఞానం గా రూపొంది ఈ సమాజాన్ని అర్ధం చేసుకుని, బాగు చేయకున్నా పరవాలేదూ! చెడగోట్టగుండా చెరపకుండా ఉండే ఙ్ఞానం ఇస్తే చాలు అనిపించింది.

అందుకే తను ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇంట్లో ఓప్పించేసరికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా పట్టు వదలక సామ దాన భేద దండోపాయాలతో ప్రయత్నించి సఫలం అయింది.

తరవాత, తన కాలని ప్రసిడెంటు తో సవివరంగా మాట్లాడి, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని, అక్కడ కాలనీ వాసులతో తన అంతరంగాన్ని వివరించింది.

“ముందు మన ఇల్లు బాగుంటె, పక్కింట్లొ కి వెళ్లి అక్కడ మురికి ఉంటే శుభ్రం చేయవచ్చు, అందుకే ముందు మన కాలని లోని ఆడపిల్లలకి, ఊద్యోగస్తులైన ఆడవారి కి భద్రత, వారు ఓంటరిగా ఉన్నప్పుడు, బయటకు వెల్తున్నప్పుడు తీస్కోవలసిన జాగర్తలు, మగవారు మన దూర దగ్గరి బంధువులైనా సరే, తోటి ఉద్యోగస్తులైనా సరే , మగ స్నేహితులైనా సరె, వారితో చర్చించవలసిన అంశాలు , నివారించవలసిన అంశాలు, వారికి నేర్పవలసిన హద్దులు, మసులోకోవలసిన తీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలపై అవగాహనా కార్యక్రమం వారానికి ఓక రోజైనా జరిగి తీరాలని చేప్పాను. ముఖ్యంగా చిన్న పిల్లలకు గూడ్ టచ్ , బాడ్ టచ్ గురించి వివరించడం, అపరిచితులతో ఎంత దురంగా ఉండాలో నేర్పించాలి అని చెప్పాను . అలాగె ఈరోజుల్లో అందరూ సోషల్ మీడియాలో సరదాకోసమైనా చురుకుగా ఉంటున్నారు , వారు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియచెప్పాలి.

వయసు ఏదైనా సరె ఆడ మగా ఇద్దరికి, నేరము, శిక్ష దాని పరిణామం గురించి వివరించాలి, వీలైతె ఆచరణలో చూపాలి. అంటె అవసరమైతె పోలిస్ కంప్లైంట్ ఇచ్చి తీరాలి.

కాలనిలోని ప్రతి వీధిలొ ఓక అలారం ఏర్పాటు చేయాలి, ఏ సమయంలొ నైన సరె అది మ్రొగితే అందరు కలిసికట్టుగా ముందుకు వచ్చి సమస్య ఏదైన పరిశ్కరించాలి.

ఒక చదువురాని మహిళ అంతమంది లో ఒక వ్యక్తిని దైర్యంగా పట్టుకుని చితక బాదినప్పుడు , చదువుకున్న మనకి ఏం రోగం? ఎందుకు వెనకడుగు వేయాలి? ఎందుకు ఈ నిర్లిప్తత?

ఈ రకమైన జాడ్యం నుంచి మనం బయట పడి మన పిల్లలకి ఆదర్శవంతమైన సమాజాన్ని బహుమతిగా ఇవ్వాలి. “ఇదేనా ఆకాంక్ష”. నేను ఒక అడుగు వేస్తున్నా, మీరు చేయుత నిచ్చి నను నడిపించండి. మనల్ని మనమే సంస్కరించుకోవాలి.” అని ముగించా.

అసలు ఎలా ఇలా మాట్లాడనో నాకే తెలియలేదు. అంతా చప్పట్ల మోత. అలా అందరి ఆశీష్షులతొ నన్ను ముందుకు నడిపించారు. అది విజయం సాదించాలని మీరూ నను ఆశీర్వదించండి!! నాతో చేయికలపండి, కలిసి అడుగేయండి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *