April 26, 2024

పరవశానికి పాత(ర) కథలు – మంచులో మనిద్దరం

రచన: డా. కె. వివేకానందమూర్తి విశాఖపట్నంలో స్టీలు ప్లాంటు తీసుకురావాలని విద్యార్థులకున్నంత గాఢంగా, విద్యార్థుల్లో క్రమశిక్షణ తీసుకురావాలని ఉపాధ్యాయులనుకున్నంత గాఢంగా – లక్ష్మీవారం నాడు లక్ష్మీకుమారి మనసులో రసభావాలు పోజిటివ్ గా తీసుకురావాలని బాలరాజు అనుకున్నాడు. అంతకు ముందే అమితమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చినా అదే బాటలో అతనిన్నాళ్ళు నడవలేదు. మనస్సుకి తెగింపు చాల్లేదు. కానీ ఉన్నట్టుండి వెళ్ళిపోయిన లక్ష్మీవారం లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్మి వందనం లక్షలకొద్దీ ప్రేమ భావాలతో లక్షణంగా తయారై వచ్చి, విశాఖపట్నం బీచ్ […]

పరవశానికి పాత(ర) కథలు – పోలీ శాంతీ మియా వీరా?

రచన: డా. వివేకానంద మూర్తి ఎవరన్నారో, ఎందుకన్నారో తెలీదుగానీ, అలా నోరు నెప్పిజేసి దవళ్ళు వాచేలా – అనగా అనగా ఒక రాజు అప్పుడే సాయంత్రాన్ని సాగనంపేసిన ఒక రోజు ప్రపంచాన్ని చల్లగాను, ప్రేమికుల్ని వేడిగానూ పరిపాలించటం ప్రారంభించేరు. ఆ రాజుగారి చూపులు విస్తృతంగా విస్తరించి విశాలంగా, విలాసంగా వున్నాయి. అది విశాఖపట్నంలో “లాసన్స్ బే’ తీరంలో వున్న శాంతి ఆశ్రమంలోనికి కూడా చొచ్చుకుని, అక్కడ ఏపుగా పెరిగిన సరుగుడు చెట్లని వొరుసుకుంటూ వచ్చి నేల మీదికి […]

పరవశానికి పాత(ర) కథలు – చరిత్ర శిధిలం

డాక్టర్. కె.వివేకానందమూర్తి (యు.కె) ఉన్నట్టుండి ఏదో భరించలేని శబ్ధం గుండె బ్రద్దలు చేసింది. అధిగమించిన వేగంతో పరిగెత్తుతున్న బస్సు ప్రయాణీకులందర్నీ ఒక్కసారి కుదిపి. బాణం తగిలిన పక్షిలా కీచుమంటూ అరచి హఠాత్తుగా ఆగిపోయింది. డ్రైవరు కిందికి దిగేడు. చక్రాలవైపు వొంగి పరిశీలనగా చూస్తూ అన్నాడు – ‘దిగండి, బండి దెబ్బతింది’. కండక్టరు కూడా దిగి చూసేడు. అదే మాట తనూ చెప్పేడు. ప్రయాణీకులందరం క్రిందికి దిగేం. వెనుకపైపు వెలికివచ్చిన చక్రాలకేసి చూస్తూ డ్రైవరు కండక్టరుతో ఏదో మాట్లాడుతున్నాడు. […]

పరవశానికి పాత(ర) కథలు – సయొనారా

రచన: డాక్టర్ కె.వివేకానందమూర్తి (యు.కె) ప్రేమించిన చక్కటి అమ్మాయి కళ్లల్లోంచి కురిసే చిక్కటి వెలుగు లాంటి వెన్నెల జాలు వానగా కురిపిస్తున్న పున్నమి చంద్రుణ్ణి, ఆ అమ్మాయిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించే ముసిలి తండ్రిలాగ, నల్లటి మేఘం వొకటి నిండా కప్పేసింది. అంచేత ఆకాశంలో చంద్రుడు షెడ్ చాటున టేబిల్ లైటులా వున్నాడు. చాలని చిరువెన్నెల పరుచుకున్న భూమ్మీద పల్చని చీకటి మసగ్గా వ్యాపించివుంది. ఇప్పుడు ‘రామకృష్ణా మిషన్ బీచ్’లో వెన్నెల పున్నమినాటిలా లేదు. జనం అప్పుడే […]