రచన: డా. వివేకానందమూర్తి రోజూలాగే నేను రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో యిల్లు చేరాను. రోజూ ఆ టైముకి పిల్లల్ని పడుకోబెట్టి, పెద్ద లైట్లన్నీ ఆర్పేసి మా శ్రీమతి నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది. కానీ ఇవాళ మాత్రం ముందుగదిలో పెద్దలైటు ఇంకా వెలుగుతోంది. తలుపులు కూడా తెరచివున్నాయి. ఎవరా! అని ఆలోచిస్తూ గదిలోకి ప్రవేశించాను. గదిలో ఒక పక్క మంచం మిద దాదాపు నలభై అయిదేళ్ళ ఆసామి ఒకాయన గురక పెట్టి గాఢంగా నిద్రోతున్నాడు. నేను హైదరాబాదులో […]
Category: పరవశానికి పాత(ర) కథలు
పరవశానికి పాత(ర) కథలు – రైలు తప్పిన దేవుడు
రచన: డా. వివేకానందమూర్తి వాన్ వానలో తడుస్తోంది. వానపాములా నడుస్తోంది. సెలైన్ డ్రిప్ జ్ఞాపకానికొస్తోంది. ఎదురుగా అద్దం ఏడుస్తోంది. వైపర్లు కన్నీటి చినుకుల్ని తుడుస్తూ ఓదారుస్తున్నాయ్. చీకటి గుయ్యారంగా వుంది. చీల్చే ప్రయత్నం వొయ్యారంగా వుంది. అందంగా తూలుతోంది అటూ ఇటూ – తాగిన అప్సరసలా, టాంకులో పెట్రోల్లో స్కాచి కల్తీ అయిందేమో అనుకొన్నాను. కాలే సిగరెట్టు వెలుగుతో వాచీ చూసుకున్నాను. కాలానికి మొహం వాచినట్టుంది. సెకన్ల ముల్లు అర్జంటు పనున్నట్టు గబగబా తిరుగుతోంది. చీకటి […]
పరవశానికి పాత(ర) కథలు – చరిత్ర శిధిలం
రచన: డా. వివేకానందమూర్తి ఉన్నట్టుండి ఏదో భరించలేని శబ్దం గుండె బద్దలు చేసింది. అధిగమించిన వేగంతో పరిగెత్తుతున్న బస్సు ప్రయాణీకులందర్నీ ఒక్కసారి కుదిపి, బాణం తగిలిన పక్షిలా కీచుమంటూ అరచి హఠాత్తుగా ఆగిపోయింది. డ్రైవరు కిందికి దిగేడు. చక్రాలవైపు వొంగి పరిశీలనగా చూస్తూ అన్నాడు – ‘దిగండి. బండి దెబ్బతింది’. కండక్టరు కూడా దిగి చూసేడు. అదే మాట తనూ చెప్పేడు. ప్రయాణీకులందరం క్రిందికి దిగేం. వెనుకవైపు వెలికి వచ్చిన చక్రాలకేసి చూస్తూ డ్రైవరు కండక్టరుతో ఏదో […]
పరవశానికి పాత(ర) కథలు – చెన్నకేశవ జావా అమ్మేశాడు
రచన: డా. వివేకానందమూర్తి “మళ్లా కొత్త జావా కొంటావా?” అని అడిగితే “నాకు జావా వొద్దు. ఇండోనేషియా వద్దు. ఊరికే ఇచ్చినా పుచ్చుకోను” అని ఖండితంగా చెప్పేశాడు. * * * అవాళ అర్జంటు పనిమీద జావా మీద అర్జంటుగా అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి రాజమండ్రికి బయల్దేరాడు చెన్నకేశవ. చీకట్లో కొన్న బండి చీకటిని చీల్చడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రయాణం చేస్తోంది. కాని చీకటిని ఎవరు చీల్చగలరు? ఎందుకు చీల్చుదురు? చీకటి చీలిపోతే చీకట్లో బతికే దౌర్భాగ్యులకు బతుకు […]
పరవశానికి పాత(ర)కథలు – ఓవర్ నటేశన్
రచన: డా. వివేకానందమూర్తి “కాస్త చూసి నడువికా!” అన్నాడు బేతాళుడు. విక్రమార్కుడు ఆగి బేతాళుడి కేసి కోపంగా చూశాడు. “అపార్థం చేసుకోకు మార్కా! అసలే మనం నడిచేది హైదరాబాదులో చిక్కడపల్లి రోడ్డు. అదీగాక ఎదురుగా వచ్చేది ఎవరోకాదు ఆర్. టి. సి. బస్సు, దానికి యన్టీరామారావైనా ఒకటే. ఎక్స్ ట్రా నటుడైనా ఒకటే”. విక్రమార్కుడు ఒకసారి రోడ్డంతా కలయజూశాడు. ఆవాళే రిలీజయిన చిత్రం మొదటి ఆట అప్పుడే వదిలినట్టుంది. రోడ్డు. నడక వేగం తగ్గించి జాగ్రత్త పడ్డాడు. […]
పరవశానికి పాత(ర) కథలు – చెన్నకేశవ జావా అమ్మేశాడు
రచన: డా. వివేకానందమూర్తి “మళ్లా కొత్త జావా కొంటావా?” అని అడిగితే “నాకు జావా వొద్దు. ఇండోనేషియా వద్దు. ఊరికే ఇచ్చినా పుచ్చుకోను” అని ఖండితంగా చెప్పేశాడు. * * * అవాళ అర్జంటు పనిమీద జావా మీద అర్జంటుగా అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి రాజమండ్రికి బయల్దేరాడు చెన్నకేశవ. చీకట్లో కొన్న బండి చీకటిని చీల్చడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రయాణం చేస్తోంది. కాని చీకటిని ఎవరు చీల్చగలరు? ఎందుకు చీల్చుదురు? చీకటి చీలిపోతే చీకట్లో బతికే దౌర్భాగ్యులకు బతుకు […]
పరవశానికి పాత(ర) కథలు – యువర్ సీట్స్ ఆర్ సేఫ్ విత్ మి
రచన: డా. వివేకానందమూర్తి వాన దంచేస్తోంది. టాపుమీద పడే ధారల శబ్దం సిట్యుయేషన్ మ్యూజిక్ లా వుంది. కారు దీపాల వెలుగులో ప్రహరీ గోడ ప్రస్ఫుటంగా కనబడుతోంది. అగ్గిపుల్ల వెలగ్గానే గీసిన శబ్దం. కాంతి కంటే ధ్వని లేటయింది. సిగరెట్టు తుదముట్టించి పుల్లని తుది ముట్టించేడు. ఒక్కసారి దమ్ము లాగేడు. కాస్త వంగి స్పీడో మీటర్ లైటు వెలుగులో మణికట్టు చూసుకున్నాడు. ఫణి పదకొండున్నర నుదురు బిగించి రెప్పలు పైకి విప్పి చూశాడు. వాన వినిపిస్తోంది. చూపు […]
పరవశానికి పాత(ర) కథలు – జ్వరం
రచన: డా. వివేకానందమూర్తి భూమికి పాతికేళ్ళు పాతబడిపోయిన పరమహంసకి జీవితంలో మొదటిసారిగా జ్వరం వచ్చింది. జ్వరానికి, పరమహంసకి మధ్యన ఉన్న సంబంధం అయస్కాంతం యొక్క నార్త్ పోల్ నీ, సౌత్ పోల్ నీ గుర్తుకు తెస్తుంది, చీకటికీ, దొంగలకీ, దెయ్యాలకీ, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలకీ చివరికి భార్య మాటకి కూడా భయపడని పరమహంస జ్వరానికి భయపడతాడని తెలిస్తే నవ్వు వస్తుంది. చంటి పిల్లలు బూచాడు ఎత్తుకుపోవడం గురించి, పెద్దవాళ్లు ప్రమాదాల గురించి, రాజకీయ నాయకులు నిజం […]
పరవశానికి పాత(ర) కథలు – చావు
రచన: డా.వివేకానందమూర్తి (యు.కె) శ్రీనివాసులుకి చచ్చిపోదామనిపించింది. ఇదివరకు ఇలా చాలాసార్లు అనిపించింది. కష్టమొచ్చినప్పుడల్లా శ్రీనివాసులు చచ్చిపోదామనుకుంటాడు. అతనికి కష్టాలు చాలాసార్లు వచ్చాయి. అందుకని చాలాసార్లు చచ్చిపోదామనుకున్నాడు. శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోయినప్పుడు, శారీరకంగా చచ్చిపోదామనుకుంటాడు. కష్టాలొచ్చినప్పుడల్లా శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోతాడు; చావు మీది కోరికని అతనికి మనస్సు నేర్పింది. శ్రీనివాసులి మనస్సుని అస్తమానం కష్టం భయపెడుతూ వుంటుంది. కష్టపెట్టే కష్టాలు భరించలేక అతని మనస్సు పరిష్కారం వెదుక్కున్నప్పుడు శ్రీనివాసులుకి ‘చావు’ సమాధానంగా నిలుస్తుంది. శ్రీనివాసులికి ఇప్పుడు బ్రతుకు చావులా […]
పరవశానికి పాత(ర) కథలు – మంచులో మనిద్దరం
రచన: డా. కె. వివేకానందమూర్తి విశాఖపట్నంలో స్టీలు ప్లాంటు తీసుకురావాలని విద్యార్థులకున్నంత గాఢంగా, విద్యార్థుల్లో క్రమశిక్షణ తీసుకురావాలని ఉపాధ్యాయులనుకున్నంత గాఢంగా – లక్ష్మీవారం నాడు లక్ష్మీకుమారి మనసులో రసభావాలు పోజిటివ్ గా తీసుకురావాలని బాలరాజు అనుకున్నాడు. అంతకు ముందే అమితమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చినా అదే బాటలో అతనిన్నాళ్ళు నడవలేదు. మనస్సుకి తెగింపు చాల్లేదు. కానీ ఉన్నట్టుండి వెళ్ళిపోయిన లక్ష్మీవారం లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్మి వందనం లక్షలకొద్దీ ప్రేమ భావాలతో లక్షణంగా తయారై వచ్చి, విశాఖపట్నం బీచ్ […]
ఇటీవలి వ్యాఖ్యలు