May 2, 2024

హిమవత్పద్యములు-2

  రచన:  జెజ్జాల కృష్ణ మోహన రావు   కందగీతి – బేసి పాదములు – తేటగీతి మొదటి మూడు గణములు, సరి పాదములు – తేటగీతి పాదము ప్రేమ యామనిన్ బెంపొందు ప్రేమ నీరామనిన్ నిండి – పెల్లుబుకును ప్రేమ శిశిరపు రంగులౌ ప్రేమ హేమంత కాలపు – వెచ్చదనము   కమలగీతి – సూ/సూ/సూ – సూ/సూ రవి వెలుంగు తగ్గె – రాత్రి హెచ్చె భువిని చెట్టులెల్ల – మ్రోడువారె దివిని పులుఁగు […]

తేనెలొలుకు తెలుగు-ఆమ్రేడిత శోభ

  రచన: తుమ్మూరి రామ్మోహనరావు     ~~~~~~~~~~~~~ “గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే ~~~~~~~~~~   ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను జ్యోతి వలబోజుగారి సందేశం రాకముందే ‘చకచకా’ వ్యాసం రాసి పంపించాలని. కాని కొంత పనుల నెపం, మరికొంత బద్ధకం.  ‘గబగబా’ ఏదో రాయటం కాదుగదా. అసలే రాసేది తేనెలొలుకు తెలుగు గురించి. తెలుగు భాష తియ్యదనం గురించి. సరే ఈసారి ఆమ్రేడితాల గురించి మాట్లాడుకుందామనిపించింది.  వేరే భాషల గురించి తెలియదు కాని […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35   విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ కీర్తనలో అన్నమయ్య వాదన బహు చిత్రవిచిత్రంగా ఉంటుంది. మనిషి యొక్క పాపపుణ్యాలకు కారణమైనది మనసు. ఆ మనస్సును నియంత్రించేది భగవంతుడే కదా!  అలాంటప్పుడు పాప పుణ్యాలను చేయించే బుద్ధిని  తప్పు మానవులది ఎలా అవుతుంది?  అందువల్ల ఆయన్నే అడగాలి. మనం చనిపోయాక మన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తునిచే            చదివించి యమధర్మరాజు శిక్షించే పద్ధతిని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. చిత్తగించండి. కీర్తన: పల్లవి: అతని నడుగవో చిత్రగుప్త […]

NALEDI – ఒక బుజ్జి ఏనుగు కథ.

రచన: చక్రధర్ ఈ ప్రపంచంలో మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు పక్షులు కీటకాలు సూక్ష్మజీవులు సముద్ర జీవులు ఉన్నాయి. దగ్గరగా ఉండి గమనిస్తే ప్రతి జీవి చేసే జీవన పోరాటం వాటి సాంఘికజీవనం ఆ జీవనంలో ఎదురయ్యే సమస్యలు శారీరక మానసిక బాధలు అన్ని అందరికీ ఒకటే. చూడటానికి భారీకాయులైనా మానసికంగా చాలా సున్నితమైన స్వభావం కలిగినవి ఏనుగులు. ఇవి శాకాహారులు. అనాదిగా మనిషితో స్నేహంగా ఉంటూ అతనికి ఎన్నో విధాల సాయపడిన జీవులు. ముఖ్యంగా […]

నడక-నడత

రచన: శారదాప్రసాద్ ఈ రోజుల్లో ప్రతివారూ నడకను గురించి మాట్లాడేవాళ్లే! సాధారణ నడక చాలని నా అభిప్రాయం. బజార్ కెళ్ళి మన పనులు మనం చేసుకుంటే చాలు. అతిగా నడవటం వలన అనర్ధకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గుండెను వేగంగా పరిగెత్తిస్తుంటారు. ఈ నడక పిచ్చివాళ్లల్లో విపరీతమైన పోటీ కూడా ఉంటుంది . నేను 10 రౌండ్లు వేశానని ఒకాయన అంటే మరొకాయన నేను 12 వేసాను అంటాడు! ఇంతకీ ఆ రౌండ్స్ ఏమిటో? నడక పూర్తి […]

యోగాసనాలు 1

రచన: రమా శాండిల్య హరి ఓం మిత్రులందరికీ శుభోదయ వందనం ఈ రోజు నుంచి యోగాను గురించి తెలుసుకొందాం యోగా అనగానే అందరికీ ఆసనంలో కూర్చోడం అనుకుంటాము. కదలకుండా ఒక చోట కూర్చోవడం అనుకుంటాము కానీ మా గురుదేవులు యోగా అంటే ఒక క్రొత్త అర్థం చెప్పారండి. యోగా అంటే యోగం అంటే మహర్జతకం అని అర్థంట. అందుకే ప్రతి వారు రోజులో కొంత సమయం ఆ యోగాన్ని అనుభవించి తెలుసుకోవాలని అనేవారు. కొంత సమయం యోగా […]

గుండె గొంతుకు…

రచన: కృష్ణ అశోక్   గొంతు మింగుడు పడటంలేదు.. నోటిదాకా చేరని ఓ అన్నం ముద్ద పిడికిలిలోనే ఉండిపోయి మెల్లగా ఎండిపోతుంది.. ఎండిపోతున్న ఒక్కో మెతుకు తనలోని తడి ఉనికిని కోల్పోయి పిడికిలిని వీడి ఆకాశంలోకి ఆవిరై రాలిపోతుంది.. కొన్ని ఇమడలేని మెతుకులు కూడా ఒకటొకటి గాలి చాలకో ఊపిరాడకో వాంతి అయిపోయినట్టు పిడికిలి దాటి జారిపోతున్నాయి… గొంతు ఇంకా గింజుకుంటూనే ఉంది మింగుడుపడే మార్గంకోసము.. గరగరా శబ్దం చేస్తూ కిందమీద పడుతూనేవుంది… పిడికిలి ముద్దనుండి రాలిపోగా […]

క్షణికానందం….

రచన:శ్రీకాంత  గుమ్ములూరి.   మిట్ట మధ్యాహ్నం దారి తప్పిన రోడ్డులో నడినెత్తిన మండుతున్న ఎండలో నడుస్తున్నా  తీరు తెన్ను లెరుగని దిశలో చుట్టూ కాంక్రీట్ జంగిల్ పచ్చదనం కరువైన బాట సిమెంట్ మయమైన చోట రెండు గోడల ఇరుకులో నన్నే చూడమని పిలిచింది కన్నులని ఆకట్టుకుంది వేలెడైనా లేదు కానీ నిటారుగా నిలిచింది! ఒంటరి దాన్నే కానీ నాకూ ఒక గుర్తింపు కావాలంది! నేనందుకు తగనా అని నిలదీసింది! తలెత్తి చూస్తే మేడమీద అందంగా, దూరంగా, బాల్కనీలో […]