May 21, 2024

తొలగిన మబ్బులు (తరాలు – అంతరాలు)

రచన:నాగలక్ష్మి కర్ర ఆగకుండా మోగుతున్న డోరు బెల్లు శబ్దానికి నిద్రా భంగం కలిగిన మహేందర్ వీధి తలుపు వైపు నడిచేడు. హాలులోని గడియారం సమయం ఆరు చూపిస్తోంది. యీవేళప్పుడు యెవరొచ్చేరో అనుకుంటూ తలుపు తీసేడు. ఎదురుగా శివాని … చేతి మీద గిల్లుకు చూసుకున్నాడు. అమ్మో నొప్పి అంటే తను కలగనటం లేదు నిజంగానే శివానీ వచ్చింది. తన జీవితం, తన సర్వస్వం. పది సంవత్సరాలు ప్రేమించుకొని మూడు ముళ్ళతో యేకమై, ఏడాది తిరగకుండా తూ…తూ…….. మై……..మై……. […]

ఇదో పెళ్లి కథ (తరాలు – అంతరాలు)

– డా ॥ గురజాడ శోభా పీరిందేవి పెళ్లి హాల్ అత్యంత ఆధునికంగా,అట్టహాసంగా వెలిగిపోతోంది . లైట్ల తోరణాలు, పూలపందిళ్ళు నయనానందాన్ని కలిగిస్తూ కట్టి పడేస్తున్నాయి ఆ అందాన్ని వైభవాన్ని తిలకించాలని సూరీడు తెగ ఆరాటపడుతూ తూర్పు తలుపు తీసుకుని వొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు . ఆయన వొస్తే తమకి చూసే చాన్స్ పోతుందని మబ్బుల గుంపులు అడ్డుకుంటూ వున్నాయి అయినా వొస్తానంటున్న సూరీడు మీద ఆగ్రహం వొలక బోస్తూ వురుముతున్నాయి . వారిద్దరి మధ్యా నిశ్శబ్ద […]

గెలుపు కోసం

రచన: స్వాతీ శ్రీపాద ప్రియాతి ప్రియమైన ప్రియా ఆశ్చర్యపోతున్నావా? మూడు ముళ్ళువేసి మూడున్నర గంటలు దాటలేదు, అప్పుడే ఇంత ప్రియాతి ప్రియమైన దానను అయిపోయానా అని. సంవత్సరాలు నెలలు గంటలు ఎందుకు ప్రియా, మూడు క్షణాలు చాలదూ… ఎక్కడో తప్పిపోయిన ఆత్మను వెతుక్కునేందుకు? నువ్వు మధుప్రియవే కావచ్చు ఎవరికైనా, మధు కావచ్చు కానీ నా ఒక్కడికి మాత్రం ప్రియవు. ఇవి పెదవుల చివర తేనె రాసుకుని పలుకుతున్న చిలకపలుకులు కావు. తొలిచూపు ప్రేమ పైత్యమా అంటావేమో, కాదు […]

శంభునటనము

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు మొట్ట మొదట – పతంజలి, శివుని వాహనమైన నంది – వీరిరువరికి సంబంధించిన ఒక చాటుకథను చెప్పాలి. పతంజలి యోగశాస్త్రమును రచించిన మహాముని. అతనికి ఒకనాడు పరమేశ్వరుని సందర్శించాలనే అభిలాష కలిగినది. కైలాస ద్వారమునకు వెళ్లాడు. ఎవరు ఈశ్వరుని చూడవలయు నన్నను, నంది అనుమతి తీసికొని వెళ్ళవలసినదే. నేటి పరిభాషలో నంది ఈశ్వరునికి పీ. ఏ. అన్న మాట. ఎందుకో గాని ఆ రోజు నంది పతంజలికి శివుని దర్శనానికి […]

మలయ సమీరం

రచన: శారదా మురళి “పొద్దుణ్ణించీ వెతుకుతున్నా కనబడడం లేదు రేషన్ కార్డు. జాగ్రత్తగా బీరువాలో పెట్టమని వసూ చేతికిస్తే, ఎక్కడ పెట్టిందో ఏమో,” చిరాగ్గా బీరువాలోంచి బట్టలన్నీ బయటకి తీసి కుప్పపోస్తూ అనుకున్నాడు శ్రీధర్. వసూ చీరల మధ్య చిన్న చెక్క డబ్బా చూసి వెతుకుతున్న పని ఆపి ఆశ్చర్యంగా డబ్బా తెరిచాడు. ఒక్క నిమిషం తను చూస్తున్నదేమిటీ అర్థం కాలేదు అతనికి. ఎర్రని క్రికెట్ బంతి, డబ్బాలో చిన్న రుమాలులో చుట్టి. ఇది తనదే కానీ, […]

ఆత్మకు వినబడే పాట

రచన: రామా చంద్రమౌళి చిత్రం: చిత్ర ఆర్టిస్ట్ పాట చాలాసార్లు నిశ్శబ్దంగానే ఉంటుంది వినబడ్తుంది ఎవరికి వారికే..ఆత్మకు కళ్ళు మూసుకుని నిన్ను నువ్వు కోల్పోతున్నపుడో నిద్రపట్టని రాత్రి ఎండుటాకువై కొట్టుకుపోతున్నపుడో ఒట్టి శూన్య దృక్కులతో వాన చినుకుల్లోకి చూస్తున్నపుడో నగ్నమైన పాట నీకు మాత్రమే వినబడే ఒక ఏక్ తార ధ్వనిగానో ఒక తెగి అతుకుతూ గాలిలో తేలివచ్చే వేణుగానంగానో ఒక ఆకు రాలుతున్న చప్పుడుగానో ఏ భాషకూ అందని దుఃఖ సారంగీ జీరగానో – తొంగి […]

భ్రమర వ్యసనం

రచన: జయశ్రీ నాయుడు వ్యసనాలు విచిత్రమైనవి హషిష్ కన్నా గాఢంగా హత్తుకుపోతాయి ఆలోచనల్లోకి కూరుకుపోయి మెదడు నుండి హృదయానికి అలసట లేక ప్రవహించే మోహతరంగాల వెన్నెల సంద్రం అమావాస్యలున్నా పున్నములే అక్కడ పదిలమవుతాయి నిజమిదే అని నిర్ధారించేలోగా అబద్ధం ఉల్లిపొరల్లోని ఘాటులా ప్రశ్నార్థకపు సెగలు నింపుతుంది వాస్తవం స్పృశించేలోగా మిథ్యా మారుతం చుట్టేస్తుంది ఎన్ని కాలాలు గ్రంధస్థమైనా లిపి లేని ఘడియలకు ప్రాణం పోసి పదిలం చెయ్యడమూ ఒక వ్యసనమే కోల్పోయిన ఆత్మీయతల ఆలంబనలు ఋతువుల్లా తిరిగొస్తాయన్న […]