April 30, 2024

ఆత్మకు వినబడే పాట

రచన: రామా చంద్రమౌళి చిత్రం: చిత్ర ఆర్టిస్ట్ పాట చాలాసార్లు నిశ్శబ్దంగానే ఉంటుంది వినబడ్తుంది ఎవరికి వారికే..ఆత్మకు కళ్ళు మూసుకుని నిన్ను నువ్వు కోల్పోతున్నపుడో నిద్రపట్టని రాత్రి ఎండుటాకువై కొట్టుకుపోతున్నపుడో ఒట్టి శూన్య దృక్కులతో వాన చినుకుల్లోకి చూస్తున్నపుడో నగ్నమైన పాట నీకు మాత్రమే వినబడే ఒక ఏక్ తార ధ్వనిగానో ఒక తెగి అతుకుతూ గాలిలో తేలివచ్చే వేణుగానంగానో ఒక ఆకు రాలుతున్న చప్పుడుగానో ఏ భాషకూ అందని దుఃఖ సారంగీ జీరగానో – తొంగి […]

భ్రమర వ్యసనం

రచన: జయశ్రీ నాయుడు వ్యసనాలు విచిత్రమైనవి హషిష్ కన్నా గాఢంగా హత్తుకుపోతాయి ఆలోచనల్లోకి కూరుకుపోయి మెదడు నుండి హృదయానికి అలసట లేక ప్రవహించే మోహతరంగాల వెన్నెల సంద్రం అమావాస్యలున్నా పున్నములే అక్కడ పదిలమవుతాయి నిజమిదే అని నిర్ధారించేలోగా అబద్ధం ఉల్లిపొరల్లోని ఘాటులా ప్రశ్నార్థకపు సెగలు నింపుతుంది వాస్తవం స్పృశించేలోగా మిథ్యా మారుతం చుట్టేస్తుంది ఎన్ని కాలాలు గ్రంధస్థమైనా లిపి లేని ఘడియలకు ప్రాణం పోసి పదిలం చెయ్యడమూ ఒక వ్యసనమే కోల్పోయిన ఆత్మీయతల ఆలంబనలు ఋతువుల్లా తిరిగొస్తాయన్న […]

చిగురాకు రెపరెపలు-9:

రచన: మన్నెం శారద నర్సీపట్నం వెళ్ళాం. పెద్ద పచ్చిక బయలులో వుంది పెదనాన్న క్వార్టర్సు. కాంపౌండు వాల్స్ లేవు. అక్కడక్కడా పెద్ద పెద్ద చెట్లు. అన్నిటికన్నా పెద్ద ఆకర్షణ పెదనాన్నకి అడవిలోకి వెళ్ళడానికి ఏనుగు నిచ్చేరు. క్వార్టర్సు ఎదురుగానే ఏనుగుశాల వుండేది. రోజూ రెండుపూటలా దానికి ఆహారం పెట్టడానికి మా ఇంటికి తీసుకొచ్చేవారు. ఇక మా పిల్లల సందడి అంతా యింతా కాదు. ఏనుగుని అదివరకు సర్కస్ లోనే చూడటం! ఇప్పుడది మా యింటికొచ్చింది! అంత పెద్ద […]

కళ్యాణి రాగం

రచన: విశాలి పెరి కల్యాణి రాగము / మేచకల్యాణి రాగము కర్ణాటక సంగీతంలో 65వ మేళకర్త రాగము. ఇది అతి ప్రాచీన రాగము, ఇది ప్రతి మధ్యమ రాగములలో ‘రాణి ‘ వంటిది. ఇది రుద్ర అను చక్రములో ఐదవ రాగము. ఈ రాగము పూర్వము కళ్యాణి గా పిలువబడేది. కటపయాది సంఖ్య లో ఇముడుట కొరకు “మేచ” అను పదమును “కల్యాణి” యందు అమర్చిరి. ఇది 29వ మేళకర్త రాగమైన ‘ధీరశంకరాభరణం ‘ యొక్క ప్రతి […]

మన వాగ్గేయకారులు – (భాగము – 4)

రచన: సిరి వడ్డే శ్రీ శ్యామశాస్త్రి : కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకార త్రయంలో శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల సరసన నిలిచే తెలుగు పెద్దలలో శ్రీ శ్యామశాస్త్రి ప్రముఖులు. శ్రీ శ్యామశాస్త్రి వయస్సులో వారిద్దరికన్నా పెద్దవారు. శ్యామశాస్త్రి గారి తండ్రి శ్రీ విశ్వనాథ శాస్త్రి, ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయులు. అయితే, 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి గారి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. […]

మాయానగరం – 19

రచన: భువనచంద్ర ఉపన్యాసాలు రకరకాలు. ఊకదంపుడివి కొన్నైతే, ఉత్తేజాన్ని కలిగించేవి కొన్ని. కొన్ని వినోదప్రదానంగా సాగుతాయి. వాటిలో’విషయం ‘ ఉండదు. కానీ వినే జనాలు మాత్రం ఆనందిస్తారు. జిడ్డు ఉపన్యాసాలు ఓ రకం. వీటిల్లో వ్యక్త మాటిమాటికి ‘ఊత ‘ పదాన్ని వాడుతూ వుంటాడు. వీటిని జనాలు ఎంజాయ్ చేస్తారు…. ఎందుకంటే కొంతమంది ఊతపదాన్ని ప్రసంగం మొత్తంలో ఎన్నిసార్లు వాడాడో లెక్కవేయడం ద్వారా. వాళ్ళ ద్యాస అంతా ఊతపదం మీదే తప్ప ఉపన్యాసం మీద వుండదు. కొందరి […]

శుభోదయం 3

రచన: డి.కామేశ్వరి రాధాదేవి, శ్యాం ఆస్పత్రి చేరేసరికి ఊరు ఊరంతా అక్కడే వుందా అన్నట్టు గుంపులు గుంపులుగా ఎన్నో వందలమంది ఆస్పత్రి దగ్గిర గుమిగూడారు. పేపర్లో వార్త చదివి, కబురు ఈ నోటా, ఆ నోటా విని రేఖ కాలేజీలో ఆడపిల్లలంతా వచ్చారు. ఆడపిల్లలే కాదు ఎంతోమంది విద్యార్తులూ వున్నారు. అమ్మాయిల అందరి కళ్లల్లో బెదురు, భయం, రేఖపట్ల జాలి. అంతా గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. గేటు దగ్గిర కాపలాదారు వాళ్లని లోపలికి వదలడంలేదు. రేఖ చాలా […]