April 26, 2024

కంభంపాటి కథలు – పని మనిషి

రచన: రవీంద్ర కంభంపాటి   ‘హరిణీ .. ఇంకా ఎంత సేపు?.. మీ ఆఫీసుకి టైమవుతూంది .. మొదటి రోజే లేటుగా వెళ్తే బావుండదు ‘ అని కవిత గట్టిగా అరిస్తే , ఏ బదులూ రాలేదు హరిణి గదిలోంచి ‘లేచినట్టే లేచి ..మళ్ళీ నిద్రపోయిందేమో ?’ డైనింగ్ టేబుల్ దగ్గిర  పేపర్ చదువుకుంటూ అన్నాడు మూర్తి ‘ఏమో .. ఎప్పుడు చూసినా ఆ తలుపేసుకునే ఉంటుంది .. ఇంట్లో మనిషి లాగ కాక , ఏదో […]

కంభంపాటి కథలు – Some బంధం

రచన: రవీంద్ర కంభంపాటి ‘ఇదిగో. ఇలా ఓసారి రండి ‘ పిల్చింది మా ఆవిడ హాల్లో కూచుని టీ తాగుతూ టీవీ చూస్తున్న నేను , ‘ఏమైంది ?’ అన్నాను కదలకుండా ‘ఏమిటో చెబితే గానీ రారా ఏమిటి ?.. వెంటనే రండీ ‘ అంది ‘ఆ బాల్కనీలో కూచుని వీళ్ళనీ వాళ్ళనీ చూడకపోయేబదులు నువ్వే రావచ్చుగా ‘ అన్నాన్నేను (నేనెందుకు మెట్టు దిగాలి అనుకుంటూ ) ‘సరే. మీ ఇష్టం. కార్తీక ఫేస్బుక్ లో కొత్త […]

కంభంపాటి కథలు – ఎందుకేడుస్తున్నానంటే .. అనే అడల్ట్ కధ

రచన: రవీంద్ర కంభంపాటి ఉదయాన్నే బయటికొచ్చి తలుపు గొళ్ళేనికి తగిలించిన బ్యాగులోంచి పాల ప్యాకెట్లు తీసుకుంటున్న ఆనంద్ కి ఎదురింట్లో ఉండే గోవర్ధన్ గారు పొట్ట కిందకి జారిపోతున్న లాగుని ఓ చేత్తో పైకి లాక్కుంటూ , ఇంకో చేత్తో ముక్కులో వేలెట్టుకుని కెలుక్కుంటూ కనపడ్డాడు . ‘ఛీ .. ఉదయాన్నే వెధవ శకునం ‘ అనుకుంటూ తలుపేసుకుని లోపలికెళ్ళి, ఇంకా నిద్దరోతున్న భార్య మీనాక్షి ని లేపితే , ‘అబ్బా .. మీరే కాఫీ పెట్టుకోండి […]

కంభంపాటి కథలు – దేవతలాంటి నిన్ను…

రచన: రవీంద్ర కంభంపాటి డోర్ బెల్ రింగైన వెంటనే పరిగెత్తుకెళ్లి తలుపు తీసింది శిరీష. తలుపు బయట నుంచున్న దేవిని చూసి, ‘అయ్యో.. నీకు వొంట్లో బాగోలేదని మీ అమ్మ ఫోన్ చేసింది.. ఇవాళ పన్లోకి రావనుకున్నానే ?’ అంది ‘ఆఁ.. ఏదో కొంచెం జొరంగా అనిపించి మా అమ్మకి చెబితే, వెంటనే మీకు ఫోన్ చేసేసిందమ్మా.. కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని వచ్చేసేను ‘ అంటూ లోపలికెళ్ళిపోయింది. దేవి వెనక్కాలే కిచెన్ లోకి నడుస్తూ […]

కంభంపాటి కథలు – రంగు పడింది.

కంభంపాటి రవీంద్ర నందగోపాల్ గారికి ఉదయాన్నే, అంటే సూర్యుడు తన చిరు వెలుగుల్ని ప్రసరించకుండానే లాంటి మాటలెందుకులెండి గానీ, సూర్యుడు డ్యూటీలోకి దిగకముందే వాకింగ్ కి వెళ్లడం చాలా ఇష్టం. ఈ మధ్యనే రిటైర్ అయ్యేరేమో, ఖాళీగా ఉండడం ఇష్టం లేక, వాళ్ళ అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ బాధ్యత తీసుకున్నారు. ఈ పదవి తీసుకోకముందు ఏదో తన మానాన తాను ఓ గంటసేపు అందరినీ పలకరించుకుంటూ వాకింగ్ చేసుకునొచ్చేసేవారు. ఇప్పుడు ఆ పలకరింపులు కాస్తా, ఫిర్యాదులయ్యేయి. ఇంతకు […]

కంభంపాటి కథలు – కారులో షికారుకెళ్లే

రచన: కంభంపాటి రవీంద్ర     “చూసేరా ..మన ఎదురు ఫ్లాట్ లోని ఆనంద్ వాళ్ళావిడికి  కార్  కొన్నాడట”  అప్పుడే తలుపు తీసి లోపలికి వస్తూన్న జగన్నాధ్ తో కుమారి అంది “ఇంట్లోకి వస్తూనే మొదలెట్టేసేవా?.. వెధవ గొడవ .. ఇంటికి రావాలంటేనే భయమేస్తూంది” అంటూ జగన్నాధ్ విసుక్కున్నాడు “ మీకు ఇంటికి రావాలంటే భయమేస్తూంటే , నాకు ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తూంది”   బదులిచ్చింది కుమారి “ అంతేలే.. నేను పోతే తప్ప నీకు ప్రశాంతత దొరకదు.. […]

కంభంపాటి కథలు – ఆవే పులి

రచన: కంభంపాటి రవీంద్ర ఆ రోజు మధ్యాహ్నం టీ తాగుతూ, టీవీ చూస్తున్న హైందవికి భర్త నుంచి వాట్సాప్ లో వీడియో కాల్ వచ్చింది, ఎవరా అని చూసేసరికి , భర్త గోవర్ధన్ . ‘ఏమిటండీ ఇప్పుడు ఫోన్ చేసేరు?’ అని అడిగితే ‘ప్రణతి స్కూల్ నుంచి జాగ్రత్తగా వచ్చిందా ?’ అని అడిగేడు . ‘ఆ ..వచ్చింది .. బ్యాగు హాల్లో పడేసి దాని గదిలోకెళ్ళిపోయింది ‘ అంది హైందవి ‘ఏం .. ఏవైంది ? […]

కంభంపాటి కథలు.. ‘జానకి’ ఫోన్’ తీసింది

రచన: కంభంపాటి రవీంద్ర ఫోను ఒకటే బీప్ బీప్ మని శబ్దం చేస్తూండడంతో బద్ధకంగా లేచింది భార్గవి . అప్పటికే ఉదయం ఎనిమిదయ్యింది. ఫోన్లో వాట్సాప్ చూసేసరికి అప్పటికే ఇరవైకి పైగా మెసేజీలున్నాయి, జానకి పీఎం అనే గ్రూపులో ! ఛటుక్కున ఆ గ్రూప్ ఓపెన్ చేసేసరికి , ఒకటే చర్చ నడుస్తూంది . ఇంకా జానకి రాలేదు .. ఫోన్ కూడా తియ్యడం లేదు .. అంటే ఇవాళ డుమ్మా కొట్టేసినట్లే అనుకుంటూ ! వంద […]

కంభంపాటి కధలు – ఎన్ని’కులం’

రచన: కంభంపాటి రవీంద్ర ఉదయాన్నే ఏడున్నరకి నోటీసు బోర్డులో ఏదో నోటీసు అంటిస్తున్న అపార్ట్మెంట్ సెక్రటరీ నరహరి గారిని చూసి, బేస్ మెంటులో వాకింగ్ చేస్తున్న వరాహమూర్తిగారు ఆసక్తిగా వచ్చి ‘ఏమిటండీ ..ఏదో అంటిస్తున్నారు ? ‘ అని అడిగితే ‘ఇక్కడేమీ కొంపలు అంటించడం లేదు లెండి .. జస్ట్ కాయితాన్నే అంటిస్తున్నాను .. అదీ నోటీసు బోర్డులో ‘ అని తనేసిన జోకుకి తనే గెట్టిగా నవ్వేసుకుంటూ వెళ్ళిపోయేడు నరహరి. ఒళ్ళు మండి ‘ఇప్పుడీ నోటీసు […]

కంభంపాటి కథలు-2 – ‘చుట్ట’పు చూపు

రచన: కంభంపాటి రవీంద్ర ‘పూర్వం రోజుల్లో మా అక్కా వాళ్ళ కుటుంబం శెలవులకి హైదరాబాద్ వచ్చినప్పుడు అందరం కలిసి భలే సరదాగా గడిపేవాళ్ళం కదండీ. ఇల్లంతా చాలా సందడిగా ఉండేది’ అంది రాధిక. ఆఫీసు నుంచొచ్చి బాత్రూంలో కాళ్ళూచేతులూ కడుక్కుంటున్న వాళ్ళాయన శ్రీధర్ ’మీ అక్కా వాళ్ళు గుర్తొస్తున్నారా? ఈ ఏడాది శెలవులకి వాళ్ళని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయాల్సింది. ఇప్పటికైనా ఏమొచ్చింది. వాళ్ళకోసారి ఫోన్ చేసి పిలవొచ్చుగా ?. వద్దులే. మీ బావగారికి నేనే ఫోన్ […]