May 5, 2024

లేలేత స్వప్నం

రచన: రామా చంద్రమౌళి   ఆమె లీలావతి – పదవ తరగతి అప్పటిదాకా ‘లీలావతి గణితం’ చదువుతోంది.. అన్నీ లెక్కలు కాలం – దూరం, కాలం – పని, ఘాతంకముల న్యాయం చకచకా ఒక కాగితం తీసుకుని రాయడం మొదలెట్టింది పెన్సిల్ తో బయట ఒకటే వర్షం.. చిక్కగా చీకటి 2 చెత్త.. తడి చెత్త.. పొడి చెత్త ఆకుపచ్చ.. నీలి ప్లాస్టిక్ టబ్స్ ” ఐతే చెత్త ఎప్పుడూ పదార్థ రూపం లోనే ఉండదు చెత్త […]

నదుల తీరాలపైననే నాగరికతలన్నీ

రచన: రామా చంద్రమౌళి     నాగరికతలన్నీ నదుల తీరాలపైననే పుట్టినపుడు మనిషి తెలుసుకున్న పరమ సత్యం .. ‘ కడుక్కోవడం ‘ .. ‘ శుభ్రపర్చుకోవడం ‘ ఒంటికంటిన బురదను కడుక్కోవడం , మనసుకంటిన మలినాన్ని కడుక్కోవడం చేతులకూ, కాళ్ళకూ.. చివరికి కావాలనే హృదయానికి పూసుకున్న మకిలిని కడుక్కోవడం కడుక్కోవడంకోసం ఒకటే పరుగు కడుక్కోడానికి దోసెడు నీళ్ళు కావాలి .. ఒక్కోసారి కడవెడు కావాలి మనిషి లోలోపలి శరీరాంతర్భాగమంతా బురదే ఐనప్పుడు కడుక్కోడానికి ఒక నదే […]

ఒక ప్రాతః వేళ

రచన: రామా చంద్రమౌళి ఒక సీతాకోక చిలుక వచ్చి భుజంపై వాలినట్టనిపించి చటుక్కున మెలకువ వస్తుంది నిజానికి ప్రతిరాత్రీ నిద్రపోవడం ఎంత చిత్రమో మర్నాడు మనిషి మేల్కొనడం అంతకన్నా విచిత్రం జీవించీ జీవించీ అలసి రాతిశరీరాలతో తిరిగొచ్చిన తర్వాత ఏమి కనిపిస్తాయి .. అన్నీ ఖండిత స్వప్నాలు .. రక్త రేకులు తప్పితే ఎవరో తరుముతున్నట్టు ఎవరో ప్రశ్నిస్తున్నట్టు ఎవరో లోపల నిలబడి గునపంతో తవ్వుతున్నట్టనిపిస్తున్నపుడు కళ్ళుమూసుకుని మాంసవిగ్రహమై నిద్ర మోసుకొచ్చే రాత్రికోసం నిరీక్షణ తనకోసం తను […]