April 27, 2024

డయాస్పోరా జీవన కథనం – పితృత్వం

రచన : కోసూరి ఉమాభారతి అహ్మదాబాద్ నుండి శారద ఢిల్లీ పయనమైంది. ఆమె కొడుకు అనిల్ ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్’ (AIIMS) నుండి ఉత్తీర్ణుడవుతున్న సందర్బంగా… స్నాతకోత్సవానికి హాజరవ్వనుంది. తన భర్త ఆశించినట్టుగా సేవా దృక్పధంతో వైద్య వృత్తిని చేపట్టబోతున్న కొడుకుని చూసి గర్వపడుతుంది శారద. ఉత్సాహంగానే ఉన్నా, ఏడాది క్రితం ఆకస్మికంగా సంభవించిన భర్త మరణం ఆమెని కృంగదీస్తుంది. ** స్నాతకోత్సవం తరువాత జరిగిన తేనేటి విందులో… క్లాస్-మేట్ పూనమ్ ఖత్రి […]

కథ విందువా … నా మనసుకథ విందువా…

రచన: కోసూరి ఉమాభారతి వెన్నెల ఆకస్మిక మరణం, ఆమె నుండి అందిన ఉత్తరంలోని సారాంశం… అమ్మాపిన్ని శారదని విపరీతంగా కృంగదీశాయి. వారం రోజులుగా నిద్రాహారాలు మాని, మాటాపలుకు లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయిన ఆమెని…. తమకి యేళ్లుగా తెలిసిన డాక్టర్. వాణి మీనన్ వద్దకు బలవంతంగా తీసుకుని వెళ్లారు ఆమె భర్త రామ్, కొడుకు సాయి. విషయం వివరించి, చనిపోయేముందు వెన్నెల… శారదకి రాసిన ఉత్తరాన్ని కూడా డాక్టర్ చేతిలో పెట్టారు. *** ఆ ఉత్తరాన్ని ఒకటికి రెండుమార్లు […]

రాజీపడిన బంధం – 14

రచన: ఉమాభారతి కోసూరి ఆరేళ్ళ తరువాత పొద్దునే పిల్లలకి టిఫిన్లు వడ్డిస్తుండగా, టీ.వి న్యూస్ ఛానల్ చూడమని ఫోన్ చేసింది చిత్ర. టీవి ఆన్ చేసాను. క్రీడారంగం వార్తలు చెబుతున్నారు… ‘…ఢిల్లీ స్విమ్మింగ్ కమిషన్ వారు, సందీప్ మధురై అనే యువ స్విమ్మర్ ని నేషనల్ జూనియర్ స్విమ్ టీమ్ కి కెప్టెన్ గా సెలెక్ట్ చేసారు. పదహారేళ్ళ వయసులో అంతటి గుర్తింపు అనూహ్యమైనదే’. ‘అంతే కాదు, ఈ యువ ఈతగాడు ఒకప్పటి ప్రఖ్యాత క్రీడాకారుడు శ్యాంప్రసాద్ […]

రాజీపడిన బంధం –13

రచన: కోసూరి ఉమాభారతి కార్ పార్క్ చేసి, “పదమ్మా” అంటూ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ వైపు నడిచారు ఆనంద్. గజిబిజిగా అయిపోయిన మనస్సు, తడబడుతున్న కాళ్ళు, నీరసించిపోతున్న ఆలోచనలని కూడదీసుకొని పరుగులాంటి నడకతో అనుసరించాను. మా కోసమే ఎదురు చూస్తున్న శ్యాం, చిత్ర మమ్మల్ని వెంటనే డాక్టర్ ఆఫీస్ లోకి తీసుకొని వెళ్లారు. అందరం ఆదుర్దాగా డాక్టర్ ఎదురుగా కూర్చున్నాము. డా. విద్య ఎక్సరేలని తదేకంగా చూస్తుంది. ఇక ఉండలేక, “నా సందీప్ కి ఏమయ్యిందో చెప్పండి […]

రాజీపడిన బంధం – 11

రచన: ఉమాభారతి కోసూరి ఉన్నట్టుండి అర్ధమయింది. నాకు ఇలా సీమంతం కూడా ప్లాన్ చేసింది చిత్ర అని. చిత్ర, రమణిల వంక చూసాను. చిరునవ్వులే జవాబుగా నన్ను నడిపించుకుని లోపలి వరకు తీసుకువెళ్ళారు. శ్యాం, ఆనంద్, నాన్నగారు, మామయ్య కూడా కాస్త ఎడంగా నిలబడి ఉన్నారు. దూరం నుండే వారికి రమణి నమస్కారాలు తెలిపింది…. ** అంతా కలిసి నా ‘సీమంతం’ నిర్వహించారు. పద్ధతిగా, గాజులు వేయించారు. అమ్మ, అత్తయ్య, మిగతా పెద్దవాళ్ళ నుండి ఆశీర్వాదాలు కూడా […]

రాజీపడిన బంధం – 9

రచన: ఉమాభారతి కోసూరి “మమ్మీ మమ్మీ” అంటూ సందీప్ నన్ను తట్టి లేపుతున్నట్టయింది. కలలోలా మగతగా కళ్ళు తెరిచాను. కల కాదు, నిజంగానే సందీప్ తన చేతులతో నన్ను తడుతున్నాడు. వాడి వెనుక చిత్ర నిలబడుంది. సందీప్ ని చూసిన సంతోషంతో … నా కళ్ళ వెంట ఆగని కన్నీరు చూసిన చిత్ర కళ్ళు కూడా చమర్చాయి. ఆ క్షణాన నా స్నేహితురాలు నా పాలిట దేవతలా అనిపించింది. సందీప్ ని రెండురోజులు తన దగ్గరే ఉంచుకుంటానంటే […]

రాజీపడిన బంధం – 8

రచన: ఉమాభారతి “చెప్పానుగా, సందీప్ ని చూసుకోడానికే నాకు సమయం చాలదు. వారానికో మారు ఇక్కడ స్థానిక పశు సంరక్షణ సంస్థ పని కూడా చూస్తాను. మొత్తానికి అలిసిపోయాను. అదీగాక, మా ఆయనతో నాకు పెద్దగా సఖ్యత కూడా లేదులే. నేనిప్పుడున్న పరిస్థితిలో మరో బిడ్డ అంటే, నాకు ఆసక్తిగా లేదు. అంతకంటే విషయమేమీ లేదు” అన్నాను. చిత్రకి సమాధానం సంతృప్తికరంగానే ఇచ్చాననిపించింది. “బిడ్డని వద్దనుకున్నంత మాత్రాన నీ చింతలు, బాధ్యతలు పోవు. పైగా ఆ బిడ్డే […]

రాజీపడిన బంధం – 7

రచన: ఉమాభారతి ఎంతసేపు పడుకొన్నానో! కళ్ళు తెరిచి చూస్తే, టైమ్ సాయంత్రం ఆరు గంటలయ్యింది. వొళ్ళు తెలియకుండా నిద్రపోయానన్నమాట. ఈ పాటికి సందీప్ స్నేహితులంతా ఇళ్ళకి వెళ్లిపోయుంటారు. లేచి చన్నీళ్ళతో మొహం కడుక్కొని గది నుండి బయటకి వస్తుంటే, సందీప్ కేకలు వినబడుతున్నాయి. చీర సరిచేసుకొని అటుగా వెళుతుంటే సందీప్ అరుపులు, ఏడుపు మరింత బిగ్గరగా వినిపించాయి. “జానకీ, వెళ్లి అమ్మని తీసుకురావే” అంటున్నారు అత్తయ్య. “ఏరా శ్యాం, ఇందాకటి వరకు బాబుతో అక్కడే ఉన్నావుగా! వాడే […]

రాజీపడిన బంధం – 6

రచన: కోసూరి ఉమాభారతి “అల్లుడు శ్యాంప్రసాద్ చిన్నప్పటి నుండీ కూడా గొప్ప క్రీడాకారుడు కదా…. అలా ఆటల్లో ఎదుటివాడిని ఓడించి, తను గెలవడమే ధ్యేయంగా జీవిస్తారు కదా క్రీడాకారులు. దుర్గాప్రసాద్ చెప్పంగా శ్యాం, వాళ్ళ నాన్న కూడా అలాగే ఉండేవారంట. శ్యాం ఎందులోనూ ఓటమి ఎరుగడట. అతని చదువు కూడా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ తోనే అయిందట” క్షణమాగారు.. నాన్న చెప్పేది మౌనంగా వింటున్నాను. “దుర్గాప్రసాద్ చెప్పినదాన్ని బట్టి అల్లుడుగారి బాల్యం, పెంపకం, వ్యక్తిత్వం పై నాకు కొంత […]

రాజీపడిన బంధం – 5

రచన: ఉమాభారతి కోసూరి సందీప్, శ్యాంల కోసం నా ఈ నిరీక్షణ క్షణం ఓ యుగంలా గడుస్తుందా అనిపిస్తుంది. ఆదుర్దాతో తలనొప్పిగా అనిపిస్తే….. కాసేపు కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అలా గంటకి పైగా సమయం గడిచాక, బాబుని భుజాల మీద ఎక్కించుకొని, విజయ్ చేయి పుచ్చుకొని తిరిగి వస్తున్న శ్యాంని చూసాక గాని మనసు కుదుట పడలేదు.. దగ్గరగా వచ్చాక, “వీడు తమరి లాగానే సుకుమారం, నడవలేక ఒకటే ఏడుపు. నా భుజాల మీదే స్వారి” అంటూ […]