April 26, 2024

కాముని పున్నమి

రచన: లక్ష్మీదేవి ఫాల్గుణ పూర్ణిమ నాటికి పువ్వుల రంగులతో చిగుళ్ళ ఎఱుపుతో వెన్నెల నిండిన నింగీ నేలా వసంతాలాడు కుంటుంటాయి. ఫాల్గుణాలలో తెలివెన్నెలలు కురిసే కామునిపున్నమి (హోళీ) ఆమని రంగిలి శోభించడానికి ముందుమాట/ స్వాగత గీతం వంటిదే. నిండుగా పూచిన వేప , మామిడి, కానుగ అనేముంది, తరువులన్నీ, తనువులన్నీ పూలగుచ్ఛాలై శుభాకాంక్షలు అంది పుచ్చుకుంటుంటాయి. సంజె వేళల్లో వీచే ఆహ్లాదకరమైన పిల్లగాలుల వేణునాదాలకు మదిలోని తలపులు పదాలు పలుకుతుంటే పెదాలు ఒద్దికగా ఒదిగిపోతూ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి. […]