May 8, 2024

చంద్రోదయం 22

రచన: మన్నెం శారద “అయితే మీ ఆవిణ్ని తీసుకొచ్చే ప్రయత్నం యిప్పుడప్పుడే లేదంటావు” అని అపరిచితమైన కంఠం. “ఆవిడ నేనడిని కట్నం పూర్తిగా తీసుకొస్తేనే నా గడప తొక్కేది. అంతవరకూ రానిచ్చే ప్రసక్తి లేనే లేదు” అది మోహన్ కంఠం. “చాలా అన్యాయంరా!” మోహన్ గట్టిగా నవ్వేడు. “ఏది అన్యాయం. ఇస్తానన్న కట్నం ఎగ్గొట్టి పిల్లని నా గొంతుకి కట్టి పంపటమా?” “పాపం. ఆయన సర్దుకోలేకపోయేడు. మధ్యలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది” “ఆడపుటక పుట్టినందుకు అనుభవిస్తుంది” […]

చంద్రోదయం – 21

రచన: మన్నెం శారద ఎప్పట్లా చిరునవ్వుతో ఎదురు వెళ్లలేకపోయేను. అది భయం కాదు. మనసులో యేదో స్పందన కలుగుతోంది. ఏవిటది? ఆలోచనలకందని మధురస్వప్యం ఏదో నా కళ్లముందు కదులుతోంది. పనిపిల్లతో కాఫీ పంపించేను. “మీ అమ్మగారు ఘోషా చేస్తున్నారా?” అని అతను అడగటం నాకు విన్పిస్తూనే వుంది. అయినా అప్పటికి నేను బయటికి వెళ్లలేదు. “మైడియర్ స్వాతి మేడంగారూ. మీరు ఆఫీసుకు ఎందుకు రాలేదో, ఏమైందో కనుక్కుందామని వచ్చేను. కారణం చెబితే ఈ దీనుడు సెలవు తీసుకుంటాడూ” […]

చంద్రోదయం – 20

రచన: మన్నెం శారద “ఓహో!! ఆడవాళ్ల వయసడగకూడదనుకుంటాను” అన్నాడు కళ్లెగరేస్తూ. “అబ్బే అందుకోసం కాదు. నా వయసు నా సర్వీస్ రిజిస్టర్ తీస్తే మీకే దొరుకుతుంది. ఇందులో దాచేదేమీ లేదు” అన్నాను. మోహన్ మర్నాడు నవ్వుతూ “మీ వయసు ఇరవై నాలుగేళ్ళు” అన్నాడు. నాకు ఆశ్చర్యం కల్గింది. అతను నేను తమాషాగా అన్నదే చేసి వచ్చేడు. నా సర్వీసు రిజిస్టరు వెరిఫై చేసేడు. “ఇంతకీ మీ వయసెందుకడిగేనో తెలుసా?” నా కళ్లు ఆందోళనతో రెపరెపలాడేయి. “ఇన్నాళ్ల మన […]

చంద్రోదయం – 19

రచన: మన్నెం శారద “ఇది జరిగి రెండేళ్ళు అవుతోంది. డిపార్టుమెంటు రూల్స్ ప్రకారం శేఖర్ ఆఫీసులో నాకు క్లర్క్ పోస్ట్ యివ్వటం, నేను జాయినవ్వటం మీకు తెలుసు. ఆ విషయంలో మీరు మాకనేక విధాలుగా సహాయం చేసి ఆదుకున్నారు. అయినా కూడా నేను మిమ్మల్ని నొప్పించి పంపేసేను. అప్పటి పరిస్థితులు, ఆవేశం అలాంటివి. శేఖర్ నన్ను ఎంతో ఆదరణగా చూసేరు. ఆయనతో గడిపిన జీవితం చాలా చిన్నదయినా ఎంతో అపురూపమైనది. అంత మంచి వ్యక్తిని భర్తగా ప్రసాదించిన […]

చంద్రోదయం – 18

రచన: మన్నెం శారద శేఖర్ యింటి గృహప్రవేశం చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. చాలా ముఖ్యులయిన వాళ్లను మాత్రమే పిలిచేడు శేఖర్. పనిలోపనిగా పిల్లవాడి బారసాల కూడా జరిపించేడు. బాబుకి “ఆశాకిరణ్” అని నామకరణం చేసేరు. సారధి బాబు మెడలో పులిగోరు పతకం వున్న గొలుసు వేసి దీవించేడు. “ఇప్పుడీ ఖర్చెందుకు?” అంటూ కోప్పడ్డాడు శేఖర్. “నువ్వు నాకోసం చేసిన ఖర్చులో యిది యెన్నో వంతురా? నా సరదా కూడా తీర్చుకోనీ!” అన్నాడు సారధి నవ్వుతూ. అందరూ ఉత్సాహంగా […]

చంద్రోదయం – 17

రచన: మన్నెం శారద ఆ రోజు శేఖర్‌కి కొడుకు పుట్టేడని, అంతేగాకుండా ఇసక తోటలో హౌసింగ్ బోర్డు ఫ్లాటొకటి అతనికి ఎలాటయిందని తెలియగానే ఎంతగానో సంతోషించేడు సారధి. పదిహేను రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్నాడు. ఆ చేతులతోనే బాబుకి బారసాల కూడా చెయ్యాలనుకున్నాం. కాబట్టి అందరూ రావల్సిందని, అదీ నెలరోజులకి తక్కువ కాకూడదని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉత్తరం రాసేడు శేఖర్. ఆ ఉత్తరం చూసిన దగ్గరనుంచి సావిత్రమ్మ పోరు ఎక్కువయింది. “సెలవు సంగతి చూడరా. అందరం వెళదాం. సునందని చూసి […]

చంద్రోదయం 16

రచన: మన్నెం శారద “ఈ రోజు నానీ బర్త్‌డే” స్వాతి ఎటో చూస్తున్నట్టుగా చెప్పింది. వాష్‌వేసిన్ దగ్గర అద్దం ముందు నిలబడి షేవ్ చేసుకొంటున్న సారధి వెనక్కి తిరిగి చూసేడు. “ఈజిట్?” అంటూ. అప్పటికే స్వాతి లోపలికి వెళ్లిపోయింది. ఆమె చెప్పింది తనకేనని సారధికి తెలుసు. త్వరగా షేవింగ్ అయిందనిపించి స్వాతి ఉన్న గదిలోకి వచ్చేడు. స్వాతి నానికి తల స్నానం చేయించి ఇస్త్రీ బట్టలు తొడుగుతోంది. “నిన్న చెప్పలేదేం? ఆఫీసు నుండి వచ్చేటప్పుడు కొత్త బట్టలు […]

చంద్రోదయం 15

రచన: మన్నెం శారద ఇంతకూ అతను తనని నిజంగా ప్రేమించి వుండక పోవచ్చు. ఆ వయసు కుర్రాళ్లలా తమాషాకి అతనూ చేయి వూపి వుండొచ్చు. నిజంగా ప్రేమించి వుంటే తనని వెతుక్కుంటూ రాడూ. తన ప్రేమని తెలుపుకోడూ. ఇలా రోజూ ఎంతమందిని చూసి చిరునవ్వులొకల బోస్తాడో.”టాటా” చెబుతాడో. ఆమె నిస్పృహగా నిట్టూర్చింది. అయినా ఆమె విశాలమైన కళ్లు ఎన్నాళ్లపాటో రెప్పవేయడం మర్చిపోయి రోడ్లన్నీ అతని కోసం గాలించేవి. కనీసం అతని పేరు కూడా తెలియదు. ఏం చేస్తాడో […]

చంద్రోదయం – 14

రచన: మన్నెం శారద సారధి బ్యాంక్ నుంచి వచ్చేటప్పటికి టేబుల్ మీద లెటర్ వుంది. అది శేఖర్ దస్తూరి గుర్తుపట్టేడు సారధి. వెంటనే ఆత్రంగా విప్పేడు. డియర్ సారధి, నువ్వెళ్లిపోయాక వైజాగ్ కళ పోయింది. సముద్రం చిన్నబుచ్చుకుంది. బీచ్ రోడ్డు బావురుమంటోంది. ఎల్లమ్మ తోట సెంటర్ వెలవెలా బోతోంది. మరి నీకక్కడ ఎలావుందో? ఈ పరిస్థితిలో స్వాతే లేకపోతే నీ ఎడబాటు నాకు పిచ్చెక్కించేసేదే. నీ బెంగవల్లనేమో నా ఆరోగ్యం కాస్త దెబ్బతింది. మరేం కంగారుపడకు. కాస్త […]

చంద్రోదయం 13

రచన: మన్నెం శారద అతని కళ్ళు మసకబారుతున్నాయి. చీకటిని మింగుతోన్న సముద్రం నల్లగా మారుతోంది. అతని కళ్లనుంచి రెండు వేడి కన్నీటి బొట్లు జారిపడ్డాయి. ఇప్పటికే శేఖర్‌కి తానన్ని విభాగాలుగా రుణపడిపోయి వున్నాడు. ఇంకా అతన్ని స్నేహం పేరుతో దోచలేడు. శేఖర్ మనస్ఫూర్తిగా స్వాతిని ఇష్టపడుతున్నాడు. పెళ్ళికూతుర్ని చూసి వచ్చిన దగ్గర నుంచి ఊహాలోకంలో తేలిపోతున్నాడు. అలాంటి శేఖర్‌కి నిజాన్ని చెప్పి అఘాధంలోకి త్రోయలేడు. ఈ రోజు తను, తన వాళ్ళు ఇలా సుఖంగా బ్రతకటానికి అతనే […]