March 19, 2024

దివి నుండి భువికి

రచన: చెంగల్వల కామేశ్వరి “రేపేనా నువ్వు వెళ్లేది? అడిగాడు శర్మ “అవునండీ! కొంచెం హుషారుగా బదులిచ్చాడు ఈశ్వర్, వచ్చాకా విశేషాలు చెప్పు! అంటున్న మామగారి మాటలకు ‘ఉండేది ఒకరోజు! ఏముంటాయి. ?’ మళ్లీ ఇక్కడికే రావాలి. ఇలాగే ఉండాలి. వాళ్లక్కడ మనమిక్కడ” ఉదాసీనంగా అంటున్న ఈశ్వర్ మొహం చూసి, ఒకసారి దీర్ఘంగా నిట్టార్చారు శర్మగారు . “నిజమే! కాని ఏం చేయగలం? మనకి మాత్రం ఇష్టమా! మనవాళ్లందరిని వదిలి ఇలా ఉండటం . “వలస పక్షుల్లా చెట్టుకొకరు […]

యాత్రా మాలిక – నేపాల్ యాత్రా విశేషాలు

రచన: చెంగల్వల కామేశ్వరి అందరికీ నేపాల్ యాత్ర అనగానే గుర్తొచ్చేవి. పశుపతినాథ్, ముక్తినాథ్, మణి మహేష్ హిమాలయాలు ట్రెక్కింగ్ మౌంట్ కైలాష్ ఇంకా ముందుకెడితే మానససరోవరయాత్ర ఇలా ఎన్నో ప్రదేశాలు గుర్తొస్తాయి.కానీ అన్నీ తలొక మూలా ఉంటాయి. నేపాల్ వెళ్లాలంటే ముందుగా గోరక్ పూర్ కాని పాట్నా కాని రైలులోనో, విమానంలోనో, వెళ్లి అక్కడినుండి పోఖ్రా విమానంలో కాని, రోడ్ మార్గాన కాని వెళ్లొచ్చు. ఖాట్మండ్, లుంబిని, చిట్వాన్, మనోకామన, అన్నీ రోడ్ మార్గానా ప్రయాణం చేయొచ్చు. […]

గోడమీద బొమ్మ

రచన: చెంగల్వల కామేశ్వరి సాయంత్రపు సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి ఆకాశపు నీలాన్ని కాజేసినట్లుగా, నీలపురాశిలా మెరిపోతోంది. వేగంగా తెల్లని నురుగులుతో ఒడ్డుకి కెరటాలని తోస్తోంది. అంతే నెమ్మదిగా వెన్నక్కి వెళ్లిపోతోంది. ఇసకలో కాళ్లు కూరుకుపోతుంటే చేతుల్లో బరువయిన సంచీ అతికష్టం మీద మోసుకు వస్తూన్న పరమేశానికి ఆయాసం ఎగతన్నుతోంది. నడవలేక నడవలేక నడుస్తున్న పరమేశాన్ని చూసి పరుగులు తీస్తూ సముద్రం వైపు వెడుతున్న ఒక అబ్బాయి. “తాతా బ్యాగ్ బరువుగా ఉందా ఇలా ఇవ్వు నేను తెస్తా!” […]

నవరసాలు..నవకథలు.. భయానకం ..2

రచన: చెంగల్వల కామేశ్వరి “హెల్ప్ మి” భలే సంతోషంగా ఉందిరా ! ఎప్పటినుండో అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది ఇలా ట్రైన్ లో అరకు వెళ్లాలని. అంటున్న వాసు మాటలకి నవ్వేసి ఏం చేస్తాము? ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదరదు. ఆ గోపాల్, వర్మ , రాంబాబు గొడవ ! ఎప్పుడూ మేమే రావాలా! ఎక్కడెక్కడివాళ్లో వస్తున్నారు. మీరిద్దరూ రారేంటిరా ! ఆ భాగ్యనగరంలో ఉన్నారని పెద్దబడాయి.” అని సాధింపులు. ఇంట్లో పెళ్లాం పిల్లలని వదిలి, బాస్ గాడికి […]

Something Special – ముచ్చర్ల రజనీ శకుంతల

సాహితీ కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, ప్రమదాక్షరి సమావేశాలు మొదలైనవాటిలో చురుగ్గా పాల్గొనే ఒకావిడ కొన్నేళ్ల క్రితం పాఠకులను ఉర్రూతలూగించే రచనలు చేసి ఎన్నో కథలు, వ్యాసాలు, నవలలు, సీరియళ్లు, టీవీ ప్రోగ్రాములు మొదలైనవి చేసిన ప్రముఖ రచయిత్రి అని తెలిస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా.. నరుడా ఏమి నీ కోరిక, ప్రియా ప్రియతమా, ఒక గుండె సవ్వడి, మనమిద్దరం లాటి పాపులర్ టీవీ సీరియళ్లు,వంశీ ఆర్ట్స్, కళానిలయం, జ్యోత్స కళాపీఠం, మయూరి ఆర్ట్స్ , […]

కాఫీ విత్ కామేశ్వరి – సమీక్ష

రచన: నండూరి సుందరీ నాగమణి కం. కామేశ్వరితో కాఫీ ఆమే చెప్పెను కబుర్ల నలవోకనిదే గోముగ విహరించగనే తామిక రండి, ముదమున తనివిని పొందన్! ‘కాఫీ విత్ కామేశ్వరి’ – అండ్ కబుర్లు… అదేనండీ, కామేశ్వరితో కాఫీ మరియు తను కమ్మగా చెప్పే కబుర్లు అన్న మాట! రోజుకో చక్కని అంశం తీసుకుని, వేడి వేడి ఆనంద్ సినిమాలాంటి కాఫీని తా(లా)గిస్తూ తన కబుర్లతో ఎక్కడెక్కడికో తీసుకుపోయి మళ్ళీ తీసుకువచ్చేస్తుంది కామేశ్వరి… ఒకటా రెండా, డెబ్భై ఏడు […]

తిక్క కుదిరింది… గొలుసు కథ

తిక్క కుదిరింది.. గొలుసు కథ 1 రచన: రజనీ శకుంతల సుమలత మంచి సింగర్ ” ఎంత అంటే పుట్టిన వెంటనే తన ఏడుపు కూడా స—-రి— గ—మ –ప —లానే రాగయుక్తంగా ఏడిచిందని ఆమె తల్లి అరుంధతి ఇప్పటికి ఏడు లక్షల ఒకటోసారి చెప్పింది. ఇంకా చెప్తోనే ఉంది. ప్యూచర్ లో కూడా చెప్తూనే ఉంటుంది. ఇంత రిధమిక్ గా ఏడవబట్టే మూడో సంవత్సరానికే సంగీతం క్లాస్ కి పంపింది.తల్లి. అలా అలా స్వరాలు వగైరా […]