May 9, 2024

ట్రాఫిక్ కంట్రోల్

రచన:  మణి గోవిందరాజుల…. కారు చాలా స్మూత్ గా వెళ్తున్నది రెండేళ్ళ తర్వాత విదేశాల నుండి వచ్చిన గౌరవ్ కిటికీ లో నుండి కనపడుతున్న సిటీ ని చూసి  చాలా ఆశ్చర్యపోయాడు.   “అరేయ్ ప్రకాశ్ నన్నొకసారి గిల్లరా? ఇది కలా నిజమా? ఇది హైదరాబాదేనా? లేక నేను ఇంకా యూయెస్ లోనే వున్నానా?” అడిగాడు “నువు హైదరాబాద్ వచ్చావు.   నేను నిన్ను తీసుకుని ఎయిర్పోర్ట్ నుండి ఇంటికెళ్తున్నాను.   ఇది నిజం.   ముమ్మాటికీ నిజం” హాస్యంగా చెప్పాడు ప్రకాశ్. […]

చీకటిలో చిరుదివ్వె

రచన: మణికుమారి గోవిందరాజుల పడక్కుర్చీలో కూర్చుని ఊగుతూ తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నది శాంత.. చేతిలో తమ్ముడు ఎర్రడు రాసిన వుత్తరం అలానే ఉంది. అప్పటికి ఎన్నిసార్లు చదివిందో. చదివిన ప్రతిసారీ గుండెల్లో బాధ రెట్టింపవుతున్నది.. ఏడాదిగా మర్చిపోయిన గతాన్ని అది కూకటి వేళ్ళతో పైకి లాగుతున్నది.వద్దనుకున్న బంధాలను వదిలించుకోలేవంటున్నది. బాధ పడటం నీ జన్మహక్కు..కాదనుకుంటే కుదరదంటున్నది. కళ్ళల్లోనుండి నీళ్ళు కారుతున్నది కూడా తెలియటం లేదు. ఇంతలో లాండ్ లైన్ ఫోన్ మోగింది. కళ్ళుతుడుచుకుని యెవరా అని […]

నిన్నే ప్రేమిస్తా………

రచన: మణికుమారి గోవిందరాజుల “యేమిటలా చూస్తున్నావు?” “స్ఫటికం లాంటి నీ మనసుని. యెంత స్వచ్చంగా మెరిసిపోతూ కనపడుతున్నదో” తన్మయంగా అన్నది. “నా మనసులో యేముంది? నిన్ను నువ్వు చూసుకో యెంత అందంగా కనపడతావో?” “నేనా? అందంగానా? వెక్కిరిస్తున్నావా? యెటుపోయింది ఆ అందమంతా?” దుఃఖంతో గొంతు పూడుకు పోయింది. “మై డియర్ సాజీ నాకు ఇప్పుడు నువు వేరేగా కనపడవు. అప్పుడెలా వున్నావో ఇప్పుడూ అలానే కనపడతావు” “అయినా ఇదిగో ఇలా మాట్లాడావంటే నేను నీ దగ్గరికే రాను” […]

కాంతం వర్సెస్ కనకం……

రచన: మణికుమారి గోవిందరాజుల   ఆ రోజు వాళ్ళ పెళ్ళిరోజు.   పొద్దున్నే  పట్టిన ముసురులా కాంతానికి  కనకానికి మొదలైన పోట్లాట ఇంతవరకు తెగడం లేదు. ఇద్దరూ కూడా నువ్వంటే నువ్వని అనుకోవడంతోనే సరిపోతున్నది  . యెవరేమి చేసారో   సోదాహరణ ఉదాహరణలతో సహా చెప్పుకుంటున్నారు.  ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని  పట్టుమీదున్నారు.  పైన అద్దెకున్న వాళ్ళొచ్చి సంధి కుదర్చబోయారు కానీ వాళ్ళను కరిచినంత పని చేసి వెళ్ళగొట్టారు. ముప్పయేళ్ళ సంసార జీవితంలో  చాలాసార్లు యేదో ఒక విషయానికి […]

నవరసాలు..నవకథలు.. రౌధ్రం 7

రచన: మణికుమారి గోవిందరాజుల ఆదిశక్తి “ఆంటీ నేను ఇక్కడ మీతో పాటు కూర్చోనా నేనెక్కిన కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా వుంది. నాకు భయమేస్తున్నది. మీరున్నారని చెప్పి టీసీ నన్నిక్కడికి పంపారు” ఆడపిల్ల గొంతు విని తలెత్తింది సుకన్య. ఇరవై యేళ్ళుంటాయేమో రిక్వెస్టింగ్ గా అడుగుతున్నది. “అయ్యో దానికి నన్నడగడమెందుకు? నా బెర్త్ కాదుగా నువ్వడిగేది? ”నవ్వింది. నిజమే ఈ రోజేంటో అన్ని కంపార్ట్మెంట్సూ ఖాళీగా వున్నాయి. టీసీ అదే చెప్పి తలుపులు తెరవొద్దని చెప్పి యేమన్నా అవసరం […]

కాంతం సంఘసేవ

రచన: మణికుమారి గోవిందరాజుల     కాంతానికి దిగులెక్కువయింది. ముఖ్యంగా “స్వచ్ఛ్ భారత్ వుద్యమం “ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన దగ్గరనుండి తాను దేశానికి యేమీ చేయలేక పోతున్నాను అన్న బాధ యెక్కువయ్యి అన్నం కూడా సయించడం లేదు. వూహ తెలిసినప్పటి నుండి కూడా కాంతానికి సొసైటీకి యేదో ఒకటి చేసి మాతృదేశానికి తన వంతు సేవ అందించాలనేది చాలా గాఢమైన కోరిక. అదేమి చిత్రమో యేది చేద్దామన్నా యేదో ఒక అడ్డంకి వచ్చేది. యెవరికన్నా చెప్తే నవ్వుతారేమో […]

డే కేర్..

రచన: మణికుమారి గోవిందరాజుల “ వర్ధనమ్మా డే కేర్” లోపలికి వస్తూ ఆ బోర్డుని ఆప్యాయంగా చూసుకుంది సరళ . వర్ధనమ్మ సరళ తల్లేమో అనుకుంటే పప్పులో కాలేసారన్నమాటే. . అత్తగారిని తల్చుకుని మనసులోనే దండం పెట్టుకుంది. ఆ రోజు వర్ధనమ్మా డే కేర్ వార్శికోత్సవం. అందుకే డే కేర్ అంతా చాలా హడావుడిగా వుంది . లోపలికి వెళ్ళి మధ్య హాలులో నిల్చుని చుట్టూ చూసింది. . అత్తగారు నవ్వుతూ చూస్తున్నట్లు అనిపించింది. చిన్నగా ఆఫీసు […]

శ్రమజీవన సౌందర్యం

రచన: మణికుమారి గోవిందరాజుల “ప్రతి ఒక్కళ్ళూ కూడా తమ స్వార్ధం తాము చూసుకోకుండా కాస్త అందరికీ సహాయపడటం అలవాటు చేసుకోవాలి. ఒక వెయ్యి సంపాయించామంటే కనీసం ఒక్క రూపాయన్న యెవరి సహాయనికైనా ఇవ్వగలగాలి. యెన్నాళ్ళుంటామో తెలియని ఈ జీవితంలో మనం పోయాక కూడా మనల్ని జీవింపచేసేది అలా చేసిన సాయమే. సహాయం పొందిన వాళ్ళు మనని తల్చుకుంటే వాళ్ళ మనసుల్లో మనం జీవించి వున్నట్లే కదా?అదన్నమాట. నా వరకు నేనైతే యెవరికే సహాయం కావాలన్నా ముందుంటాను. అలా […]