April 27, 2024

ధృతి – 13

ఆఖరు భాగం రచన: మణికుమారి గోవిందరాజుల ఆ రోజు రాత్రి అన్నం తింటున్నప్పుడు చెప్పింది తాను చేసిన ఘనకార్యం. నిర్ఘాంతపోయి చూస్తుండిపోయింది తులసి. “అదేంటే? ఇప్పుడు వద్దు అనుకున్నాముగా? పరీక్షలు దగ్గరకొస్తుండగా నీకిది అవసరమా? దీని పర్యవసానం నీ చదువు మీద పడితే నువు ఎంత డిస్ట్రబ్ అవుతావు? ఇప్పుడు నీ పిలక వాళ్ళ చేతుల్లో ఉన్నది” లబలబలాడింది. “అమ్మా! ఆయనది అంత చీప్ మెంటాలిటీ కాదు. నువ్వేమీ కంగారు పడకు. ఇప్పుడు నేనేమీ చెప్పకపోతే, అది […]

ధృతి – 10

రచన:-మణి గోవిందరాజుల “అమ్మా! అంతా బానే అయింది కానీ… ఆ పెళ్ళి వాళ్ళ ప్రవర్తనే నాకు నచ్చలేదు. కరణం అంకుల్ని అలా తీసిపడేసింది ఒక చిన్న పిల్ల. పెద్దవాళ్ళు కనీసం చెప్పనన్నా లేదు. మగపిల్ల వాళ్ళు అనగానే అంత పొగరుగా ఉంటారా?” అక్కడి విశేషాలన్నీ చెప్తూ తాంబూలాల సందర్భంలో జరిగిన సంఘటన చెప్తూ ఆశ్చర్యంగా అడిగింది. “ఆ అమ్మాయి స్వభావం అది అయి ఉంటుంది. రేపు ఆ అమ్మాయి తన పెళ్ళిలో కూడా తాను తగ్గదు. అప్పుడు […]

ధృతి – 9

రచన: మణికుమారి గోవిందరాజుల బద్దకంగా కళ్ళు విప్పింది ధృతి. అప్పటికే లేచి ఆడుకుంటున్న ఆర్తి కార్తి కేకలతో మెలకువ వచ్చిందే కాని, లేవబుద్ది కావడం లేదు. బెడ్ కి పక్కనే ఉన్న కిటికీలో నుండి బయటికి చూసింది. కింద గార్డెన్ లో శివ పిల్లలు బాల్ ఆట ఆడుకుంటున్నారు. ఇంట్లో ఎంత లేపినా లేవని ఆర్తీ కార్తీ, ఇక్కడికి వస్తే మటుకు సూర్యోదయం కాకముందే లేస్తారు. శివతో ఆడుకోవటం వాళ్ళకు చాలా ఇష్టం. ఆ చెట్లల్లో పడి […]

ధృతి – 8

రచన: మణికుమారి గోవిందరాజుల “నాన్నా! దినేష్… కరణం గారింట్లో ఎంగేజ్మెంట్ రేపే కదా. వెళ్ళకపోతే ఆయనకు బాగా కోపం వస్తుంది. ఇక మేము బయలుదేరుతాము. అన్నట్లు శనాదివారాలే కదా? మీరంతా కూడా రావచ్చు కదా?” మర్నాడు సాయంత్రం కాఫీలయ్యాక పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా చెప్పింది బామ్మ. “నాన్నా! నాన్నా… వెళ్దాం నాన్నా. ప్లీజ్ నాన్నా” ఆర్తీ కార్తీ తండ్రి వెంట పడ్డారు. “అమ్మా! ఒక పని చెయ్యి. నాకు రావడం కుదరదు కానీ పిల్లల్ని తీసుకెళ్ళు. రేపు రాత్రికి […]

ధృతి – 7

రచన: మణి గోవిందరాజుల “రంగా! అడ్రెస్ షేర్ చెయ్యవే… మేము రడీగా ఉన్నాము. మీ ఇంటికే బ్రేక్ ఫాస్ట్ కి వస్తున్నాము. నిన్న నీ మనవరాలిని చూసినప్పటినుండీ నా మనసంతా అమ్మాయి మీదే ఉన్నది. ఏమైనా సరే ఆ సంగతి తేల్చుకోవడానికే వస్తున్నాను, నా మనవడిని తీసుకుని…” అవతలనుండి పెద్దగా వినపడ్డ మాటలకు మత్తు పూర్తిగా వదిలింది. టైము చూస్తే ఇంకా ఆరు కూడా కాలేదు. “ఒసే! సువ్వీ… బుద్ది ఉందటే? పొద్దున్నే తయారయ్యావు? కాస్తాగు. నేను […]

ధృతి పార్ట్ – 5

రచన: మణికుమారి గోవిందరాజుల “స్వాతీ! మనం ఇద్దరమూ జీవితాంతం కలిసి సంతోషకరమైన జీవితం గడపాలని ప్రమాణాలు చేసుకుని పెళ్ళి చేసుకున్నాము. చిన్న చిన్న గొడవలూ, అపోహలూ ప్రతి ఇంటా మామూలే. . . సర్దుకుపోతూ ఉంటాము. కానీ పెద్దవాళ్ళను అవమానించడం అనేది కూడని పని. స్వాతీ. . . నువు మంచి భార్యవి. ఖచ్చితంగా మంచి తల్లివి కూడా అవుతావు. కాని మంచి కోడలిగా కూడా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది. మీ అమ్మా నాన్నలు కూడా […]

ధృతి – 3

రచన:మణి గోవిందరాజుల… “హే! ధృతీ కంగ్రాట్స్… శేఖరం గారినే మెప్పించావు హార్టీ కంగ్రాట్స్” అభినందనలు వెల్లువలా కురిశాయి. “ధృతీ, ఇక వెళ్దామా? బాగా అలసి పోయావు!” దినేష్ వచ్చి అడిగాడు. “అదేమీ కుదరదు.అంకుల్… ఇంత పెద్ద సక్సెస్ మేము ఎంజాయ్ చేయాల్సిందే. మేమొచ్చి దింపుతాము. ప్లీజ్! అంకుల్, మీరెళ్ళండి. మేము క్యాంటీనుకెళ్ళి ఏమన్నా తిని, తాగాక బయలుదేరుతాము” అప్పుడే వెళ్ళడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. చేసేది లేక భార్యను, పిల్లల్ని తీసుకుని దినేష్ వెళ్ళిపోయాడు. అందరూ కలిసి పొలో […]

అత్తగారూ… ఆడపడుచు…

రచన: — మణి గోవిందరాజుల “రండి రండి వదినగారూ! నిన్న ఉండమంటే ఉండకుండా వెళ్ళారు. ఈ రోజు ఇంత ఆలస్యంగానా రావడం?” లోపలికి వస్తున్న వియ్యాలవారిని ఎదురెళ్ళి సంతోషంగా ఆహ్వానించారు దమయంతీ వాసుదేవ్ లు. “కాస్త ఊళ్ళో సెంటర్లో ఇల్లు తీసుకోవచ్చుకదండీ. వందసార్లు తిరిగే వాళ్ళం. అబ్బ! వదినగారూ! చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. మీరు ఈ చీరలో సూపరున్నారండీ” సరదాగా మాట్లాడుతూనే పొగడుతూ లోపలికి వచ్చింది పెద్ద వియ్యపురాలు. మురిసిపోయింది దమయంతి. “మీరు మరీను..రండి లోపలికి” చిన్నకోడలు సీమంతం […]

సౌందర్య భారతం

రచన: మణికుమారి గోవిందరాజుల “వేదా ఎక్కడికెళ్తున్నావే? పిన్ని వద్దని చెప్పింది కదా? మళ్ళీ అక్కడికేనా?” “అవునక్కా!” “పెద్దవాళ్ళు వద్దని చెప్పినప్పుడు వినాలి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే కదా?” “అక్కా! నేను చేసేది కూడా మన మంచికే అక్కా! అందరమూ మనకెందుకులే అనుకుంటే ఎలా అక్కా?” “ఏమోనే! నువు చేస్తున్నది మంచికా చెడుకా అనేది కాదు. కాని వద్దన్నప్పుడు చేయడం ఎందుకు?” అడుగుతున్న కీర్తనను జాలిగా చూసింది వేద. “అక్కా నీకొకటి చూపిస్తాను రా…” అని […]

జీవనయానం

రచన: మణి గోవిందరాజుల “నాన్నా! అమ్మ వున్నన్నాళ్ళూ మాకు ఓపికలున్నాయి . అక్కడికి వచ్చి వుండలేమని రాలేదు. పోనిలే ఇద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు వున్నారు కదా అని నేను మాట్లాడలేదు. . మన దురదృష్టం అమ్మ వున్నదున్నట్లుగా మాయమయింది. ”కళ్ళు తుడుచుకున్నాడు అశ్విన్. “ఇప్పుడు అమ్మలేదు. ఒక్కడివి యెంత ఇబ్బంది పడుతున్నావో అని మాకు యెంత బెంగగా వుంటుందొ తెలుసా?” కంఠం రుద్దమయింది. “ఇప్పుడు నాకు నేను చేసుకునే ఓపిక వుందిరా. అది కూడా తగ్గాక వస్తాను. […]