April 26, 2024

ప్రపోజ్…

రచన: మణి గోవిందరాజుల— “ఛీ! నా జీవితం” అప్పటికి వందోసారి తిట్టుకున్నాడు విశాల్. తనని ఆ పరిస్థితుల్లోకి నెట్టిన ఫ్రెండ్ మీద పిచ్చి కోపం వచ్చింది. “యేమయిందిరా?” కొడుక్కి టీ ఇస్తూ అడిగింది వాళ్ళమ్మ భారతి. “ఈ కక్కుర్తి గాడేమి చేసాడో తెలుసా?” “వాడేమి చేసాడ్రా?మళ్ళీ పెళ్ళి కుదిరింది కదా?” “ఆ! మళ్ళీ మళ్ళీ కుదిరింది” “మళ్ళీ మళ్లీ కుదరడమేంట్రా? ఆ మధ్య ఒకటి చెడిపోయింది కదా? అప్పుడూ ఇంటి కొచ్చినప్పుడు చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి […]

క్షమయా ధరిత్రే కాని……

రచన:  మణి గోవిందరాజుల   విలేఖరుల చేతుల్లోని ఫ్లాష్ లైట్లు చక చకా వెలిగిపోతున్నాయి. అక్కడ అంతా హడావుడిగా వుంది. పోలీసులు జనాన్ని అదుపు చేయలేకపోతున్నారు. హంతకురాలిని చూడడానికి జనం విరగబడి పోతున్నారు. “చీ!చి!  . . అమ్మ అన్నపదానికే అవమానం తెచ్చింది” యెవరో చీదరించుకుంటున్నారు. “ అసలు కన్నకొడుకు కాదేమో. . అందుకే అలా చేయగలిగింది. ” “మన దేశం పరువు తీసింది కదా?ఇలాంటి వాళ్ళను వురి తీయాలి ఆలో చించకుండా” “ప్రపంచ దేశాల్లో మనం […]

అంబులెన్స్

రచన: మణికుమారి గోవిందరాజుల “ఒరే అన్నయ్యా! ఇందాకటి నుండి చెప్తున్నాను . . వెనక అంబులెన్స్ వస్తున్నది. దారి ఇవ్వు. ” “యెహ్! వూర్కో. . . ఇప్పుడు దారి ఇచ్చి పక్కకి వెళ్ళానంటే సాయంత్రానికే మనం చేరేది. . మూవీ టైం అయిపోతున్నది ఒక పక్క. . . . ఇప్పుడు మూవీ గురించి ఆలోచించాలి కానీ సంఘ సేవ అక్కర్లేదు” సినిమాకి టైం అవుతుందన్న హడావుడిలో అన్నాడు. “ఒరే! మనం యెక్కడికో వెళ్ళి యెవర్నీ […]