April 26, 2024

ధృతి – 6

రచన: మణి గోవిందరాజుల “అదిగో బామ్మా అదే ఏఎంబీ మాల్” కార్ బొటానికల్ గార్డెన్ సిగ్నల్ దగ్గరికి రాగానే ఎక్జైటింగ్ గా చూపించారు పిల్లలు. బయటినుండి చాలా పెద్దగా ఉండి ఠీవిగా కనపడుతున్నది ఆ మాల్. “అమ్మో! ఎంత పెద్దగా ఉన్నదో” ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది బామ్మ. “మరేమనుకున్నావ్? అందుకే అక్కడికి వెళ్దామన్నది” ఉత్సాహంగా అన్నారు ఆర్తి, కార్తి. కార్ పార్కింగ్ దగ్గర ఆగగానే బయటికి ఉరికారు ఆర్తి, కార్తి. వాళ్ళకు చాలా ఆనందంగా ఉన్నది. ఎన్ని […]

ధృతి – 1

రచన: మణి గోవిందరాజుల వణుకుతున్న చేతులతో చీటీ ని గట్టిగా పట్టుకుంది ధృతి. “హే! ధృతీ ! తొందరగా తెరువు. ఏమి రాసి వుందో మేము చూడాలి…ధృతి…ఓపెన్ ద స్లిప్…ధృతి…ఓపెన్ ద స్లిప్… రిధమిక్ గా అరవసాగారు చుట్టు వున్న స్టూడెంట్స్. మిగతా విద్యార్థులంతా అరుపులతో ఎంకరేజ్ చేయసాగారు. “రాజారాం మోహన్ రాయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్” లో ఆ రోజు రాగింగ్ జరుగుతున్నది. రాగింగ్ ని ప్రభుత్వం బాన్ చేసినా, సరదాగా చేసుకుంటాము, వయొలెన్స్ లేకుండా […]

పోలుద్దామా మరి?

రచన: మణి గోవిందరాజుల దిగ్భ్రాంతిగా నిల్చుండిపోయింది నందిని..తలుపు విసురుగా వేసి వెళ్ళిన ప్రభు వేపే చూస్తూ. ఎప్పటిలాగే చిన్నగా మొదలయిన గొడవ పెద్దదయింది. అసలు జరుగుతున్నదేమిటో కూడా అర్థం కావడం లేదు. తనకే ఎందుకిలా అవుతుంది? అందరిళ్ళల్లో ఇలానే ఉంటుందా? వంట బాగా రాకపోతే అదో పెద్ద డిస్క్వాలిఫికేషనా? ఇంత చిన్న విషయానికి కూడా అంత పెద్ద గొడవ జరుగుతుందా? ఇహ ముందు ప్రేమికులు ఆ విషయాన్ని రూఢీగా తెలుసుకుని మరీ ప్రేమించాలి.తాను కూడా చాలా హాస్యకథలు […]

అనుకున్నదొక్కటీ. అయినది ఒక్కటీ…

రచన: మణి గోవిందరాజుల. కాంతం మనసు చాలా తృప్తిగా ఉంది ఆ రోజు. ముందు రోజు రాత్రి వెళ్ళి డెప్యుటేషన్ మీద వచ్చే పనమ్మాయి కూతురికి కొడుకు పుడితే ఆ బుడ్డోడికి మంచి బాబా సూట్ కోటీలో కాకుండా పెద్ద షాప్ కి వెళ్ళి కొనుక్కొచ్చింది. దానికి కారణం ఈ మధ్య వైరల్ అయిన ఒక మెసేజ్… మామూలుగా కూడా కాంతం దగ్గర చేస్తున్న పనమ్మాయి అయిదేళ్ళ నుండి వీళ్ళను వదలకుండా వీళ్ళు ఆమెని వదలకుండా చేస్తోంది. […]

చిన్న చిన్నవే కానీ….

రచన: మణి గోవిందరాజుల “యెన్నిసార్లు చెప్పాలి ఆ సెంట్ కొట్టుకోవద్దని? నాకస్సలు నచ్చదని నీకు తెలుసుకదా?” విసుక్కున్నాడు శేఖరం. వుత్సాహంగా బయల్దేరబోతున్న సంధ్య మొహం చిన్నబోయింది. నిజమే శేఖర్ చెప్తుంటాడు తనకు సెంట్ వాసన నచ్చదని, కాని మొదటినుండీ . తనకేమొ చక్కగా తయరయ్యి కొద్దిగా పెర్ఫ్యుం స్ప్రే చేసుకోవడం ఇష్టం. ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని. అందుకని చాలా లయిట్ గా స్ప్రే చేసుకుంది. అయినా పట్టేసాడు. మౌనంగా లోపలికి వెళ్ళబోయింది చీర మార్చుకోవడానికి. “ఇప్పుడు […]

కాంతం_కనకం – ఒక చెత్త కథ….

రచన: మణి గోవిందరాజుల దుప్పటీ ముసుగు తీసి నెమ్మదిగా తల పక్కకి తిప్పి చూసాడు కనకారావు. కాంతం కనబడకపోయేసరికి గుండె గుభిల్లుమంది. “అప్పుడే వెళ్ళిందా వాకింగ్ కి?” నీరసంగా అనుకున్నాడు. అయినా ఆశ చావక “కాంతం” అని పిలిచాడు , పిలిచాననుకున్నాడు. యేదో తుస్ తుస్ మని సౌండ్ వచ్చిందే కాని పిలుపు బయటికి రాలేదు. గొంతు సవరించుకుని మళ్ళీ పిలిచాడు కొంచెం గట్టిగా”కాంతం”.. “వస్తున్నానండి” అంటూ వచ్చి చిరునవ్వులు రువ్వుతూ తన యెదురుగా నిలిచిన కాంతాన్ని […]