April 27, 2024

మారిన తీరు

రచన: లక్ష్మీ రాఘవ కొడుకు వెంకటేశు మాటలు విని శానా కోపం వచ్చింది రామయ్యకు “మా చేత కాదురా. ఎట్లా బతుకుతున్నామో ఆలోచన సెయ్యి.” కాస్త గట్టిగానే అన్నాడు. “ఏమి బతుకు నాయనా? అప్పుడు తాతను చూసినా, ఇప్పుడు నిన్ను చూస్తావున్నా, ఏంది మారింది? అందరి గుడ్డల మురికి వదిలించి మనం పూసుకున్నట్టు వుంది. నీట్ గా ఇస్త్రీ చేసిస్తే వాళ్ళు దర్జాగా ఉంటే చేసిన మనమేమో నలిగిన బట్టల్లోనే వుంటూ…ఛీ …? ఎట్లో నా మొండికి […]

స్పందన

రచన – డా. లక్ష్మీ రాఘవ. శ్రావ్యకు చాలా సంతోషంగా వుంది. ఆ రోజు ఇన్నాళ్ళకి తన పుస్తకం పై సమీక్ష వచ్చింది. అదీ ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఆదివారం అనుబందంలో…. రెండు మూడు వారాలుగా ఆదివారం తెల్లారగానే ఆ ప్రముఖ న్యూస్ పేపర్ కోసం కాచుకునేది . ఎందుకంటే కొన్ని రోజులక్రితం ఆ పేపర్ కు సమీక్ష కొరకై తను రాసిన కథా సంపుటిని పంపింది. అందుకే ఆదివారం రాగానే సమీక్ష వచ్చిందా? అని […]

చిన్న బతుకులు

రచన -డా. లక్ష్మీ రాఘవ రామయ్య కాలుచాపి దారం పేడుతూ కూర్చున్నాడు. “ఎన్ని దారాలు పేడుతావు? బయట పోయేది లేదు, పైసా సంపాదనా లేదు. ఇంట్లో పొయ్యి ముట్టించి ఎన్నాళ్ళయిందో… రోజువారీ ఎవరో ఒకరు రోడ్డు మీద పంచినప్పుడు తినడమే. రాత్రిపూట అదీ గతిలేదు” భార్య శివమ్మకు ఏడుపు ఆగటం లేదు. “ఏడ్చినా పని దొరుకుతుందా? బయటకే పోకూడదాయే ఏమి చెయాల?” అన్నాడు చెప్పులు కుట్టే రామయ్య శివమ్మను జాలిగా చూస్తూ. రోడ్డు మీద చెప్పులు కుట్టి, […]

మల్లేష్

రచన – డా. లక్ష్మీ రాఘవ బస్టాండు లో బెంగళూరు బస్సుకోసం చూస్తూ వున్నాడు దినేష్. అప్పుడే ఒక డీలక్స్ బస్ వెళ్లి పోయిందట. ఒక పదినిముషాలలో ఆర్డినరీ బస్సు వచ్చింది. ఏదో ఒకటి‘ అనుకుంటూ ఎక్క బోయాడు అతన్ని తోసుకుంటూ “అన్నా ఒక్క నిముషం“ అంటూ లోపలకు దూరిన 12 ఏళ్ల కుర్రాడిని చూసాడు దినేష్. ఒక నిముషంలో లోపలకు దూసుకుపోయి మధ్యగా వున్నఒక సీట్ లో కూర్చున్నాడు ఆ పిల్లాడు. బస్సు ఎక్కాక దినేష్ […]

మనసును ఆలోచింపచేసే ఆత్మీయ తరంగాలు

రచన:సి. ఉమాదేవి డా. లక్ష్మిరాఘవ గారు సాహిత్యానికే కాదు తనలోని కళాభిరుచికి నైపుణ్యాన్ని జోడించి అందమైన కళాకృతులను రూపొందించి ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తారు. వృధాగా పారెయ్యవలసిన వస్తువులను కళాత్మకంగా వినియోగించడంలోనే వీరి ప్రతిభ ఆవిష్కృతమవుతుంది. వనిత మహావిద్యాలయలో రీడర్ గా పదవీ విరమణ చేసాక తన సమయాన్ని సాహితీబాటలో విహరింపచేస్తున్నారు. చక్కని కథలతో ఆత్మీయులు అనే కథాసంపుటిని మనకందించారు. ఇరవైమూడు కథలున్న ఈ పుస్తకంలో ప్రతి కథ మనసును తట్టిలేపుతుంది. తద్వారా ఆలోచనకు పునాది పడుతుంది. […]

పిల్లల మనసు

రచన: లక్ష్మీ రాఘవ ‘”మమ్మీ ఈ వారం గిరిజా ఆంటీ వస్తున్నారా? కనుక్కో” హాస్టల్ నుండీ కొడుకు కౌశిక్ ఫోనులో ప్రత్యేకంగా చెప్పడం ఆశ్చర్యం వేసింది. “ఫోన్ చేసి అడుగుతాను. నేనైతే వస్తాను వీకెండ్ . నాన్న రావటానికి కుదరదు. ” “సరే మమ్మీ” ***** ఎంసెట్ కోచింగ్ వున్న రెసిడెన్షియల్ స్కూల్ ల్లో వేసాక పేరెంట్స్ శనివారం కానీ ఆదివారం కానీ వెళ్లి 2 గంటలు గడపవచ్చు. చదువు గురించీ, వాళ్ళ కంఫర్ట్ గురించీ మంచీ […]

మనసుకు చికిత్స

రచన: లక్ష్మీ రాఘవ అక్క భారతి వచ్చిందని చాలా సంతోష౦గా వుంది మూర్తికి. ఒక వయసు తరువాత చిన్ననాటి బాంధవ్యాలు గానీ జ్ఞాపకాలు కానీ తలుచుకుంటూ వుంటే చాలా అపురూపంగా వుంటాయి. రెండు రోజులు ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మరీ ఆనందపడిపోయారు ఇద్దరూ ఆ వయసులో. అక్కా, తమ్ముళ్ళ ముచ్చట్లు వింటూ మురిసింది మూర్తి భార్య రాధ కూడా. భారతి వున్న వూరికి దగ్గరగా ట్రాన్స్ఫర్ అవగానే వెళ్లి భారతిని చూసి వచ్చాడు మూర్తి. అక్క కోడలు […]

సర్దుబాటు

రచన-డా. లక్ష్మీ రాఘవ “శారదా అయ్యిందా ?? కారు వచ్చేస్తుంది” శ్రీహరి తాళంచెవి తీసుకుంటూ.. “ఒక్క నిముషం…జానీ కి అన్నం వేసి, నీళ్ళు పెట్టాలి అంతే ..”అంటూ జానీ అనే తమ కుక్కకి కావాల్సినవి ముందు వరెండా లో ఒక మూల పెట్టి వెళ్లి చేతులు కడుక్కుని, టిఫిన్ డబ్బా పట్టుకుని బయటకు వచ్చింది శారద. శ్రీహరి వెంటనే తలుపులు మోసి లాక్ చేశాడు. ఇద్దరూ గేట్ వరకూ నడవగానే కాబ్ వచ్చింది. జానీ కి ‘టా…టా” […]

ప్రయాణం

రచన – డా. లక్ష్మి రాఘవ ప్రైవేటు బస్సులో నైనా టికెట్ దొరుకుతుందా అని ఉరుకులూ పరుగులుగా వచ్చిన సీతాపతికి బస్సులో టికెట్ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. కానీ సీటు లాస్ట్ లో వుండటం చిరాకనిపించింది. వెనకవైపు కూర్చుంటే బాగా ఎగరవేస్తూ వుంటుంది. రాత్రికి నిద్రపోవటం కూడా వుండదు. పోనీ అదైనా దొరికింది కదా అనుకుని సీటులో కూర్చున్నాడు. మనసంతా చికాగ్గావుంది. భార్య సీతతో తను తండ్రికోసం వూరికి వెళ్ళాలన్న ప్రతిసారీ గొడవే…”మీరొక్కరే కొడుకు కాదు. […]

గాంధీజీ గాయపడ్డారు

రచన: డా.లక్ష్మీ రాఘవ అది ఒక పురాతనమైన గుడి. ఆ రోజు గుడి తలుపులు ఇంకా తెరుచుకోలేదు. పూజారి రావడం ఆలస్యం అయ్యింది. అయినా గుడి వెలుపల హడావిడి రోజూ లాగే మొదలైంది. పక్కన పేర్చి వున్న రాళ్ళు వరసగా పెట్టుకుని పళ్ళ బుట్ట దాని మీద పెట్టింది కామాక్షి. ఎదురుగా వున్నా వరసలో మొదటిగా వచ్చే పూలమ్మి పుల్లక్క అప్పటికే వెదురు బుట్ట లో పూలు రంగులవారిగా పెట్టుకుని నీళ్ళు చల్ల్లుతూంది. నీళ్ళు చల్లినాక పల్చటి […]