April 27, 2024

తెలుగు పండితుడి మసాలా పాట!

రచన: భరద్వాజ్ వెలమకన్ని

 

ఒక తెలుగు పండితుడు విధిలేక ఓ రవితేజ సినిమాకు వ్రాసే మసాలా పాట ఇలా ఉంటుందేమో?

 

పల్లవి: 

 

నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల

నీ చెంపలపై రాసేస్తా చంపకమాల

మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ

నీ  ముక్కు  నుండి పుట్టిస్తా ముత్యాలసరమే … ! 

 

నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల

నీ చెంపలపై రాసేస్తా చంపకమాల

మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ

నీ ముక్కు నుండి పుట్టిస్తా ముత్యాలసరమే … ! 

 

 

చరణం 1: 

 

నీ ఆటా పాటా నాకు ఆటవెలది

నీ తలపు వలపు నాకు తేటగీతి

సింగారించిన నడుము సీసపద్యమే

కందిపోయే నీ బుగ్గ కందమేలే

 

నీ ముక్కు  నుండి పుట్టిస్తా ముత్యాలసరమే … ! 

 

చరణం 2:

 

నువ్వే వయ్యారం వలకబోస్తే భట్టి విక్రమార్కులూ భ ర న భ భ ర వ

నువ్వే అందాన్ని ఆరబోస్తే నల చక్రవర్తి కూడ న జ భ జ జ జ ర 

నీ కాలి అందెల చప్పుళ్ళకి మారు మూల పల్లె కూడ మ స జ స త త గ 

నీ వాలు కళ్ళ చూపులకేమో శతవయో వృధ్ధులూ స భ ర న మ య వ 

 

నువ్వే గురువయితే నేనే లఘువవుతా 

నువ్వే గురువయితే నేనే లఘువవుతా

 

నువ్వే నా తోడయితే య మా తా రా జ భా న సా … 

నీ ముక్కు  నుండి పుట్టిస్తా ముత్యాలసరమే … ! 

 

పల్లవి: 

 

నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల

నీ చెంపలపై రాసేస్తా చంపకమాల


9 thoughts on “తెలుగు పండితుడి మసాలా పాట!

  1. భరద్వాజ గారు – పాట చాల బాగుంది, ఏ రాంగోపాలో వాళ్ళ సినిమాలో పెట్టుకున్నా ఆశ్చర్యంలేదు. ముందు మీ కాపీ రైటు నమోదు చేయించుకోండి తర్వాత గొడవలెందుకు.

  2. హాయ్ భరద్వాజగారు,

    మీ చంధస్సు పాట చాలా బాగుంది. చాలా వైవిధ్యబరితంగా,ఆసక్తికరంగా ఉంది.

  3. భరనభభరవ భరద్వాజ్ గారూ.
    ఆడియోకూడా కొంచెం శ్రమతీసుకుంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *