రచన: భరద్వాజ్ వెలమకన్ని
ఒక తెలుగు పండితుడు విధిలేక ఓ రవితేజ సినిమాకు వ్రాసే మసాలా పాట ఇలా ఉంటుందేమో?
పల్లవి:
నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల
నీ చెంపలపై రాసేస్తా చంపకమాల
మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ
నీ ముక్కు నుండి పుట్టిస్తా ముత్యాలసరమే … !
నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల
నీ చెంపలపై రాసేస్తా చంపకమాల
మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ
నీ ముక్కు నుండి పుట్టిస్తా ముత్యాలసరమే … !
చరణం 1:
నీ ఆటా పాటా నాకు ఆటవెలది
నీ తలపు వలపు నాకు తేటగీతి
సింగారించిన నడుము సీసపద్యమే
కందిపోయే నీ బుగ్గ కందమేలే
నీ ముక్కు నుండి పుట్టిస్తా ముత్యాలసరమే … !
చరణం 2:
నువ్వే వయ్యారం వలకబోస్తే భట్టి విక్రమార్కులూ భ ర న భ భ ర వ
నువ్వే అందాన్ని ఆరబోస్తే నల చక్రవర్తి కూడ న జ భ జ జ జ ర
నీ కాలి అందెల చప్పుళ్ళకి మారు మూల పల్లె కూడ మ స జ స త త గ
నీ వాలు కళ్ళ చూపులకేమో శతవయో వృధ్ధులూ స భ ర న మ య వ
నువ్వే గురువయితే నేనే లఘువవుతా
నువ్వే గురువయితే నేనే లఘువవుతా
నువ్వే నా తోడయితే య మా తా రా జ భా న సా …
నీ ముక్కు నుండి పుట్టిస్తా ముత్యాలసరమే … !
పల్లవి:
నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల
నీ చెంపలపై రాసేస్తా చంపకమాల
పాట సూపరంతే
:)))))) :)) :)))))
భరద్వాజ గారు – పాట చాల బాగుంది, ఏ రాంగోపాలో వాళ్ళ సినిమాలో పెట్టుకున్నా ఆశ్చర్యంలేదు. ముందు మీ కాపీ రైటు నమోదు చేయించుకోండి తర్వాత గొడవలెందుకు.
Adbhutam Bharadwaj garu! Hats Off !
హాయ్ భరద్వాజగారు,
మీ చంధస్సు పాట చాలా బాగుంది. చాలా వైవిధ్యబరితంగా,ఆసక్తికరంగా ఉంది.
ha ha
School lo chaduvukunna chandhassu anta malli okasari gurtukochindi.. Thanks Bharadyaj garu…..
భరనభభరవ భరద్వాజ్ గారూ.
ఆడియోకూడా కొంచెం శ్రమతీసుకుంటారా?
😀 😀